Showing posts with label Sleeping. Show all posts
Showing posts with label Sleeping. Show all posts

2.17.2025

Sleeping Tips: రాత్రి పూట ఎడమవైపు పడుకుంటే ఏం జరుగుతుంది? ఇది వింటే ఆశ్చర్యపోతారు!

 


Sleeping Tips: రాత్రి పూట ఎడమవైపు పడుకుంటే ఏం జరుగుతుంది? ఇది వింటే ఆశ్చర్యపోతారు!

ఆరోగ్యకరమైన జీవితానికి (Healthy Life) పౌష్టికరమైన ఆహరంతో పాటు ప్రశాంతమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. రాత్రి సమయాల్లో గంటలు గంటలు ఫోన్లు చూస్తూ సరైన నిద్రలేకపోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి.

కనీసం 7-8 గంటల నిద్ర ఉంటేనే రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొంతమంది త్వరగానే నిద్రపోతారు.. కానీ సరిగ్గా నిద్రపట్టదు. దీనికి ప్రధాన కారణం సరైన స్థితిలో నిద్రపోకపోవడమే అని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు ఎడమ వైపు పడుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడమ వైపు పడుకోవడం ద్వారా మంచి నిద్రతో పాటు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎడమ వైపు పడుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఎడమ వైపు ఎందుకు పడుకోవాలి?

హెల్త్లైన్ నివేదిక ప్రకారం.. రాత్రి సమయాల్లో ఎడమ వైపు పడుకోవడం (Sleeping) వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఎడమ వైపు పడుకోవడం ద్వారా తగ్గిపోతుంది. అంతేకాదు కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల ఫుడ్ పైప్ క్లియర్ అవుతుంది.


గురక నుంచి ఉపశమనం

ఎడమ వైపు పడుకోవడం గురక నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ భంగిమలో గాలి వాయునాళం ద్వారా మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. గాలి ప్రవాహానికి ఆటంకం లేనప్పుడు గురక వచ్చే అవకాశాలు తగ్గుతాయి.


మలబద్ధకం

మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి ఎడమ వైపు పడుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా మలబద్ధకం, అపానవాయువు, గుండెల్లో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.


మెరుగైన నిద్ర

అధ్యయనాలు ఎడమ వైపు పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా శ్వాస సమస్యలు లేదా గురక సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.


గుండె సమస్యలు

గుండె సంబంధింత సమస్యలు ఉన్నవారు.. రాత్రి సమయాల్లో ఎడమ వైపు తిరిగి పడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు.


జీర్ణక్రియను

ఎడమ వైపు పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ పెరిగి జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే అజీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.


గమనిక:ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.