1000 Health Tips: Knee పెయిన్.మోకాళ్ల నొప్పులు relief Articleshow

Knee పెయిన్.మోకాళ్ల నొప్పులు relief Articleshow



మోకాళ్ల నొప్పులు

మోకాళ్ల నొప్పులతో చాలామంది విపరీతంగా బాధపడుతుంటారు. మన శరీరం బరువును మోసే ప్రక్రియలో అత్యంత కీలకమైనది మోకాలు. చాలా ఎక్కువగా దెబ్బలు తగిలే అవకాశం ఉన్న అవయవం కూడా మోకాలే. మనం నిలబడటానికి, కూర్చోవడానికి, పక్కలకు తిరగడానికి, నడవడానికి, పరుగెత్తడానికి ఉపయోగపడే అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్న మోకాళ్లకు నొప్పులు వస్తే, మన శరీరం మొత్తం మూలపడినట్లుగా అవుతుంది. అందుకే మోకాళ్ల నొప్పులను విస్మరించకూడదు.

మోకాళ్లనొప్పి... కారణాలు: మోకాలి జాయింట్

కింద ఉండే ఎముకల్లో పటుత్వం తగ్గడం లేదా అరిగిపోవడం కొన్ని సందర్భాల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ మ్యారో క్యాన్సర్ వంటి జబ్బులు ప్రమాదాల్లో మోకాళ్లకు తీవ్ర గాయాలు కావడం స్థూలకాయం కారణంగా మోకాళ్లపై అదనపు బరువు పడటం వల్ల మోకాలి ఎముకలు త్వరగా అరుగుదలకు గురికావడం ఆధునిక జీవనశైలి వల్ల మోకాళ్లకు తగిన వ్యాయామం లేకపోవడం ఆధునిక జీవనశైలి వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల వినియోగం అధికం కావడంతో ఇటీవల తరచూ గౌట్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా పెరగడం.


పైన పేర్కొన్న కారణాలతో మోకాళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎముక చివరన ఉండే కణాలు ప్రతి 40 రోజులకు ఒకసారి చనిపోయి ఆ ప్రాంతంలో కొత్త కణాలు పుడతాయి. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఉన్నవారిలో జబ్బు ఉన్నచోట కణాలు పుట్టవు. కానీ జబ్బు లేనిచోట కణాలు online casinos పెరుగుతాయి. ఫలితంగా కణాలు అసమానంగా పెరగడం... పెరిగిన చోట కణాలు ఒరిపిడికి గురి కావడం, ఫలితంగా ఒరిపిడి కలిగిన చోట నొప్పి కలగటం జరుగుతుంది.

కీళ్లజబ్బు నిర్ధారణ: ఎక్స్రే, ఎమ్మారై, రక్త, మూత్ర

పరీక్షలు, సీటీ స్కాన్, సైనోవియల్ కల్చర్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.

చికిత్స: వైద్య పరీక్షల ద్వారా మోకాలునొప్పికి

అసలు కారణం తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధునిక హోమియో చికిత్స ద్వారా అలాంటి ఆపరేషన్స్ ఏవీ లేకుండానే మంచి చికిత్స అందించవచ్చు. హోమియో మందులు మోకాళ్లలో వ్యాధి లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఏర్పడే టాక్సిన్స్ను బయటకు పంపి నొప్పిని తగ్గిస్తాయి. గాయం వల్ల దెబ్బతిన్న బాగాలకు రకసరపరాను పునరుద్దరించి గాయం. త్వరగా మానడానికి ఉపకరిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నిర్ధారణ తొలిదశలోనే జరిగితే దెబ్బతిన్న కార్టిలేజ్ను తిరిగి రూపొందేలా చేయగల అవకాశం ఉంది. మోకాళ్ల నొప్పులకు హోమియోలో రస్టాక్స్, లెడమ్పాల్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో తగిన పొటెన్సీలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గమనిక: సోషల్ హెల్త్ టిప్స్ మాత్రమే పూర్తి వివరాలు నిపుణలు అడిగి తెలుసుకోగలరు