Showing posts with label BackPain. Show all posts
Showing posts with label BackPain. Show all posts

2.15.2025

Back pain relief Tips: helth tips. Life style. Article show

నడుంనొప్పి ఉందా ? చిట్కాలు..

నడుంనొప్పితో పడుతుంటారు. పలువురు ఎంతో బాధ ఎన్నో రకాలైన మందులు..వ్యాయామాలు చేసిన అప్పుడప్పుడు నడుంనొప్పి బాధ పెడుతూ ఉంటుంది. ఇందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే నడుంనొప్పి నుండి దూరం కావచ్చు.


*. వెన్నెముకకు బలాన్నించే వ్యాయామాలు, క్రమంతప్పకుండా చెయ్యడం నడుమునొప్పికి చెక్ పెట్టవచ్చు. వల్ల కూడా

*.నడుముకు ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి, వాపు వస్తుంది. ఈ సమయంలో వాపు ఉన్న భాగంలో చల్లని లేదా వేడి కాపడం పెట్టడం చేయాలి.

*.నడుము తీవ్రంగా నొప్పి పెడుతున్న సందర్భంలో కొంత సమయం పాటు విశ్రాంతిగా పడుకోవడం మంచిది. కానీ ఈ విశ్రాంతి కొద్ది సమయం పాటు మాత్రమే చేయాలి.

*.వంద గ్రాముల గసగసాలను మెత్తటి పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి.

*.నడుమునొప్పితో పాటుగా జ్వరం, మలబద్దకం, లేక మూత్రవిసర్జన మీద పట్టు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు కూడా బాధిస్తున్నపుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

*. కొబ్బరి, బాదం, నీలగిరి తైలం.. ఇలా ఏదో ఒక నూనెను గోరువెచ్చగా చేసి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో బాగా మసాజ్ చేయాలి.

*.నడుంనొప్పిని తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన
పద్ధతులతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగా, ఈత.. వంటి సులభమైన వ్యాయామాలను చేయడం మంచిది.

*. నొప్పిని, వాపును తగ్గించడానికి ఐస్ ఎంతగానే ఉపయోగపడుతుంది. కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్లో మూటకట్టాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.

BachPain Treatment Articelshow

వెన్నునొప్పికి పరిష్కారం..

శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమే. అందులో వెన్ను కూడా ఒకటి. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం అని పేర్కొన్నవచ్చు. ఇది 33 వెన్నుపూసలతో ఉంటుంది. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ లు సహాయపడతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ బిజి బిజీగా గడిపేస్తుంటారు. దీనితో శరీరంలోని పలు అవయావాలపై ప్రభావం చూపిస్తాయి. అందులో వెన్ను ముక ఒకటి. పలు సందర్భాల్లో వెన్ను నొప్పి బాధిస్తుంటుంది. గంటల కొద్ది కంప్యూటర్స్..ఇతర పనులు చేయడం దీనికి కారణమౌతున్నాయి.


వెన్నునొప్పి వస్తే ఆముదాన్ని వేడి చేసి రాసి చూడండి. అలాగే వెల్లుల్లి పాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనెల వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి చూడండి. కారు.. బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను వాడడం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసం..పాలు..సమపాళ్లుగా తీసుకుని సేవించాలి. వెన్ను నొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగటం వంటివి చేయకూడదు. పిల్లల స్కూలు బ్యాగుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.


బ్యాగులకు పట్టీలు..బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. ఒకే పొజిషన్లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకొనే విధంగా చూసుకోండి.