బరువు తగ్గాలని అనుకున్న ప్రతి ఒక్కరు ముందుగా చేసే పని వర్కౌట్స్ చేయడం. కానీ, వర్కౌట్స్ చేయడం వల్ల ఫిట్‌గా మారతారు కానీ, బరువు తగ్గరు. మరి బరువు తగ్గడానికి ఏం చేయాలంటే మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేయాలి. వీటి కారణంగా మెల్లిమెల్లిగా బరువు తగ్గుతారు. అందుకోసం మరి ఏం మార్పులు చేయాలో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకోండి.
మంచి డైట్..
బరువు పెంచడం, తగ్గించడంలో డైట్ కీ రోల్ పోషిస్తుంది. డైట్ అనేది సరిగ్గా ఉంటే బరువు ఈజీగా తగ్గుతారు. ఇందుకోసం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు ప్రోటీన్ అంటే ప్రోటీన్ తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువగా తినరు. బరువు ఈజీగా తగ్గుతారు. ప్రోటీన్ మజిల్స్‌కి కూడా మంచిది. దీంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి.
పోర్షన్ కంట్రోల్..
అదే విధంగా, ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకోవాలి. క్యాలరీలను తక్కువ చేయడం మొదలు పెట్టాలి. దీనికోసం జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌ని తగ్గించాలి. వీటి బదులు హెల్దీ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, బీన్స్, నట్స్ వంటివి తినాలి.
వర్కౌట్..
అదే విధంగా రోజులో ఏదైనా ఓ వర్కౌట్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల బాడీ ఫిట్‌గా మారడమే కాకుండా మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. మీకు ఎక్సర్‌సైజ్ చేయడం ఇష్టం లేకపోతే దాని బదులు డ్యాన్స్, యోగా, వాకింగ్, సైక్లింగ్ ఇలా ఏదైనా మీకు ఇష్టమైన వర్కౌట్‌ని రోజుకి కనీసం అరగంట ఉండేలా చూసుకోండి. వీటి వల్ల మీ బాడీ ఫ్లెక్సీబుల్‌గా కూడా మారుతుంది.
హైడ్రేట్‌డ్‌గా..
అదే విధంగా, మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. మన బాడీ హైడ్రేట్‌గా ఉన్నప్పుడు బాడీలోని అన్నీ అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉండడం వల్లే త్వరగా బరువు తగ్గరు. అందుకోసం కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోండి. దీని వల్ల కచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి.
హెర్బల్ టీలు..
కాఫీ, టీల కంటే హెర్బల్ టీలు చాలా హెల్ప్ చేస్తాయి. వీటిని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి చాలా వరకూ రిజల్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, చమోమిలే టీ వంటివి ట్రై చేయొచ్చు. వీటిని తాగితే ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఒత్తిడిని తగ్గించుకోవడం..
బరువు తగ్గాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకోసం ముందుగా యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎంత ట్రై చేసినా బరువు తగ్గరు. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
నిద్రపోవడం..
ఇక బరువు తగ్గడంలో నిద్ర కూడా కీ రోల్ పోషిస్తుంది. ఎంత హాయిగా నిద్రపోతే మీ బాడీ అంత రిలాక్స్ అవుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. చాలా అధ్యయనాల్లో తేలిందేంటంటే నిద్రలేకపోవడం వల్లే బరువు పెరుగుతారని. కాబట్టి, బరువు తగ్గాలంటే ముందుగా నిద్రపోండి. హాయిగా నిద్రపోయేందుకు డిన్నర్‌ని రాత్రి 7 గంటల్లోపే ముగించేయండి. డిన్నర్, నిద్రకి కనీసం 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉండేలా చూడండి. అదే విధంగా, రాత్రుళ్ళు గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి. దీని వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గుతారు.