మామూలుగా వయస్సు పెరిగే కొద్దీ చర్మమ్ సమస్యలు. అలాగే చర్మము లో మార్పులు రావటం అన్నది సహజం. ముఖ్యము గా వయస్సు పెరిగే కొద్ది వృద్యాప్యము లక్షణాలు చర్మం ముడతలు గా అయిపోవటము లాంటివి జరుగుతూ ఉంటాయి.
ముడతలు పడిన చర్మం కోసం చాలామంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తూ ఉంటారు. కేవలం క్రీమ్స్ వంటి వాటిని ఉపయోగించడం మాత్రమే కాకుండా తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలో పాటించాలని, మంచి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా కనిపించడం ఖాయం అంటున్నారు.
ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్లూబెర్రీస్.. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి చర్మ కణాలకు హానికరం అయిన వాటి నుండి మనల్ని కాపాడుతూ, వాటిని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయట. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కొల్లాజైన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కోలాజన్ ఆరోగ్యకరమైన చర్మం, మృదుత్వాన్ని సమర్థవంతంగా కాపాడుతుందట. అలాగే బ్లూబెర్రీస్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి శరీరంలోని దుస్థితిని తగ్గిస్తాయట. తద్వారా వృద్ధాప్య మార్పులను క్రమంగా తగ్గించవచ్చని చెబుతున్నారు.
కూరగాయలు తీసుకునే వారు, అవి తినని వారితో పోల్చితే మానసికంగా శారీరకంగా 10 నుంచి 11 సంవత్సరాలు చిన్నవారిగా కనిపిస్తారట. కాగా కూరగాయలు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్ ఏ, సి, కె, బి, ఈ వంటివి ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని, చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయట. కూరగాయలు వృద్ధాప్య ఛాయలను తగ్గించే అద్భుతమైన సాధనంగా పని చేస్తాయని చెబుతున్నారు. కాగా ప్రతిరోజూ ఒక అవకాడోని తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మరి యవ్వనంగా కనిపిస్తారట. అవకాడోలో అనేక పోషకాలతో పాటు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయని చెబుతున్నారు.
అలాగే పసుపు అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్న ఒక సహజ మూలకం అని చెబుతున్నారు. పసుపు నాచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుందట. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ కణాలను పునరుద్ధరించేలా చేస్తుందట. తద్వారా చర్మం యవ్వనంగా, మృదువుగా కనిపిస్తుందట.
గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు అత్యద్భుతమైన మూలం. ఇది కృత్రిమ రసాయనాలు లేకుండా, శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని ఎపిగ్లోకాటెచిన్ గలేట్స్ విటమిన్ సి ను పునరుద్ధరించడంలో సహాయపడతాయట. గ్రీన్ టీను నిత్యం తాగడం ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా, మరింత యవ్వనంగా కనిపిస్తుందట. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కోలాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా గ్లోయింగ్ గా ఉంచుతుందట.