ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..
ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.
రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.
టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.
ఒక టేబుల్ స్పూన్ ఉప్పు.. నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.