1000 Health Tips: పట్టుదల' మూవీ రివ్యూ - Pattudala Review

పట్టుదల' మూవీ రివ్యూ - Pattudala Review

 


కథ

అర్జున్ (అజిత్), కయాల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పన్నెండేళ్ల తరువాత వైవాహిక బంధానికి కయాల్ స్వస్తి పలకాలని అనుకుంటుంది. కయాల్‌కు వివాహేతర సంబంధం ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసినా కూడా తాను ఎంతో ప్రేమించిన కయాల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అర్జున్. కానీ కయాల్ మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలో కయాల్ తన పుట్టింటికి వెళ్దామని నిశ్చయించుకుంటుంది. కయాల్‌ను తన పుట్టింట్లో దిగబెట్టేందుకు అర్జున్ వస్తానని అంటాడు. అదే తమ చివరి ప్రయాణం అవుతుంది కదా.. తానే దగ్గరుండి దిగబెట్టి వస్తానని అర్జున్ అంటాడు. ఈ ప్రయాణంలో అర్జున్, కయాల్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? కయాల్‌ను ఎవరు కిడ్నాప్ చేస్తారు? అసలు కయాల్‌, అర్జున్‌లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఈ ప్రయాణంలో దీపిక (రెజీనా), రక్షిత్ (అర్జున్ సర్జా)ల పాత్ర ఏంటి? చివరకు తన భార్యను కాపాడుకునేందుకు పట్టుదలతో అర్జున్ చేసిన పోరాటాలు, ప్రయత్నాలు ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.