బెండకాయను ఆహారంలో తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయలో విటమిన్ కె, మెగ్నీషియం, విటమిన్ సి, ఫోలేట్, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యం, మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడం, జీర్ణవ్యవస్థ మెరుగుదల, గుండె ఆరోగ్యం మరియు కంటి ఆరోగ్యం వంటి అనేక విషయాలకు సహాయపడతాయి.
బెండకాయ వలన కలిగే ప్రయోజనాలు:
ఎముకల ఆరోగ్యం:
బెండకాయలో విటమిన్ కె మరియు మెగ్నీషియం ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి.
మధుమేహం నియంత్రణ:
బెండకాయలోని పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం:
బెండకాయలో కేలరీలు తక్కువగా మరియు పీచు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థ:
బెండకాయలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.
గుండె ఆరోగ్యం:
బెండకాయలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కంటి ఆరోగ్యం:
బెండకాయలో విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇమ్యూనిటీ:
బెండకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి.
క్యాన్సర్ నివారణ:
బెండకాయలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఫోలిక్ యాసిడ్:
గర్భిణీ స్త్రీలకు బెండకాయలో ఉండే ఫోలేట్ తల్లి మరియు బిడ్డల ఆరోగ్యానికి చాలా అవసరం.
కీళ్ల నొప్పులు:
బెండకాయ నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఒత్తిడి మరియు ఆందోళన:
బెండకాయ నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి.
ముఖ్య గమనిక: బెండకాయను మోతాదులో తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాలలో, బెండకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, కానీ కొద్దిమందికి అది అసౌకర్యంగా అనిపించవచ్చు. బెండకాయను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగడం కూడా చాలా మంచిది.
బెండకాయ కూరలు చాలా ఇష్టం గా తింటున్నారా?
అసలు బెండకాయలో ఏమేమి పోషకాలు ఉంటాయి.
సుమారుగా ఒక 100 గ్రాములు బెండకాయలలో
- కార్బొహైడ్రిట్స్ 7.45 గ్రాములు
- ప్రోటీన్ 1.93 గ్రాములు
- ఫ్యాట్ 0.93 గ్రాములు
- ఫైబర్ 3.02 గ్రాములు
- షుగర్ 1.48 గ్రాములు
- నీరు 89.6 గ్రాములు
- ఏనార్జీ 33 కిలో క్యాలరీలు
- స్టార్చ్ 0.34 గ్రాములు
- సోడియమ్ 0.4 మిల్లి గ్రాములు
- పోటాషియమ్ 400 మిల్లి గ్రాములు
- ఐరన్ 0.61 మిల్లి గ్రాములు
- మెగ్నీషయం 57 మిల్లి గ్రాములు
- కాలషియం 82 మిల్లి గ్రాములు
- ఫేస్పరస్ 61 మిల్లి గ్రాములు
- జింక్ 0.58 మిల్లి గ్రాములు
- మంగనీస్ 0.788 మిల్లి గ్రాములు
- కాపర్ 0.199 మిల్లి గ్రాములు
- సెలెనియం 0.7 మిల్లి గ్రాములు
బెండకాయ వలన కలిగే ఆరోగ్యం ప్రయోజనాలు:
బెండకాయ తినటం వలన షుగర్ (మధుమేహం) శరీరంలో అదుపులో ఉంటుంది.ఎలాగూ అంటే బెండకాయ లోని గింజలు, ఇంకా బెండకాయ తొక్క లో ఎంజేమ్స్ షుగర్ (మధుమేహం) శరీరంలో అదుపులో ఉంచుతుంది.అందువలన వారములో ఒక సారి అయినా సరే బెండకాయ తినటం వలన షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.
బెండకాయ తినటం వలన శరీరం అధిక బరువు తగ్గుతారు.ఇంతే కాక శరీరములో చెడు కోలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు బెండకాయ లో ఉన్నాయి.
పెద్ద పేగు:
బెండకాయ లో యాంటీ ఆక్సిడెంట్ల అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తీలో బెండకాయ దోహద పడతాయి.
పెద్ద పెగు కాన్సర్, ఊపిరితితుల కాన్సర్ లను నివారిచటములో బెండకాయలు ఉపయోగపడతాయి.
దంత క్షయ తో బాధపడేవారికి బెండకాయ మంచి ఔషాదము అనే చెప్పాలి.
గర్భవతులు:
బెండకాయ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గర్భినులు బెండకాయలు తినటం వలన కడుపు లో ఉండే శిశువుకు మంచిది. బెండకాయ లో ఫాలెట్ సమృద్దిగా ఉండటం వలన శిశువు కు మెదడు నిర్మాణానికి ఆరోగ్యముగా ఉంటారు.ఇంకా ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన
నాడి వ్యవస్థ ఆరోగ్యముగా ఉంచడములో సహాయం పడుతుంది.
ఆరోగ్యం మెదడు మెరుగుపరిచటంలో:
బెండకాయ లో పోబ్రాయాటిక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.ఇవి ఆరోగ్యము దోహదపడే బేక్టరియా ను పెంచడం లో సహాయపడతాయి.
బెండకాయ లో ప్లావనాడులు మెదడు కి ఆరోగ్యాని మెరుగుపరిచటం లో ఎంతో మేలు చేస్తాయి.
మెదడు పనితీరు పై ప్రభావం పనితీరు జ్ఞాపకాశక్తి ని పెంచటములో ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
అలాగే చర్మ కాంతి ని మెరుగుపరుస్తుంది.
బెండకాయ లోని కెల్షియం శరీరాములోని ఎముకలను చాలా బలంగా ఉంచటంలో సహాయపడతాయి.
గమనిక : ప్రతి ఒకరికి ఆరోగ్యము పైన అవగాహనా కలిపించటం కోసమే ప్రయత్నం, వైద్య నైపుణలు కలిసి ఏమి తీసుకుంటే మంచిదో అదే పాటించండి