1000 Health Tips: blood preser కోసం శోధన ఫలితాలు
blood preser ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
blood preser ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

daily eat banana benfits blood preser cholesterol

 చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడం చాలా కీలకం. శరీరం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించేందుకు కొన్ని పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.


ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌, వాతావరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం చాలా కీలకం. ఇక, చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. అయితే.. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే శరీరానికి ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుత జీవనశైలి, పొల్యూషన్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లతో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), రెండు మంచి కొలెస్ట్రాల్ (HDL). మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువైతేనే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్‌టెన్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అందుకే చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడం చాలా కీలకం. శరీరంల చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించేందుకు కొన్ని పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటి ఫ్రూట్స్‌లో అరటి పండు ఒకటి. అరటి పండు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి అరటి పండు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.


అరటి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు..

​​అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్, పొటాషియం ఉన్నాయి. పొటాషియం.. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు శరీరానికి ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అరటి పండు..

అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపడంలో సహాయపడుతుంది. అరటి పండులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అరటి పండును ఎలా తినాలి?

​శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, మీరు అరటిని అనేక విధాలుగా తినవచ్చు. అరటి పండును నేరుగా తిన్నా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నేరుగా తినడం ఇష్టం లేకపోతే.. అరటిపండు షేక్ లేదా స్మూతీని తయారు చేసి కూడా తినవచ్చు. ఇక, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పచ్చి అరటి కాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని కూరగా చేసుకుని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

అరటి పండు ఎప్పుడు తినాలి?

ఉదయాన్నే అల్పాహారంలో అరటి పండును భాగం చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల మీకు కడుపు నిండిన భావన వేస్తుంది. దీంతో ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. అదనంగా కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు. అయితే, అరటి పండ్లను ఎక్కువగా తినకూడదు. అరటి పండ్లను పరిమిత పరిమాణంలో తినాలని గుర్తించుకోండి. రోజుకు ఒకటి లేదా రెండు తినడం ఆరోగ్యానికి మేలు. ఒకవేళ డయాబెటిస్‌తో బాధపడుతుంటే మాత్రం వైద్యుణ్ని సంప్రదించడం మేలు.


అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఈ ఆహారాలకు నో చెప్పండి..

*నూనెలో వేయించిన ఆహారాలు

  •  ఐస్ క్రీమ్, డెజర్ట్, బేకరీ ఫుడ్
  •  గుడ్డు పచ్చసొన
  •  శుద్ధి చేసిన ఆహారాలు
  •  రెడ్ మీట్
  •  వీటి బదులు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోవాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, చిన్నపాటి వ్యాయామాలు కొలెస్ట్రాల్ పెరగకుండా దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక.

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

అయితే, చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.

ఆహారపు అలవాట్లు  కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారా . అయితే, ఈ వార్త మీ కోసమే బరువు తగ్గడానికి చాలామంది నానా ప్రయత్నాలు, జిమ్మ్ వంటి. ప్రయత్నం  చేస్తున్నారు. మరి కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు.



ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి Food Habits , చెడు జీవనశైలి అతని Helth పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. Food Habits కారణంగా Heavy Weight, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, Weight తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు  Food లో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్మ్లు  చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువగా  మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా weight  తగ్గలేకపోతున్నారు.

అయితే weight తగ్గేందుకు walking  best  option  అని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే వాకింగ్‌తో walking తగ్గించుకోవచ్చు. అయితే, ఇందుకు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ మధ్య  వాకింగ్ rule  వైరలవుతుంది. ఈ వాకింగ్ rule  తో weight  తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు ఇంతకీ ఈ వాకింగ్ రూల్ ఏంటి? బరువు తగ్గడంలో ఎలా సాయపడుతుంది? ఇప్పడు మనం తెలుసుకొందాం. 


వాకింగ్ rule  ఒక సాధారణ నియమం. ఇందులో మీరు రోజుకు ఒక్కసారైనా 1 hour  పాటు నడవాలి. అది మార్నింగ్ 6 am.  లేదా evening 6 pm.  అయినా సరే 1 hour  పాటు నడవాలి. ఈ నడకతో పాటు 6 mints  వార్మప్ అంటే చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా 6 minits కూల్ డౌన్ చేయాలి. అంటే చిన్న వ్యాయామాలతో కూల్ అవ్వడం. వార్మప్ వ్యాయామాలు నడకకు ముందు చేస్తే.. కూల్ డౌన్ నడక తర్వాత చేయాలంటున్నారు 

ఈ రూల్ ఎలా పనిచేస్తుంది?

* క్రమం తప్పకుండా 1 hour  పాటు నడవడం ద్వారా మీరు చాలా కేలరీలు burn  చేయవచ్చు.
* ఈ నియమం మీ జీవక్రియను పెంచుతుంది. దీని కారణంగా శరీరం ఎక్కువ కేలరీలను burn  చేస్తుంది.
* రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన fat , ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
* ప్రతి రోజూ ఒక గంట పాటు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరగవుతుంది.
* నడక ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

వాకింగ్ రూల్ ప్రయోజనాలు

* బరువు తగ్గడానికి ఈ నియమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* రెగ్యులర్ వాకింగ్ వల్ల శరీరం బలంగా, ఫిట్‌గా మారుతుంది.
డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నడక తగ్గిస్తుంది.
* నడక మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తుంది. అంతేకాకుండా చురుగ్గా ఉంటారు.
* నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఈ రూల్ బెస్ట్ ఆప్షన్. వాకింగ్ వల్ల మంచి నిద్ర పడుతుంది.


ఈ నియమాన్ని ఎవరు పాటించాలి?



దాదాపు ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని అనుసరించవచ్చు. మీ వయస్సు లేదా మీ ఫిట్‌నెస్ స్థాయి ఏమైనప్పటికీ ఈ rule  చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. walking  కోసం మంచి ప్రదేశం కనుగొని.. కాస్త time  కేటాయిస్తే సరిపోతుంది. అయితే, మీకు ఏదైనా heart  జబ్బులు లేదా blood preser సమస్య ఉంటే, మాత్రం వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచింది .

ఈ విషయాలు కూడా ముఖ్యం




* మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుణ్ని సంప్రదించి.. ఆ తర్వాత ఈ walking  రూల్ పాటించండి
* మీరు ఎప్పుడు వ్యాయామం చేయకపోతే.. మొదటి సారి వాకింగ్ వెళ్తుంటే నెమ్మదిగా నడక ప్రారంభించండి. రోజులు గడిచే కొద్దీ నడక వేగంతో పాటు సమయాన్ని కూడా పెంచుకోండి.
* వాకింగ్ కోసం సరైన షూస్ ఎంపిక చేసుకోండి. సరైన బూట్లు లేకపోతే వాకింగ్‌లో ఇబ్బందులు ఉంటాయి.
* వాకింగ్ సమయంలో తగినంత water త్రాగండి.
* స్నేహితుడితో, కుటుంబ సభ్యులతో walking  చేయడం అలవాటు చేసుకోండి. దీంతో సమయం సరదాగా గడిచిపోతుంది.

గమనిక: 

ఇది సోషల్ లోని  సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు  ఉంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత  వైద్య నిపుణులని  సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.