మెడ నల్లగా ఉంటే
చాలా మంది ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. మెడ శుభ్రం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో సమస్య తీవ్రతరమౌతుంది. దీనితో ఇతర మందులు.. బ్యూటీషియన్స్ ను సంప్రదిస్తుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు..
మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది కదా. ఈ మురికి వదిలించుకోవడానికి చాలా సార్లు సబ్బు పెడుతుంటారు. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో బియ్యం పిండి వేసి ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయండి. అనంతరం గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.
బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మీ మెడ మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ తో మెడను శుభ్రం చేసుకుంటే మెడ సౌందర్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.
మెడ మీద నలుపును నివారించుకోవడం కోసం నిమ్మరసానికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి, దీన్ని మెడచుట్టు అప్లై చేసి 15 నిముషాల తర్వాత స్క్రబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
No comments:
Post a Comment