1000 Health Tips

పార్లర్ వెళ్లకుండానే ఇంట్లోని,,,,ఇన్‌స్టంట్‌గా ముఖాన్ని మెరిపించే ఫేస్‌ప్యాక్స్

 

ప్రేజెంట్ చాలా మంది బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీనికోసం ఎంతైనా ఖర్చుపెడుతున్నారు. గంటలకొద్దీ సెలూన్స్, పార్లర్స్‌లో గడుపుతున్నారు. ఇలాంటివి ఏ మాత్రం వీలు లేని వారు ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ని ట్రై చేయొచ్చు.

వీటి కారణంగా స్కిన్ చక్కగా అందంగా ఇన్‌స్టంట్‌గానే మెరుస్తుంది. పైగా ఇంట్లోని పదార్థాలతోనే ఎక్కువగా ఫేస్‌ప్యాక్స్ వేస్తాం. కాబట్టి, ఎక్కువ ఖర్చు ఉండదు. బయటికి వెళ్లాల్సిన పని ఉండదు. అన్నింటికంటే ముఖ్యం సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు. ఇది ఏ టైమ్‌లో అయినా వేసుకోవచ్చు. అయితే, ముఖ్యంగా రాత్రి టైమ్‌లో వేసుకుంటే మాత్రం రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం ఆ ఫేస్‌ప్యాక్స్ ఏంటో తెలుసుకోండి.


రోజ్‌వాటర్


​రోజ్‌వాటర్‌తో ముందుగా ఫేస్‌ని క్లీన్ చేసుకోండి. దీనికోసం రోజ్‌వాటర్‌లో కాటన్ ప్యాడ్‌ని ముంచి ఫ్రిజ్‌లో ఉంచి 10 నిమిషాల తర్వాత వాటితో ఫేస్‌ని క్లీన్ చేయాలి. దీనికోసం నుదుటిపై బొట్టపెట్టుకునే దగ్గర నుంచి స్టార్ట్ చేసి రెండు కనుబొమ్మలవైపు రబ్ చేస్తూ కింద ఫేస్‌ వరకూ వచ్చి క్లీన్ చేయాలి. రోజ్‌వాటర్‌లో ముంచిన దూది ప్యాడ్‌తో ముఖాన్ని క్లీన్ చేస్తే దుమ్ము, ధూళి మొత్తం క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏదైనా ఫేస్‌ప్యాక్ పెట్టుకున్నా మంచి రిజల్ట్ ఉంటుంది.


స్క్రబ్


ముఖంపై మృతకణాలను రిమూవ్ చేయడానికి ఫేషియల్ స్క్రబ్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల స్కిన్ మెరుస్తుంది. స్క్రబ్ చేయడానికి వాల్‌నట్ పౌడర్, ఓ చెంచా తేనె, ఓ చెంచా పెరుగు కలపాలి. ఇక్కడ వాల్‌నట్ పౌడర్ బదులు కొద్దిగా పంచదార లేదా కాఫీ పొడి కూడా కలపొచ్చు. వీటిని స్క్రబ్‌లా కలిపి క్లీన్ చేసుకున్న ఫేస్‌పై అప్లై చేయాలి. తర్వాత సర్క్యులేషన్ మోషన్‌లో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఫేస్‌ని క్లీన్ చేసుకోవాలి.


పాలమీగడ, పసుపుతో


పాలమీగడలో పసుపుని చక్కగా కలపండి. రెండింటిని కూడా చక్కగా ఫేస్‌ప్యాక్‌లా మిక్స్ చేయండి. దీనిని ముఖానికి అప్లై చేయండి. కావాలనుకుంటే ఇందులోనే కొద్దిగా శనగపిండి, గంధం కూడా కలపొచ్చు. ఆరిన తర్వాత ఈ ఫేస్‌ప్యాక్‌ని చక్కగా క్లీన్ చేయండి. ఫేస్ క్లీన్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.


ఫ్రూట్స్‌తో


ఫ్రూట్ ప్యాక్ కూడా ముఖాన్ని మెరిసేలా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం మీకు నచ్చిన ఫ్రూట్‌ని తీసుకోండి. అంటే బనానా, ఆరెంజ్, ఆపిల్, బొప్పాయి ఇలాంటివన్ని మాట. వీటిని మెత్తని పేస్టులా చేయాలి. తర్వాత అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. ముఖానికి వీటిని అప్లై చేసి ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల ముఖంపై మచ్చలు, నలుపుదనం తగ్గుతుంది.


తేనె


తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎన్నో ఉంటాయి. అంతేకాకుండా స్కిన్‌ని బ్రైట్‌ అండ్ గ్లోయింగ్‌గా చేసే నేచురల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా, అలోవెరాలో కూడా మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. కొద్దిగా అలోవెరా జెల్‌లో కాస్తా తేనె కలిపి మిక్స్ చేయాలి. తర్వాత ఈ రెండింటిని ఫేస్‌కి రాసి మసాజ్ చేయాలి. కాసేపు ఉండి ఆ తర్వాత నీటితో క్లీన్ చేయాలి. మచ్చలు తగ్గి స్కిన్ హైడ్రేటింగ్‌గా ఉండేందుకు ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. గమనిక:నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Weight loss healthy tips: జస్ట్ ఈ నాలుగు తినండి.. మార్పు అస్సలు ఊహించలేరు..!

 ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం తీసుకునే ఆహారం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగడం (Sugar Spikes), ఆ తర్వాత పడిపోవడం వల్ల ప్యాంక్రియాస్ పైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

Weight loss

మన పూర్వీకులు తిన్న ఆహారమే మనం తింటున్నామని అనుకుంటాం. కానీ, అప్పటి క్వాలిటీ ఇప్పుడు లేదు. అలాగే, మన ప్రస్తుత జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మైదా, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం పెరగడం వల్ల పోషకాలు లేని ‘డెడ్ క్యాలరీస్’ శరీరంలోకి చేరుతున్నాయి.


టిఫిన్ల వెనుక దాగున్న అసలు నిజం..


మనం అత్యంత ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఎలాంటి లోపాలు ఉన్నాయో ఓసారి చూద్దాం..


పూరీ: ఒక్క పూరీలో 150 నుంచి 200 క్యాలరీల వరకు ఉంటాయి. మూడు పూరీలు తింటే సుమారు 600 క్యాలరీలు శరీరంలోకి వెళ్తాయి. ఇందులో వాడే మైదా, వేడి చేసిన ఆయిల్ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతాయి.


వడ: రెండు వడలు తింటే 600 క్యాలరీలు వస్తాయి. ఇవి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాబట్టి వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు ఎయిర్ ఫ్రైయర్ వాడటం మంచి ప్రత్యామ్నాయం.


ఇడ్లీ: ఇడ్లీ ఆరోగ్యకరమే అయినా, అది కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే ఇస్తుంది. దీనిని ఫైబర్ ఉన్న వెజిటేబుల్ సాంబార్, ప్రోటీన్ ఉన్న చట్నీతో తింటేనే అది ‘బాలెన్స్డ్ డైట్’ అవుతుంది.


బ్రెడ్ జామ్, పోహా: బ్రెడ్ జామ్‌లో షుగర్, ప్రిజర్వేటివ్స్ తప్ప పోషకాలు ఉండవు. పోహా (అటుకులు) కూడా లైట్ ఫుడ్ అని అనుకుంటాం. కానీ, అందులోనూ ప్రోటీన్ తక్కువగా ఉండి నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది.


బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఐడియల్ డైట్ ప్లాన్..


మీ రోజును చక్కెరలతో కాకుండా ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్‌తో ప్రారంభించండి. దీనివల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.


నట్స్, సీడ్స్: ఉదయాన్నే నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌తో రోజును ప్రారంభించండి. నీటిలో చియా సీడ్స్ కలుపుకుని తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి.


పెసరట్టు: దోస, ఇడ్లీ కంటే పెసరట్టు ఉత్తమమైనది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.


మిల్లెట్స్: ఉప్మా చేసేటప్పుడు రవ్వకు బదులుగా కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాలను వాడండి. అందులో ఎక్కువ కూరగాయలు వేయడం మర్చిపోకండి.


పండ్ల విషయంలో జాగ్రత్త: ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్‌లు తాగొద్దు. పండ్లను నేరుగా ముక్కలుగా కోసుకుని సాయంత్రం స్నాక్‌లా తీసుకోవడం మంచిది.


ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ప్లేట్‌లో పెట్టుకునే ప్రతి ముక్క మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. సరైన నిష్పత్తిలో ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకుంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.


గమనిక: ఈ సమాచారం వీడియోలోని నిపుణుల సూచనల ఆధారంగా అందించాం. ఏదైనా డైట్ ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులను సంప్రదించండి.

కరక్కాయ వలన శరీరానికి ఎన్ని ఉపయోగాలు తెలుసా.

 ఆయుర్వేదములో కరక్కాయ  కూడా ఒక మూలికా ఇంకా జీర్ణక్రియకు సంబందించి వాడతారు. రోగనిరోధక శక్తీ ని పెంచడం లో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కరక్కాయ లో కలిగి ఉంది. కరక్కాయ ను పొడి చేసుటకొని, గోరువెచ్చని నీరు లో కొంచెం తేనే కలిపి  వలన మలబద్దకం,జీర్ణ సమస్యలు ఇంకా దంత సమస్యలకు ఇంకా కొన్ని  రకాల  సమస్య వ్యాధులకు ఉపయోగిస్తారు. 

Myrobalan


  1. జీర్ణ సమస్యలు: కరక్కాయ పొడి ఇది పెద్దప్రేగు ను శుబ్రము చేసే పదర్దము. ఇది మలబద్దకం,అపానవాయువు,పూతలా,మూలా వ్యాధి ఇంకా ఆహార విషప్రయోగానికి కరక్కాయ సహాయపడుతుంది. 
  2. దంత సంరక్షణ: దంత చిగుళ్లు వదులుగా ఉండటం లేక రక్తస్రావం రావటం ఇటువంటి దంత సమస్యలు పరిష్కరిస్తుంది. 
  3. బరువు తగ్గటం: బరువు తగ్గటానికి కరక్కాయ పొడి చాల మంచిది. 
  4. రోగ నిరోధక శక్తీ.: రోగ నిరోధక వ్యవస్దను మెరుగుపరచడంలో కరక్కాయ పొడి ఉపయోగిస్తారు. 
  5. చర్మము జుట్టు స,సమస్యలు : 

చలికాలంలో వాడిపోయిన కరివేపాకు మొక్కకు తిరిగి జీవం నింపే చిట్కాలు, పాటిస్తే ఏపుగా, గుబురుగా పెరుగుతుంది

 కరివేపాకు.. ప్రతి వంట్లో ఉండాల్సిందే. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని కరివేపాకుల్ని నమిలితే జీర్ణక్రియ మెరగవుతుంది.

జీవక్రియ వేగవంతం అవుతుంది. కాలేయం క్లీన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక, కరివేపాకు మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు. కరివేపాకు మొక్క సరిగ్గా పెరగకపోతే కొన్ని చిట్కాలు బాగా పనిచేస్తాయి.



శీతాకాలంలోని వాతావరణం మొక్కలకు సవాల్‌తో కూడుకుంది. అందుకే మొక్కలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెరిగిన చలి, తక్కువ సూర్యకాంతి, తేమ లేకపోవడం వల్ల మొక్కలు త్వరగా వాడిపోతాయి. మొక్కల ఆకులు రంగు మారిపోవడం, ఎండిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక, కరివేపాకు మొక్క కూడా చలికాలంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. ప్రతి ఇంట్లో దాదాపు ఉండే మొక్క ఏదైనా ఉందంటే అది కరివేపాకే.


మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో కరివేపాకు మొక్క పసుపు రంగులోకి మారుతుంది. ఆకులు రాలిపోవడం లేదా అస్సలు పెరగకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మీ పెరట్లో లేదా ఇంట్లోని మొక్క కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటుంటే.. కొన్ని చిట్కాలు బాగా పనికొస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తగినంత సూర్యకాంతి ముఖ్యం 

శీతాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల కరివేపాకు మొక్క ఎక్కువగా ప్రభావితమవుతుంది. మొక్క నిరంతరం నీడలో ఉంటే, దాని ఆకులు బలహీనంగా, పసుపు రంగులోకి మారి, రాలిపోవడం ప్రారంభిస్తాయి. మొక్కను కనీసం 5-6 గంటల సూర్యరశ్మి లభించే ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నించండి.


మీ ఇంటి బాల్కనీకి తక్కువ సూర్య రశ్మి లభిస్తే అలర్ట్ అవ్వండి. మొక్కను ప్రతిరోజూ కొన్ని నిమిషాలు టెర్రస్ లేదా తగినంత సూర్యరశ్మి ఉన్న మరొక ప్రదేశానికి మార్చండి. సూర్యరశ్మి లభించిన తర్వాత, మొక్కలో కొత్త ఎనర్జీ వస్తుంది.



నీరు విషయంలో జాగ్రత్త 

శీతాకాలంలో నీరు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో మొక్కలకు తక్కువ నీరు అవసరం. ఎందుకంటే నేల తేమగా ఉంటుంది. అందుకే మొక్క నేల నెమ్మదిగా ఎండిపోతుంది. దీని వల్ల ఎక్కువగా నీరు పెట్టడం వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోతాయి.


అందుకే నీరు పెట్టేటప్పుడు మట్టిని తనిఖీ చేయండి. నేల పొడిగా ఉంటేనే నీరు పెట్టండి. అధికంగా నీరు పెట్టడం వల్ల మొక్క బలహీనపడి కుంగిపోతుంది. అందుకే అవసరమైన సమయాల్లో తక్కువ మోతాదులో నీరు అందించండి.



సరైన నేల మిశ్రమం చాలా ముఖ్యం 

కరివేపాకు మొక్క పోషకాలు ఎక్కువగా ఉన్న నేలలో బాగా పెరుగుతాయి. అందుకే మట్టిని ఎండిన ఆవు పేడతో కలపండి. కావాలంటే వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేయండి. దీంతో, నేలకు తగిన పోషకాలు లభిస్తాయి. ఇది కరివేపాకు మొక్కకు తగినంత పోషణ అందుతుంది. ఇలా చేయడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది.



ఎరువులు ముఖ్యం 

కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఐరన్ అవసరం కావచ్చు. దీనిని సేంద్రియ ఎరువులు అందించగలవు. రసాయన ఎరువులు మొక్కను దెబ్బతీయవచ్చు. అందుకే ఇంట్లోనే సహజమైన, సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. బియ్యాన్ని తేలికగా రుబ్బి నీటిలో నానబెట్టండి. నీటిని వడకట్టి, బియ్యాన్ని ఒక కంటైనర్‌లో నిల్వ చేసి, మీ కరివేపాకు మొక్కలకు జోడించండి.


పులియబెట్టిన మజ్జిగను కూడా కరివేపాకు మొక్కకు పోయవచ్చు. వేప ఆకుల్నిఎండబెట్టడం ద్వారా కరివేపాకు మొక్కకు సహజ ఎరువు అందించవచ్చు. ఇందుకోసం ఆకుల్ని పూర్తిగా ఆరబెట్టి పొడిని సిద్ధం చేయండి. ఈ పొడిని మట్టిలో తవ్వి కలపండి. ఇవి మొక్కకు తగిన పోషకాలు అందించి.. ఏపుగా, గుబురుగా పెరిగేలా చేస్తాయి.



తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

​కరివేపాకు మొక్క చిన్న చిన్న తెల్ల పువ్వుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పువ్వులు మొక్క పెరుగుదలను అడ్డుకుంటాయి. మొక్క వాడిపోతుంటే.. ఈ పువ్వుల్ని కత్తిరిచడం చాలా ముఖ్యం.

​కరివేపాకు మొక్క చాలా పొడవుగా పెరుగుతుంటే, ముందుగా కాండం మధ్యలో కత్తిరించండి. దీనివల్ల కాండం రెండుగా విడిపోతుంది. అక్కడ నుంచి కొత్త ఆకులు మొలకెత్తుతాయి. అలాగే, మూడు కొమ్మలు పెరిగే కాండం కత్తిరించండి. ఇది కరివేపాకు మరిన్ని కొమ్మలు మొలకెత్తడానికి ప్రోత్సహిస్తుంది.

గమనిక:-

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. వీటిని పాటించేముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం శ్రేయస్కరం. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.