1000 Health Tips: Movie Review
Movie Review లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movie Review లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

జీవితము పెట్టిన పరీక్షలో హీరో? టెస్ట్ రివ్యూ

సిద్దార్హ్ట్,నయనతార,AR మాధవన్ వీరి ముగ్గురు ఒ సినిమా చేసినారు. ఈ సినిమా టెస్ట్ మూవీ లో ఫామిలీ మ్యాన్, రఘు తాత ఈ సినిమాకు రచయిత గాను , సుమన్ కుమార్ ఈ సినిమాకి అందించారు. 

S శశి కాంత్ ఈ సినిమాకు దర్శకునిగా మారారు.  హ్యూమన్ డ్రామాగా ఈ సినిమా రోజు నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ముగ్గురు జీవితాలు ఒక బెస్ట్ క్రికెట్ మ్యాచ్ కి ముడి పెట్టి తీసినదే ఈ సినిమా ప్రేక్షకులకు ఎటువంటి ఫీలింగ్ కలిగించింది? ఇందులో మాధవన్,నయనతార,సిద్దార్ద్ ప్రముఖ స్టార్స్ ను ఎనుకునే అంతగా ఈ కధ లో ఏమిఉంది. 

ఈ సినిమాలో నయనతార ఒక స్కూల్ టీచర్,మాధవన్ ఒక సైన్టిస్తు ఇతని డ్రీం మంచి నీళ్లలో నుండి పెట్రోల్ తయారుచేయటం. దీని కోసము చాల కష్టపడతాడు. సిద్దార్ద్ ఇండియా క్రికెట్ టీం లో స్టార్ ఆటగాడు. క్రికెట్ అంటే ప్రాణము కానీ ఫామ్ లో లేకపోవటం వలన అతని జుట్టు నుండి తీసివేయాలి అని బోర్డు భావిస్తారు. అయితే ఏదో ఒక రకముగా మల్లి జట్టులోకి వస్తాడు. ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఇది చెన్నై లో జరుగుతుంది. సరిగ్గా ఇదే సమయములో బెట్టింగ్ సిండికేటే ఈ ముగ్గురి జీవితములో కి వస్తుంది. జీవితములో ఏమి సాధించలేక అసమర్దుడిగా ఉన్న శెరావన్ అంర్జున్ కొడుకుని కిడ్నప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. తరువాత ఏమి జరుగుతుంది. శరవణన్ చెప్పినట్టు అర్జున్ చేస్తారా లేదా? జీవితములో ఎన్నో కళలు ఉన్న సవన్నన్ అసలు కిడ్నప్ ఎందు చేయాల్సివస్తుందో ఇందంతా ఒక భాగము. 

అయితే ఒక మంచి రచన దృశ్య రూపముగా మార్చుకోవటం.. ఒక పెద్ద కళ . ఈ కధ చదువుతునప్పుడు కధ చాల బాగుంది. అనిపించవచ్చు. అయితే ఈ రచన చూడటానికి పనికివస్తుందా. ఇందులో డ్రామా చూడటానికి ప్రేక్షకులకు అలకరిస్తుందా. అనే విధముగా జడ్జిమెంట్ దర్శకుడి లో ఉండాలి. టెస్ట్ మూవీ లో ఆ జెడ్జిమెంట్ తప్పింది. మనసు లోపలి పొరల్లో జరిగే సంఘర్షణ, మంచి చెడు, హీరో,విలన్,గెలుపు,ఓటమి,ఇంకా స్వార్ధము ఇలా చాల లెటర్స్ ఉన్న కధ లాగా అనిపిస్తుంది. అర్జున్ ఓ పెద్ద స్టార్ క్రికెటర్, తనకి క్రికెట్ అంటే ప్రాణం అర్జున్కి కోచ్ తనలో తప్పులు ఎత్తి చూపుతున్నాడని ఆయన్ని దూరముగా పెడతారు అర్జున్ చివరకి అయన చనిపోయిన కూడా పరామర్శించడానికి వెళ్లారు. చిన్నపుడు కాళీ పెరిగిన కూడా మర్చిపోతాడు. తనకి తనలో ఆడే సత్తువ అయిపోయిన విమర్శలు వస్తున్న ఆటపై మమకారాన్ని వదుకోలేదు. చివరకి కొడుకుని కూడా పన్నగ పెడతారు. ఇలాంటి క్యారెక్టర్ ని చిత్రించిన విధానము మాత్రమూ. చల కహక్కుగా తీశారు. అయితే మ్యాచ్ కి ఒక మూడు రోజులు ఉన్నాయి అనగా టక్ చేసుకొని గ్రౌడ్ లో కి వెళ్లి బిక్కమొహము వేసి చూస్తూ ఉంటాడేమే కానీ బాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసమే శ్రమిస్తున్నట్టు గా ఒక్క విజువల్ ఉండదు. ఇలాంటప్పుడు ఆ క్యారెక్టర్ తో అతడి ఫ్యాషన్ థ్ ప్రేక్షకులు ఏ విధంగా కనెక్ట్ అవుతారు. 

test సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే మాధవన్ సెకండ్ పార్ట్ పెర్ఫామెన్స్,అప్పటి వరకు టెస్ట్ గా సాగుతున్న ఈ కధ ని తనదైన పాత్ర నటన తో వన్డేల మార్చడానికి ప్రయత్నిస్తారు. విలన్, హీరో మధ్య తేడాని చూపించే ఆ పాత్ర లో మంచి డెప్త్ ఉంటుంది. అయితే ఇది స్పష్టముగా స్క్రీన్ పైకి రాలేదు. మనిషి ఎంత అవకాశావాదో శరవణన్ పాత్రలో చూపించినవిధానము మాత్రమూ బావుంది. నయనతారకి ఆఖరిలో ఓ ఎలివేషన్ షాట్ ఉండాలి అంటే రూల్ ప్రకారము ఇందులో కూడా ఓ షాట్ ఉంటుంది. అయితే మధన్ పాత్రని ముగుంచిన తీరు అంత సరిగ్గా కుదరలేదు. 

టెస్ట్ మ్యాచ్ లా సాగే ఈ కాదని చివరి వరకు భరించేలా చేసింది. మాత్రం మాధవన్ సిద్దార్ద్ నయనతార ఈ ముగ్గురికి కధ  లో ఏ పాయింట్ నచ్చిందో కానీ వాళ్ళ ప్రజెన్స్ తో బాగానే ఈ చిత్రాన్ని లాకొచ్చారు. ఈ ముగ్గురిలో మాధవన్ కి ఎక్కువ మార్కులు పడవచ్చు. మీరాజాస్మిన్ ఎప్పటిలాగానే పద్దతిగా కనిపించింది. టెక్నీకల్ గా ఈ సినిమాకి దేకింత ఉంది. టెస్ట్ మ్యాచ్ ని బాగానే చిత్రీకరించారు.  కానీ ఇందులో క్రికెట్ ఐదు శాతమే. తక్కినన్దతా హ్యూమన్ డ్రామా. శక్తీ శ్రీ గోపాలం పాడిన ఓ పాట నేపధ్య సంగీతముగా బావుంటుంది. టైటిల్ కి తగ్గితే టెస్ట్ మ్యాచ్ ల చాల నెమ్మదిగా సాగే సినిమా. ఇది అంత ఓపిక ఉంటేనే క్లిక్ చేయాలి.  

అజిత్ యాక్షన్ మూవీ మాస్ లుక్స్ తో బ్యాడ్ గుడ్ అగ్లీ మూవీ ట్రైలర్ రీలీజ్డ్.

హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రనికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రములో త్రిష కృష్ణన్ హీరోయిన్ పాత్ర చేస్తుఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న   ప్రపంచ వ్యాప్తముగా రీలీజ్ అవుచున్నది. ఈ చిత్రము బారి అంచనాలు లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మూవీ మేకర్స్ రీలాస్ చేసారు. 

ఈ చిత్రము లో అజిత్ కుమార్ ను అయన ఫాన్స్ ఎలా చూడాలి అని అనుకున్నారో అదేవిధంగా మాస్ లుక్స్ లో కన్పిస్తారు. ఈచిత్రములో గుడ్ బాడ్ అగ్లీ ట్రైలర్ మాత్రమూ చాల అదిరిపోయింది. రెండు నిముషాలు ఈ వీడియో లో క్రేజీ ఇంకా యాక్షన్ ఇంకా రిడెను డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ చూపించారు. వివిధ గెటప్స్, డిఫరెంట్ లుక్స్ లో ప్రెసెంట్ చేసారు. ఓ వైపు మాస్ లుక్స్ లో చూపిస్తూ. మరోవైపు స్టైలిష్ యుంగ్ లుక్స్ కనిపించారు. ఈ చిత్రములో టైటిల్ కు తగ్గట్లు గానే స్టైలిష్ యుంగ్ లూక్లో కనిపించారు. ఈ చిత్రం టైటిల్ తగ్గట్టుగానే హీరో పాత్రలో భిన్నమైన కోణాలు ఉన్నట్లు తెలుస్తుంది. 

ఈ చిత్రములో  అర్జున్దాస్ విలన్ గా విభిన్నమైన గెటప్ లో కనిపిస్తారు. ఇంకా సిమ్రాన్, ప్రియా ప్రకాష్, సునీల్,జాకీ ష్రాఫ్,ప్రసన్న,ప్రభు,యోగి బాబు, తదితరులు కీలక పాత్రలో నటించారు. ఉషా ఉత్తప్, రాహుల్ దేవ్,రోడిన్ రఘు, ప్రదీప్ కాబ్రా ,సాయాజీ షిండే, KGF  అవినాష్ తదితరులు ఇతర సపోర్టింగ్ పాత్రలు పోషించారు. ఈ చిత్రములో ట్రైలర్ లో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఇంకా ఈ చిత్రము ఎలా ఉంటుందో చూడాలి. 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్.

హీరో ప్రదీప్ హీరో మరియు ప్రముఖ యాంకర్. మాచిరాజు గారు తన రెండవ చిత్రం. అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి సినిమాతో తెరపైకి రాబోతున్నారు. ఈ సినిమా కు నితిన్ మరియు భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమా ప్రేమ మరియు ఫామిలీ ఎంటర్టైన్మెంట్ లో ప్రదీప్ కి జోడిగా దీపికా పిల్లి నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి టీజర్ తో పాటు పాటలు అయితే ఇప్పటికే సానుకూల స్పందనను పొందుతున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. రిమోట్ గ్రామీణ గ్రామములో ఒక ప్రాజెక్ట్ పర్యావేక్షించడానికి కేటాయించిన సగటు కంటే తక్కువ సివిల్ ఇంజినీర్ పై ఈ చిత్రమ్ కేంద్రీకృతమై ఉన్నది. 
ఇంకా అక్కడ 60 మంది అనుభవము లేని కార్మికులు నిర్వహించే పని అతనికి ఉంది. గ్రామములో గ్రామస్తులు లో ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఇంకా ఆమె తండ్రి 60 మంది ఉన్న వారిలో ఒకరికి వివాహము చేస్తారని ప్రకటిస్తారు. ప్రాజెక్ట్ అభివ్రుది చెందుతున్నప్పుడు ఇంజినీర్ ఇంకా అమ్మాయి ఇద్దరు ప్రేమలో పడతారు. అక్కడ పరిస్థితి ఇంకా వాళ్ళు తెసుకోవాల్సిన నిర్ణయాలు చాల కష్టముగా మారుతుంది. నితిన్-భారత్ దివ్యం హాస్యాస్పందంగా ఉన్న ఒక ప్రత్యక కథను ఎంచుకుంది. వారు ఆకర్షణీయమైన పరిస్టులు ను ఇంకా నవ్వును అందించటంలో విదియవతం అయ్యారు. 
అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి ఈ సినిమాలో వెన్నెల కిషోర్,గెటప్ శ్రీను ఇంకా సత్య కిల పాత్రలో ప్రతిభావంతులు అయినా తారాగణం ఉన్నారు. ఈ సినిమాకు రాధన్ సంగీతము చేస్తుండగా, AN బాలిరెడ్డి గారు సినిమా టోగ్రాఫీ,కోదాటి పవన్కళ్యాణ్ ఎడిటింగులు అందిస్తున్నారు. ఈ సినిమాకి సందీప్ బోళ్ల కదా, మాటలు వ్రాసారు. మంకస్ అండ్ మంకీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా APRIL 11 th ప్రపంచ వ్యాప్తముగా విడుదల కాబోతుంది. 

Jack Trailor: జాక్ ట్రైలర్ లో కామెడీ ఉండటం ఒకటే కాదు అంతకు మించి, సిద్దు సినిమా అంటే నే కామెడీ జాక్ ట్రైలర్ వచేసింది.

సినిమాలో బ్యాక్ టూ బ్యాక్ డీజే టిల్లు - టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అందుకున్న యాంగ్ హీరో స్టార్ జొన్నలగడ్డ సిద్దు బాయ్ అయన కథానాయకుడుగా నటించిన లేటెస్ట్ మూవీ కొత్తగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అది ఎలా ఉందొ చూసారా. 

సినీ ప్రేక్షకులకు వినోదం అందిచటంలో జొన్నల గడ్డ సిద్దు సపరేట్ స్టైల్. టిల్లు పాత్రలో అతని నటన, టైమింగ్,కామెడీ తెలుగు ప్రేక్షకులకు విపరీతముగా నచ్చేసింది. జాక్ ట్రైలర్ చుస్తే టిల్లు టైమింగ్స్ గుర్తుకి వస్తున్నాయి. ట్రైలర్ లో కామెడీ మాత్రమే కాదు. అంతకు మించి ఉంటుంది అనేవిధంగా కధ చెప్తూ కట్ చేసారు. 
జాక్ పుర్హిస్తాయి యాక్షన్ హీరోగా అలరించునున్నాడు అని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది. అయితే ఇందులో తన కుమారునికి ఏం కావాలి అనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనే తండ్రి గా పాత్ర లో సీనియర్ నరేష్ టీజర్ వరకు అలరించారు. ట్రైలర్ లో సిద్దు ఒక స్పై ఏజెంట్ అనే ఒక రేంజ్ లో చూపించారు. ఇంకా యాక్షన్ పాత్రలో హీరో చాల బాగా చేసారు. వైష్ణవి చైతన్య తో అతని కెమిస్ట్రీ చాల బాగుంది. ఇద్దరి మధ్య లో సన్నివేశాలు సూపర్ అనేవిధంగా ఉన్నాయ్. ఈ జాక్ సినిమాలో కామెడీ ఒకటే కాక యాక్షన్ తో పాడు హీరో ఇంకా హీరియిన్ మధ్య మంచి ప్రేమ కధ కూడా హైలెట్ కూడా అవ్వవచ్చు అని జాక్ ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. 

APRIL 10 Th  సినీ డియటర్ లోకి జాక్ కొంచెం క్రాక్ 

జాక్ కొంచెం క్రాక్  చిత్రంకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్ద శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై BVSS PRASAD గారు నిర్మిస్తున్నారు. APRIL 10Th  సినీ డియటర్లో బారి ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇ చిత్రానికి అచ్చు రాజమణి పాటలు అందించగా, పుష్ప-2 సూడల్ 2 కు నేపధ్య సంగీతము అందించిన సామ్ CS ఈ సినిమాకు కూడా RR చేస్తున్నారు. ఇంకా ప్రకాషరాజ్ , బ్రహ్మాజీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర లు పోషిస్తున్నారు. 


ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్:Oka Pathakam Prakaaram Review-articleshow

 

పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్దార్థ్ నీలకంఠ (సాయిరాం శంకర్) డ్రగ్స్ బానిస అవుతాడు. తనకు సన్నిహితురాలైన దివ్య (భానుశ్రీ) హత్య కేసులో నిందితుడిగా ఇరుక్కుపోతాడు. దాంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదా నుంచి కోర్టు తొలగిస్తుంది. తాను నిరపరాధిని అని కోర్టులో డిఫెన్స్ లాయర్ చినబాబు (కళాభవన్ మణి)తో పోటీ పడలేకపోతాడు. ఈ పరిస్థితుల్లో డిఫెన్స్ లాయర్ భార్య శ్వేత హత్యకు గురి అవుతుంది. ఆ నేరం కూడా సిద్దార్థ్‌పైనే పడుతుంది. ఇలా సీరియల్ మర్డర్స్‌తో సిద్దార్థ్ లైఫ్ అగమ్యగోచరంగా మారిపోతుంది.



సిద్దార్థ్ డ్రగ్స్‌కు ఎందుకు బానిస అయ్యాడు? తన భార్య సీత (ఆషిమా నర్వాల్)‌కు ఏమైంది? అదృశ్యమైన సీత కోసం సిద్దార్థ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? దివ్యను ఎవరు హత్య చేశారు? మర్డర్ కేసులను ఏసీపీ కవిత (శృతి సోది), రఘురామ్ (సముద్రఖని) ఎలా దర్యాప్తు చేశారు. హత్య కేసుల్లో సిద్దార్థ్‌ను పక్కా పథకం ప్రకారం ఇరుకించే ప్రయత్నం చేశారు? చివరకు హంతకుడిని సిద్దార్థ్ పట్టుకొన్నాడా? తాను నిర్దోషినని సిద్దార్థ్ ఎలా నిరూపించుకొన్నాడు? హత్యలకు పాల్పడుతున్న హంతకుడి ఆట ఎలా కట్టించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఒక పథకం ప్రకారం సినిమా కథ.

దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ విషయానికి వస్తే.. మర్డర్ మిస్టరీ పాయింట్ రాసుకొన్న విధానం.. దానిని ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా సన్నివేశాలను డిజైన్ చేసుకొన్న విధానంతో సక్సెస్ సాధించాడు. ఫస్టాఫ్‌లో ఆయన టేకింగ్ విషయంలో కొంత తడబాటు కనిపించినా..సెకండాఫ్‌లో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో స్టోరిని గ్రిప్పింగ్‌గా నేరేట్ చేయడమే కాకుండా సన్నివేశాలను పరుగులు పెట్టించాడు. సాయిరాం శంకర్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగా సిద్దార్థ్ పాత్రను డిజైన్ చేసి ఆయన నుంచి మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్నాడు. కేవలం మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గానే కాకుండా మంచి లవ్ స్టోరీతో, సిద్ శ్రీరామ్‌తో ఫీల్ గుడ్ పాటలతో ఆడియెన్స్ మంచి అనుభూతిని పంచారు.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సాయిరాం శంకర్ యాక్టింగ్ బాగుంది. లాయర్‌గా, భార్యను మిస్ అయి డ్రగ్స్ బానిసైన భర్తగా, మర్డర్ మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేటర్‌గా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించారు. సినిమా భారాన్నంత తన భుజాల మీద వేసుకొని పూర్తిగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక సముద్రఖని ఓ పెక్యులర్ డైలాగ్ డెలివరీతో కామెడీ పండిస్తే.. శృతి సోది, కళాభవన్ మణి, ఆషిమా నర్వాల్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

అలాగే సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి, స్క్రీన్ ప్లే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు కూడా మంచి ఫీల్‌తో తెర మీద కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన గోపి సుందర్ సెకండాఫ్‌లో చాలా సీన్లను భారీగా ఎలివేట్ చేశారు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లేకు తగినట్టుగా సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు చక్కటి సహకారం అందించారు. నిర్మాతలు వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్, సహనిర్మాతలు జీను మల్లి, స్వాతి కల్యాణి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు చాలా మంది నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి.

ఒక పథకం ప్రకారం సినిమా గ్రిప్పింగ్‌గా, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సాగే లవ్, ఎమోషనల్ డ్రామా. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్టాఫ్‌లో కొంత నిదానంగా నడిచినప్పటికీ.. సెకండాఫ్ రేసీగా సాగి మంచి అనుభూతిని పంచుతుంది. స్క్రీన్ ప్లేలో ఉండే దమ్ముతోనే కథలో విలన్ గుర్తించడానికి పట్టుకొంటే పదివేలు అనే పోటీని పెట్టడం వారికి సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఒక పథకం ప్రకారం తప్పకుండా నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ పక్కాగా ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. ఈ వారం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చూడాలనుకొనే వారు ఈ సినిమాను థియేటర్‌లో తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్ మూవీ.


పట్టుదల' మూవీ రివ్యూ - Pattudala Review

 


కథ

అర్జున్ (అజిత్), కయాల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పన్నెండేళ్ల తరువాత వైవాహిక బంధానికి కయాల్ స్వస్తి పలకాలని అనుకుంటుంది. కయాల్‌కు వివాహేతర సంబంధం ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసినా కూడా తాను ఎంతో ప్రేమించిన కయాల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అర్జున్. కానీ కయాల్ మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలో కయాల్ తన పుట్టింటికి వెళ్దామని నిశ్చయించుకుంటుంది. కయాల్‌ను తన పుట్టింట్లో దిగబెట్టేందుకు అర్జున్ వస్తానని అంటాడు. అదే తమ చివరి ప్రయాణం అవుతుంది కదా.. తానే దగ్గరుండి దిగబెట్టి వస్తానని అర్జున్ అంటాడు. ఈ ప్రయాణంలో అర్జున్, కయాల్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? కయాల్‌ను ఎవరు కిడ్నాప్ చేస్తారు? అసలు కయాల్‌, అర్జున్‌లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఈ ప్రయాణంలో దీపిక (రెజీనా), రక్షిత్ (అర్జున్ సర్జా)ల పాత్ర ఏంటి? చివరకు తన భార్యను కాపాడుకునేందుకు పట్టుదలతో అర్జున్ చేసిన పోరాటాలు, ప్రయత్నాలు ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

Chhaava Movie Review: అండ్ రేటింగ్.. సింహంలా గర్జించిన వికీ కౌశల్.. రష్మిక పెర్ఫార్మెన్స్ ఎలా

 


నటీనటులు: వికీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ కుమార్, అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటి, వినీత్ కుమార్ సింగ్ తదితరులు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్

నిర్మాతలు: దినేశ్ విజన్

సినిమాటోగ్రఫి: సౌరభ్ గోస్వామి

ఎడిటింగ్: మనీష్ ప్రధాన్

మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్

బ్యానర్: మడోక్ ఫిల్మ్స్


Realise Date : 2025-02-14


దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకొంటాడు. అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను సంభాజీ తిప్పి విజయవంతంగా తిప్పికొడుతాడు. సంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి సంభాజీ మహారాజ్‌పై యుద్ధం ప్రకటిస్తారు. ఔరంగజేబ్‌ (అక్షయ్ ఖన్నా)కు నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు.

దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ ఎంచుకొన్న కథ, దానికి తగినట్టుగా రాసుకొన్న స్క్రీన్ ప్లేతోనే సినిమా విజయాన్ని రుచి చూసిందని చెప్పవచ్చు. దర్శకుడు విజన్ ప్రకారం కథను యుద్ధంతో మొదలుపెట్టి హై యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. తొలి సీన్ నుంచే యాక్షన్, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్‌తో సినిమాను మరింత భావోద్వేగంగా మలిచాడు. తొలి భాగంలో ఎమోషన్స్, పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్ పూర్తిగా డామినేట్ చేశాయనే చెప్పాలి.

ఛావా సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే... పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్బుతంగా తెరకెక్కించారు. ఇండియన్ స్క్రీన్ పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చి దిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాలపాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సంభాజీ మహారాజ్, అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెల్లగక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వికీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రతీ సన్నివేశంలో పౌరుషంగా, పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ సినిమా కోసం తన లుక్‌ను అద్బుతంగా డిజైన్ చేసుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక సినిమా చివరి 45 నిమిషాలపాటు స్క్రీన్ పైనుంచి కను రెప్పలు వాల్చకుండా చూసేలా తన నటనను ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో సింహంలా గర్జించాడు. యుద్ద సన్నివేశాల్లో మొఘల్ సేనలపై పులి దూకడం ఆయన టాలెంట్ ఏమిటో మరోసారి రుచి చూపించాడు.


Brahma Anandam upadate review:బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు

 నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం - రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు.

Brahma Anandam Movie Review : స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుండగా నేడు ఫిబ్రవరి 13న ప్రీమియర్స్ వేశారు.


కథ విషయానికొస్తే.. బ్రహ్మానందం(రాజా గౌతమ్) యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 9 ఏళ్లుగా ఏ పని చేయకుండా ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటాడు. బ్రహ్మ తాతయ్య ఆనంద్ రామ్మూర్తి(బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. బ్రహ్మానందంకు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు రాశి(దివిజ ప్రభాకర్) బ్రహ్మానందంను, ఆనంద్ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటుంది. నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది కానీ అది ప్లే చేయాలంటే ఆరు లక్షలు అడుగుతారు.

డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తార(ప్రియా వడ్లమాని) వదిలేస్తుంది. బాబాయ్ అవమానిస్తాడు. దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను చెప్పినట్టు చేస్తే ఆ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆనంద్ రామ్మూర్తి చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిసి బ్రహ్మానందం ఒక ఊరికి వెళ్తాడు. మరి ఆనంద్ రామ్మూర్తి పెట్టిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఏ ఊరికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? బ్రహ్మానందంకు 6 లక్షలు వచ్చాయా? తార మళ్ళీ తిరిగొచ్చిందా? బ్రహ్మానందం నటుడు అయ్యాడా? తాత – మనవడు ఎందుకు సింగిల్ గా ఉంటున్నారు? వారి మధ్య రిలేషన్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..

నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం - రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు.

Brahma Anandam Movie Review : స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుండగా నేడు ఫిబ్రవరి 13న ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే.. బ్రహ్మానందం(రాజా గౌతమ్) యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 9 ఏళ్లుగా ఏ పని చేయకుండా ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటాడు. బ్రహ్మ తాతయ్య ఆనంద్ రామ్మూర్తి(బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. బ్రహ్మానందంకు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు రాశి(దివిజ ప్రభాకర్) బ్రహ్మానందంను, ఆనంద్ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటుంది. నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది కానీ అది ప్లే చేయాలంటే ఆరు లక్షలు అడుగుతారు.

డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తార(ప్రియా వడ్లమాని) వదిలేస్తుంది. బాబాయ్ అవమానిస్తాడు. దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను చెప్పినట్టు చేస్తే ఆ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆనంద్ రామ్మూర్తి చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిసి బ్రహ్మానందం ఒక ఊరికి వెళ్తాడు. మరి ఆనంద్ రామ్మూర్తి పెట్టిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఏ ఊరికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? బ్రహ్మానందంకు 6 లక్షలు వచ్చాయా? తార మళ్ళీ తిరిగొచ్చిందా? బ్రహ్మానందం నటుడు అయ్యాడా? తాత – మనవడు ఎందుకు సింగిల్ గా ఉంటున్నారు? వారి మధ్య రిలేషన్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Manchu Manoj : మంచు మనోజ్ సంచలనం.. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదని కామెంట్

సినిమా విశ్లేషణ.. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం – రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, బ్రహ్మనందం కష్టాలు, థియేటర్ ప్లే ఛాన్స్ రావడం, ఆనంద్ రామ్మూర్తి ఓల్డ్ ఏజ్ హోమ్, అన్నయ్య – తాతయ్య మీద రాశి ప్రేమ, డబ్బుల కోసం ఆనంద్ రామ్మూర్తి వెంట బ్రహ్మానందం ఊరికి వెళ్లడంతో సాగుతుంది. అక్కడికి ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్ కి తాత ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఆసక్తి నెలకొంటుంది. ఆ ట్విస్ట్ తో బ్రహ్మానందం అక్కడే ఇరుక్కుపోవడం, తాత కోసం ఏం చేసాడు అని సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా కామెడీతోనే నడిపించి అక్కడక్కడా చిన్న ఎమోషన్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే ముసలి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కష్టాలు, మనుషులతో అనుబంధాలు అనే ఎమోషన్ చూపించినా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే రాజా గౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ లా చూపించి సడెన్ గా ఓ చిన్న సీన్ కి మారిపోయినట్టు చూపించడం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అయితే క్లైమాక్స్ మాత్రం ఏదో సింపుల్ గా అయిపోయింది అనేలా ఉంటుంది. అప్పటిదాకా మంచి ఎమోషన్ నడిపించి చివర్లో ఏదో ముగించేశారు. సమాజంలో అందరూ అర్ధం చేసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ ని చెప్పినా చివర్లో దాన్ని సరిగ్గా ముగించలేకపోయారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనే లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో మనల్ని నవ్వించి అప్పుడప్పుడు ఏడిపించిన బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా ఓ పక్క నవ్విస్తూనే కాస్త ఏడిపించారు. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో హీరోగా పలు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని రాజా గౌతమ్ ఈ సినిమాలో నటుడిగా తన కసి అంతా తీర్చుకున్నట్టు, నటనలో ఎంతో పరిణీతి చెందినట్టు అనిపిస్తుంది. రాజా గౌతమ్ తండ్రికి ధీటుగా ప్రతి సన్నివేశంలోనూ బాగా నటించాడు అని చెప్పొచ్చు.

ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్ గా నవ్వించారు. సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బ్రహ్మానందం మనవరాలి పాత్రలో మెప్పించింది. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రాజీవ్ కనకాల, సంపత్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియా వడ్లమాని, బామ్మ పాత్రలో నటించిన పెద్దావిడ.. అందరూ వారి పాత్రల్లో బాగా మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఒక మంచి పాయింట్ చుట్టూ కామెడీ అల్లుకొని కథ, కథనం బాగానే రాసుకున్నా క్లైమాక్స్ మాత్రం ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు టైటిల్ కి తగ్గ న్యాయం చేసాడనే చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు. బ్రహ్మ ఆనందం సినిమా ఒక తాత – మనవడు ఎమోషన్, తాత కోసం మనవడు, మనవడి కోసం తాత ఏం చేసాడు అనే స్టోరీ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.