వెన్నునొప్పికి పరిష్కారం..
శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమే. అందులో వెన్ను కూడా ఒకటి. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం అని పేర్కొన్నవచ్చు. ఇది 33 వెన్నుపూసలతో ఉంటుంది. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ లు సహాయపడతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ బిజి బిజీగా గడిపేస్తుంటారు. దీనితో శరీరంలోని పలు అవయావాలపై ప్రభావం చూపిస్తాయి. అందులో వెన్ను ముక ఒకటి. పలు సందర్భాల్లో వెన్ను నొప్పి బాధిస్తుంటుంది. గంటల కొద్ది కంప్యూటర్స్..ఇతర పనులు చేయడం దీనికి కారణమౌతున్నాయి.
వెన్నునొప్పి వస్తే ఆముదాన్ని వేడి చేసి రాసి చూడండి. అలాగే వెల్లుల్లి పాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనెల వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి చూడండి. కారు.. బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను వాడడం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసం..పాలు..సమపాళ్లుగా తీసుకుని సేవించాలి. వెన్ను నొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగటం వంటివి చేయకూడదు. పిల్లల స్కూలు బ్యాగుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
బ్యాగులకు పట్టీలు..బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. ఒకే పొజిషన్లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకొనే విధంగా చూసుకోండి.
No comments:
Post a Comment