మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు వల్ల మెదడులో కణతుల వల్ల, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగంలో వస్తుంది. వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల వస్తుంది.
పార్శ్వపు తలనొప్పికి కారణాలు:
పార్శ్వపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.
డిప్రెషన్, నిద్రలేమి వల్ల వస్తుంది.
కొంతమంది బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.
అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.
స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వసుంది. ఋతుచకం ముందు గాని. తర్వాత గానివచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.
oral contraceptive pills వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది.
మైగ్రేన్ దశలు - లక్షణాలు:
చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుండి 72 గంటలు ఉన్నట్లయితేStatus Migrainosus అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది
ప్రాడ్రోమ్ ఫేస్: ఇది నొప్పికి ముందు 2గం||నుండి 2
రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
ఆరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల
ముందు ఉంటుంది. దృష్టిలో చూపు కాస్త మందగించినట్లవడం, చూపులోZigzag lines రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవడం, మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉండటం
నొప్పి దశ: ఈ నొప్పి దశ 2గం.ల నుండి 3 రోజుల
వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతు లు ఉంటాయి. చాలావరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి వారు సెన్సిటివ్గా ఉంటారు. చాలా
పోస్ట్ డ్రోమ్ ఫేస్: నొప్పి తగ్గిన తర్వాత, కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది.
వ్యాధి నిర్ధారణ:
రక్త పరీక్షలు - CBP, ESR
రక్తపోటును గమనించడం
EEGపరీక్ష
సి.టి. స్కాన్ (మెదడు)
MRI
మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి
మైగ్రేన్ తలనొప్పి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు...
మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.
అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం, యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా
మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తలకు నూనెతో మసాజ్ చేయించుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి.
తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.
హోమియో వైద్యం:
మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. తలనొప్పి... ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరచు తలనొప్పి అధికంగా వస్తే - నేట్రమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నేట్రమ్ మూర్, ట్యుబర్కులినమ్ ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలనొప్పి వస్తే - ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే కాల్కేరియాఫాస్, నేట్రమ మూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి.
No comments:
Post a Comment