పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్దార్థ్ నీలకంఠ (సాయిరాం శంకర్) డ్రగ్స్ బానిస అవుతాడు. తనకు సన్నిహితురాలైన దివ్య (భానుశ్రీ) హత్య కేసులో నిందితుడిగా ఇరుక్కుపోతాడు. దాంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదా నుంచి కోర్టు తొలగిస్తుంది. తాను నిరపరాధిని అని కోర్టులో డిఫెన్స్ లాయర్ చినబాబు (కళాభవన్ మణి)తో పోటీ పడలేకపోతాడు. ఈ పరిస్థితుల్లో డిఫెన్స్ లాయర్ భార్య శ్వేత హత్యకు గురి అవుతుంది. ఆ నేరం కూడా సిద్దార్థ్‌పైనే పడుతుంది. ఇలా సీరియల్ మర్డర్స్‌తో సిద్దార్థ్ లైఫ్ అగమ్యగోచరంగా మారిపోతుంది.
సిద్దార్థ్ డ్రగ్స్‌కు ఎందుకు బానిస అయ్యాడు? తన భార్య సీత (ఆషిమా నర్వాల్)కు ఏమైంది? అదృశ్యమైన సీత కోసం సిద్దార్థ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? దివ్యను ఎవరు హత్య చేశారు? మర్డర్ కేసులను ఏసీపీ కవిత (శృతి సోది), రఘురామ్ (సముద్రఖని) ఎలా దర్యాప్తు చేశారు. హత్య కేసుల్లో సిద్దార్థ్‌ను పక్కా పథకం ప్రకారం ఇరుకించే ప్రయత్నం చేశారు? చివరకు హంతకుడిని సిద్దార్థ్ పట్టుకొన్నాడా? తాను నిర్దోషినని సిద్దార్థ్ ఎలా నిరూపించుకొన్నాడు? హత్యలకు పాల్పడుతున్న హంతకుడి ఆట ఎలా కట్టించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఒక పథకం ప్రకారం సినిమా కథ.
దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ విషయానికి వస్తే.. మర్డర్ మిస్టరీ పాయింట్ రాసుకొన్న విధానం.. దానిని ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా సన్నివేశాలను డిజైన్ చేసుకొన్న విధానంతో సక్సెస్ సాధించాడు. ఫస్టాఫ్‌లో ఆయన టేకింగ్ విషయంలో కొంత తడబాటు కనిపించినా..సెకండాఫ్‌లో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో స్టోరిని గ్రిప్పింగ్‌గా నేరేట్ చేయడమే కాకుండా సన్నివేశాలను పరుగులు పెట్టించాడు. సాయిరాం శంకర్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగా సిద్దార్థ్ పాత్రను డిజైన్ చేసి ఆయన నుంచి మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్నాడు. కేవలం మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గానే కాకుండా మంచి లవ్ స్టోరీతో, సిద్ శ్రీరామ్‌తో ఫీల్ గుడ్ పాటలతో ఆడియెన్స్ మంచి అనుభూతిని పంచారు.
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సాయిరాం శంకర్ యాక్టింగ్ బాగుంది. లాయర్‌గా, భార్యను మిస్ అయి డ్రగ్స్ బానిసైన భర్తగా, మర్డర్ మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేటర్‌గా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించారు. సినిమా భారాన్నంత తన భుజాల మీద వేసుకొని పూర్తిగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక సముద్రఖని ఓ పెక్యులర్ డైలాగ్ డెలివరీతో కామెడీ పండిస్తే.. శృతి సోది, కళాభవన్ మణి, ఆషిమా నర్వాల్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
అలాగే సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి, స్క్రీన్ ప్లే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు కూడా మంచి ఫీల్‌తో తెర మీద కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన గోపి సుందర్ సెకండాఫ్‌లో చాలా సీన్లను భారీగా ఎలివేట్ చేశారు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లేకు తగినట్టుగా సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు చక్కటి సహకారం అందించారు. నిర్మాతలు వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్, సహనిర్మాతలు జీను మల్లి, స్వాతి కల్యాణి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు చాలా మంది నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి.
ఒక పథకం ప్రకారం సినిమా గ్రిప్పింగ్‌గా, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సాగే లవ్, ఎమోషనల్ డ్రామా. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్టాఫ్‌లో కొంత నిదానంగా నడిచినప్పటికీ.. సెకండాఫ్ రేసీగా సాగి మంచి అనుభూతిని పంచుతుంది. స్క్రీన్ ప్లేలో ఉండే దమ్ముతోనే కథలో విలన్ గుర్తించడానికి పట్టుకొంటే పదివేలు అనే పోటీని పెట్టడం వారికి సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఒక పథకం ప్రకారం తప్పకుండా నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ పక్కాగా ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. ఈ వారం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చూడాలనుకొనే వారు ఈ సినిమాను థియేటర్‌లో తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్ మూవీ.