కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాలవ్యాధికి కారణమవుతాయి. దాంతో ఆరోగ్యం దిగజారుతుంది. సకాలంలో హోమియో చికిత్స అందిస్తేఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.
కారణాలు: శారీరకశ్రమ తక్కువగా ఉండటం,
తగినన్ని నీళ్లు తాగకపోవడం, కుటుంబచరిత్ర, స్థూలకాయం, మద్యపానం వంటివి ముఖ్యకారణాలు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పుట్టుకనుంచి ఒకటే కిడ్నీ లేదా చిన్నకిడ్నీలు ఉండటం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడేవారిలోనూ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు: తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి
రావడం, మూత్రం తక్కువపరిమాణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపురంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పి, వికారం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం, అకస్మాత్తుగా లేదా తరచు వాంతులు, జ్వరం రావడం వంటివి జరుగుతాయి.
నివారణ: రోజూ శారీరక వ్యాయాయం, నడక,
నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టొమాటో, సోయాబీన్, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు.
చికిత్స: హోమియో వైద్యం ద్వారా వీటిని శాశ్వతంగా నయం చేయవచ్చు.
No comments:
Post a Comment