1000 Health Tips: hair fall కోసం శోధన ఫలితాలు
hair fall ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
hair fall ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

Hair Fall semtems vitaminc-c problems

 

Hair Fall Problems జుట్టు రాలడం

జుట్టు త్వరగా రాలుతుంటుంది. పొడిబారి, పెళుసుగా మారుతుంది. నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు బలహీనమవుతుంది. త్వరగా రాలుతుంది. రెగ్యులర్‌గా ఎక్కువగా జుట్టు రాలుతుంటే విటమిన్ సి లోపం ఉందో ఓ సారి చెక్ చేయండి. చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాపు, రక్తస్రావం వంటి సమస్యలొస్తాయి. ఊరికే దంత సమస్యలొస్తాయి. దంతాలు వదులుగా మారడం, ఊడిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

hair fall helth tips articles sleeping men woman

 జుట్టు రాలుటకు కారణాలు: పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుం డటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం.

hair fall helthtips


నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, కొందరిలో శరీరతత్వం బట్టి కూడా జుట్టు రాలడం జరుగుతుంది.


నివారణకు జాగ్రత్తలు: జుట్టు నిర్మాణానికి, అది ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే అధికంగా ఉంటుంది. కావున ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. సబ్బులను డాక్టర్‌ సలహామేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రుకల కుదుళ్ళలో, వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.


బయటకు వెళ్ళేటప్పుడు తలకు టోపీ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసు కోకూడదు. మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలుటపై ప్రభావం చూపు తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు యోగా, వ్యాయామం విధిగా చేయాలి.

vitaminD hair fall sun set sweat pain శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

 శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి రోజుకు 20-40 ఎంజీ/ఎంఎల్ విటమిన్ డి అవసరం. ఈ స్థాయి తక్కువగా ఉంటే, అది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు.

శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

helthtipscaress


భరించలేని కండరాల నొప్పి.

విటమిన్ డి లోపం వల్ల కండరాల నొప్పి వస్తుంది. చాలా మంది దీనిని అలసిపోతున్నట్టుగా భావిస్తారు. ఇది సహజమే అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అది మీరనుకునేంత తేలికైనది కాకపోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే, మీరు వెంటనే అప్రమత్తం కావాలి.


ఆందోళన, ఒత్తిడి కలుగుతుందా..

వేసవిలో చెమటలు పట్టడం సహజమే, కానీ మామూలు సమయాల్లో మీ నుదిటిపై అనుకోకుండా చెమట కనిపించడం గమనించినట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ విటమిన్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి మరియు మెదడు సరైన పనితీరుకు చాలా అవసరం. ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన మరియు నిరాశ కలుగుతాయి.


జుట్టు రాలడం:

విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. చాలామంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు. అయితే, ఇది విటమిన్ డి లోపం వల్ల కూడా సంభవించవచ్చు. ఈ విటమిన్ లోపం తలపై ఫోలికల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా, జుట్టు సమస్యలు మొదలవుతాయి. విటమిన్ డి లోపం యొక్క లక్షణాలలో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. ఈ విటమిన్ లోపం వల్ల ఉబ్బరం, విరేచనాలు మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.


విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి..

విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుందని దాదాపు అందరికీ తెలుసు. రోజుకు 15-30 నిమిషాలు ఎండలో గడపడానికి ప్రయత్నించండి. ఉదయం 7-10 గంటల మధ్య వచ్చే సూర్యకాంతి మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, మీరు మీ ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే చేపలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, గుడ్డు సొనలు మరియు తృణధాన్యాల ఆహారాలు. సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.