Showing posts with label జీర్ణవ్యవస్థ. Show all posts
Showing posts with label జీర్ణవ్యవస్థ. Show all posts

2.13.2025

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. మీ లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే లక్షణాలివే, కనిపిస్తే నెగ్లెట్ చేయకండి

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి





కాలేయం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. లివర్ ఎన్నో విధుల్ని నిర్వహిస్తుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి. కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో.. అనేక వ్యాధుల బారిన మనం పడవచ్చు.

ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. అయితే, మన కాలేయం దెబ్బ తిన్నా, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో పదే పదే కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు కనిపించే లక్షణాలేంటి..? లివర్‌ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  పచ్చ కామెర్లు లేదా జాండిస్



కళ్లు, చర్మం పచ్చ రంగులో మారడం పచ్చ కామెర్లు లక్షణాలు. ఈ సంకేతాలు పదే పదే మీకు కనిపిస్తే లివర్ ప్రమాదంలో పడిందని అర్థం చేసుకోండి. పచ్చ కామెర్లు రావడం కాలేయ సమస్యల్ని సూచిస్తుంది. పచ్చ కామెర్లు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడే అవకాసం ఉంది.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  కాళ్ల వాపులు



కాలేయ పనితీరు మెరుగ్గా లేనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. దీంతో.. చాలా అవయవాల్లో నీరు ఎక్కువగా చేరుతుంది. దీంతో.. శరీరంలోని కొన్ని భాగాలు వాపులకు లోనవుతుంటాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. చేతి వేళ్లతో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. లివర్ డ్యామేజ్‌ని సూచించే సంకేతం ఇది. అందుకే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

​        మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే 


మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే
 ఏ సమస్య ఉండదు. చాలా మందికి అప్పుడప్పుడు మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంటుంది. ఒంటిలో వేడి చేసినప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. అయితే, మూత్రం తరుచుగా పసుపు రంగులో కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు మూత్రం రంగు ఇలా కనిపిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరుచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  వికారం, ఆకలి లేకపోవడం


మీకు ఏది తినాలనిపించడం లేదా.. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందా అయితే ఇవి మంచి లక్షణాలు కావు. లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే సంకేతం. లివర్ సమస్యతో బాధపడుతున్నట్టుయితే ఆకలి మందగిస్తుంది. చాలా రోజుల వరకు ఏమి తినాలనిపించదు. అంతేకాకుండా వికార సమస్యలు ఉంటాయి. తరుచుగా వాంతులు అవుతుంటాయి. భోజనం చేసిన వెంటనే వికారం, వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం బెస్ట్.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  అలసట, గోళ్ల రంగులో మార్పు

చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే, ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే. అంతేకాకుండా చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మ‌చ్చ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. లేదా గోళ్లు ప‌సుపు రంగులో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఒంటి నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. 

కాలేయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. 

ప్రతి రోజూ వ్యాయామాన్ని భాగం చేసుకోండి. ​వైద్యుల ప్రకారం బ్రిస్క్ వాకింగ్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
* ప్రతి రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి కి.మీకి నడకలో వేగం పెంచితే ఫలితం అద్భుతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* సైక్లింగ్, స్విమ్మింగ్, హైకింగ్ వంటి వ్యాయామాల్ని చేస్తే లివర్ సేఫ్‌గా ఉంటుంది.
* ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
* తినే ఆహారంపై దృష్టి పెట్టండి. చక్కెర, సోడియం అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. సమతుల్య ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోండి.

గమనికఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

ప్రేమను వ్యక్తపర్చడానికే కాదు గులాబీ పువ్వులతో బరువు కూడా తగ్గవచ్చు, అయితే తీసుకునే విధానం ఏంటో తెలుసా?

 గులాబీ పువ్వుల్లో Vitamin A, Vitamin C, Vitamin E, Iron, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. గులాబీ పువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, weight loss, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాలు, 

ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రేమను వ్యక్తపర్చడానికే కాదు గులాబీ పువ్వులతో బరువు కూడా తగ్గవచ్చు, అయితే తీసుకునే విధానం ఏంటో తెలుసా?
 గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. గులాబీ పువ్వు ప్రేమ, అందానికి మాత్రమే చిహ్నం కాదు. ఇందులో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. గులాబీ పువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

బరువు తగ్గడం

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బరువు తగ్గడంలో గులాబీ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే. బరువు తగ్గడం కోసం 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ నీటిని తాగాలి. ఇలా ఒక నెల రోజుల పాటు గులాబీ నీరు తాగడం వల్ల మీరు తేడాను గమనిస్తారు.

మొటిమలకు చెక్

​మొటిమల సమస్యను తొలగించడంలో గులాబీ పువ్వు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇందుకోసం కొన్ని మెంతుల్ని వేయించండి. ఆ తర్వాత రోజ్ వాటర్ సాయంతో పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 Mints అలాగే ఉంచండి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని వాటర్‌తో కడుక్కోండి. వారానికి కనీసం 2 Times అయినా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.


జీర్ణక్రియ మెరుగు

గులాబీ రేకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది. జీర్ణసమస్యలు ఉన్నవారి ఇది బెస్ట్ ఆప్షన్. గులాబీ రేకులు తినడం వల్ల పేగుల కదలికలు వేగవంతం అవుతాయి. పేగులు ఉత్తేజపడి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం గులాబీ రేకుల్ని శుభ్రపరిచి నేరుగా తినవచ్చు. లేదంటే 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది.

మానసిక స్థితి మెరుగవుతుంది

గులాబీ పువ్వుల్లో మానసిక స్థితిని, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ కారణంగా ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి గులాబీ పువ్వులు బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం గులాబీ రేకుల్ని ఓ 15 తీసుకోండి. ఆ తర్వాత వీటిని గులాబీ రేకుల్ని నీటిలో బాగా మరగించండి. ఆ తర్వాత గులాబీ రేకుల నీటి ఆవిరిని పీల్చడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

1.15.2025

రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి

 రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే..






















అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని.

జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. కానీ, ఇవన్నీ పొందాలంటే.. మీరు సహజంగా పండిన అరటిపండును తినాలి.

అయితే మీరు తినే అరటిపండ్లను ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..? మనం కేవలం రూ. 60కే డజన్ అరటి పండ్లు కొని.. మన ఇంటికి క్యాన్సర్ తెచ్చుకుంటున్నాం. పక్వానికి రాక ముందు అరటి పండ్లను తెంపేసి.. కార్బైడ్ రసాయనాన్ని ఉపయోగించి పండిస్తున్నారు. దీంతో.. మీ శరీరంలో విషం కలుస్తుంది. అసలు కార్బైడ్ అంటే ఏంటి..? దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్బైడ్ అంటే ఏంటి..?

అరటిపండ్లతో పాటు.. ఇతర పండ్లను పండించడానికి కార్బైడ్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పండ్లలోని తేమను ఎండబెట్టి.. వాటిలో ఇథైల్ అనే వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇథైల్ పండ్ల లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. పండ్లు పక్వానికే ముందు పండిపోతున్నాయి. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని చాలా ప్రాంతాల్లో నిషేధించారు. కానీ, ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆశతో కాల్షియం కార్బైడ్‌ని వినియోగిస్తున్నరు. ఈ రసాయనం వాడటం వల్ల పండ్లు నిర్ణీత సమయానికి ముందే పక్వానికి వచ్చి త్వరగా మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో నిషేధించబడిన రసాయనం. దీనిని ఆరోగ్యానికి ప్రమాదంగా గుర్తించారు. ఇలా పండిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

ఈ రసాయనాన్ని భారతదేశంలో నిషేధించారు..

కాల్షియం కార్బైడ్‌లో సాధారణంగా ఆర్సెనిక్, ఫాస్పరస్ ఉంటాయి. ఈ రసాయనాల వాడకం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుంది. ఈ ప్రమాదాల కారణంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించారు. పండ్లను పండించడానికి ఇథిలీన్ సురక్షితంగా పరిగణించబడుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ఇథిలీన్ హానికరం కాదు. భారతదేశంలో పండ్లను పండించడానికి ఇథిలీన్ వాయువును ఉపయోగించడంపై FSSAI ఆమోదించింది. ఇథిలీన్ సహజంగా పండ్ల పక్వానికి వచ్చే ప్రక్రియను నియంత్రిస్తుంది . ఈ వాయువును పంట, రకం, పక్వత నుంచి పండ్లలో 100పీపీఎం (100 μl/L) సాంద్రతల బట్టి ఉపయోగించవచ్చు

విష పదార్థాలు..

కాల్షియం కార్బైడ్ ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా దాహం, మైకము, బలహీనత, ఆహారాన్ని మింగడంలో వంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం కార్బైడ్ రసాయనం కాబట్టి.. ఏ రూపంలోనైనా సరే బాడీలో చేరితే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు..

కార్బైడ్ వాడకం కడుపు నొప్పి, విరేచనాలు, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, కాల్షియం కార్బైడ్‌కు నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, తలనొప్పి, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం కూడా..

NCBIలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కాల్షియం కార్బైడ్‌ వల్ల మైకము, తలనొప్పి, మానసిక స్థితి తగ్గడం, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు వంటి నరాల సంబంధిత లక్షణాలు ఏర్పడవచ్చు. ఏ రూపంలోనైనా ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


పోషకాలు పోతాయి..
కృత్రిమంగా పండిన పండ్లలో.. సహజంగా పండిన పండ్ల కంటే తక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి కావాల్సిన చక్కెరలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పూర్తిగా అందించవు. దీంతో.. వీటిని తినడం వల్ల లాభాల కంటే ముప్పే ఎక్కువగా ఉంది.

కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లను ఎలా గుర్తించాలి..

* కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు అసమానంగా పండుతాయి. అరటిపండులోని కొంత భాగం పసుపు రంగులోకి మారుతుంది. మరి కొంత భాగం పచ్చగా ఉండవచ్చు. ఈ తేడాలు గమనించి మీరు అరటి పండ్లను తీసుకోండి.

* కాల్షియం కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు సహజంగా పండిన అరటిపండ్ల కంటే వేగంగా పాడైపోతాయి.

* కార్బైడ్ వల్ల అరటిపండ్ల తొక్క పసుపు రంగులో కనిపిస్తుంది. నిగనిగలాడుతుంది. కానీ, లోపలి పండు మాత్రం గట్టిగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

* సహజంగా పండిన అరటిపండ్లు చాలా మృదువుగా ఉంటుంది. దాని ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అరటిపండు పూర్తిగా పసుపు రంగులో ఉన్నప్పటికీ ఇంకా చాలా గట్టిగా ఉంటే, అది రసాయనాలతో పండించారని అర్థం చేసుకోండి.

* సహజంగా పండిన అరటిపండ్లు ఆహ్లాదకరమైన తీపి వాసన కలిగి ఉంటాయి. రసాయనాలతో పండిన అరటిపండ్లలో ఈ సహజ సువాసన ఉండదు.


గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

1.09.2025

జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు

 జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు

కాఫీ లేదా టీలో టానిన్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్వవస్థపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అది వ్యాధిగా మారే ముప్పు ఉంది.