Showing posts with label మలబద్ధకం. Show all posts
Showing posts with label మలబద్ధకం. Show all posts

2.12.2025

శృంగార సామర్థ్యాన్ని పెంచే ఉలవలు.. ఇంకా ఎన్నో లాభాలు.ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి.

 







ప్రపంచంలో అత్యంత ప్రాచీన్య ధాన్యం జాబితాలో ఉలవలు మొదటి స్థానంలో నిలుస్తాయి. ఉలవలను ఉత్తర భారత దేశంలో అధిక శాతం మంది తింటుంటారు. ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి.

ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. హైబీపీని తగ్గించి బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఉలవలు నవ ధాన్యాల్లో ఒకటిగా ఉన్నాయి. వీటిల్లో తెలుపు, ఎరుపు, నలుపు రంగు ఉలవలు లభిస్తాయి. మనం ఎక్కువగా ఎరుపు రంగు ఉలవలను తింటుంటాం.


ఉలవలతో చారు చేసి తినవచ్చు. కషాయం చేసి తాగవచ్చు. దీంతో మూల వ్యాధి తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. శరీరంలోని కఫం తొలగిపోతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు నెలసరి సరిగ్గా వస్తుంది. ఉలవలను తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. అజీర్తి తగ్గుతుంది. ఆకలి సరిగ్గా అవుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.


ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. ఉలవలను తింటుంటే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలను తినాలి. అధికంగా బరువు ఉన్నవారు, పొట్ట ఉన్నవారు ఉలవలను తింటుంటే ఫలితం ఉంటుంది. శరీరం మంటగా ఉంటే ఉలవల పొడిని మజ్జిగలో కలిపి తాగుతుండాలి. ఉలవలను తింటే బోదకాలు నుంచి ఉపశమనం లభిస్తుంది. లైంగిక శక్తి పెరుగుతుంది. ఉలవలను వేడి చేసి కాపడంలా పెడితే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. మూత్రంలో మంట తగ్గాలంటే ఉలవల నీళ్లను కొబ్బరి నీటితో కలిపి తాగాలి. ఉలవలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినడం మరిచిపోకండి.


ఆరోగ్యం & జీవన విధానం

2.05.2025

మలబద్ధకం

 మలబద్ధకం

మలబద్ధకం

ఓ వ్యక్తి వారానికి మూడు కంటే తక్కువ సార్లు మల విసర్జన చేస్తుంటే దీనిని మలబద్ధకం అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మలబద్ధకం కారణాలు..

మలబద్ధకం రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో డీహైడ్రేషన్, డైట్ సరిగా లేకపోవడం, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం, వర్కౌట్ చేయకపోవడం, మెడిసిన్స్ తీసుకుంటే వాటి సైడ్ ఎఫ్టెక్ట్స్ వల్ల మలం గట్టి పడి ప్రేగుల్లో అడ్డంకిగా మారి ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే ఏం చేయాలో చూద్దాం.

ఎవరికీ వస్తుంది..

  • వృద్ధాప్యం..
వయసు పెరిగే కొద్దీ కూడా మలబద్ధకం ఎదువుతుంది. ఆహారం జీర్ణాశయం ద్వారా వెళ్ళడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో మలబద్ధకం ఎదురవుతుంది. కాబట్టి, ఈ సమయంలో పీచు పదార్థాలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

  • గర్భ సమయంలో..
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మహిళలు హార్మోన్ల మార్పులు, ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో మలబద్దకం ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు డాక్టర్ సలహా పాటించడం మంచిది.


లక్షణాలు..

ఈ సమస్య వస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి..

  • కడుపులో తిమ్మిరి
  • పొత్తికడుపులో నొప్పి
  • ఉబ్బరం
  • గ్యాస్
  • మలంలో రక్తం
  • వాంతులు
  • జ్వరం


ఏం తినాలి..

సరైన ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే మలబద్ధకం వేధించదు. మరి ఫుడ్స్ ఏంటంటే..

  • పండ్లు
  • కూరగాయలు
  • హోల్ గ్రెయిన్స్ నట్స్
  • శనగలు..
  • నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి
  • నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.
  • వీటితో పాటు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.


వీటిని తినొద్దు..

ఏం తినాలో చూశాం కదా.. ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ తినకూడదంటే..

  • నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు..
  • ప్రాసెస్డ్ ఫుడ్స్
  • చిప్స్, జంక్, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు.
  • పాలు, పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
  • ప్యాకేజ్డ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి.


ఒత్తిడి..

ఒత్తిడి కారణంగా కూడా చాలా వరకూ మలబద్ధకం వేధిస్తుంది. కాబట్టి, దీనిని దూరం చేసుకోండి. అందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు. నిద్ర సరిపడా పోవాలి. లేకపోతే మన రోజువారీ పనులపై ఈ ప్రభావం పడి ఒత్తిడి పెరగడం మలబద్ధకం ఎదువుతుంది.


వర్కౌట్..

అదే విధంగా వర్కౌట్ చేయకపోవడం వల్ల కూడా సమస్య వస్తుంది. కాబట్టి, కచ్చితంగా రోజూ ఏదైనా ఓ వర్కౌట్ చేయండి. వాకింగ్ అయినా అలవాటు చేసుకోండి. కనీసం 30 నిమిషాల పాటు ఏదైనా ఓ వర్కౌట్ చేయడం మంచిది.


డీహైడ్రేషన్..

డీహైడ్రేషన్ కారణంగా కూడా మలబద్ధకం ఎదువుతుంది. కాబట్టి, కచ్చితంగా నీరు తాగండి. అదే విధంగా కెఫిన్ డ్రింక్స్‌కి దూరంగా ఉండండి. కాఫీ, ఆల్కహాల్‌కి దూరంగా ఉండండి. వీలైనప్పుడల్లా నీటిని తాగండి.


వీటితో పాటు..

కొంతమందికి కొన్ని ఆహారాలు సరిగ్గా జీర్ణమవ్వవు. దీని వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. అలాంటి పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా వరకూ సమస్య పరిష్కారమవుతుంది.


సమస్యని పట్టించుకోకపోతే..

ఈ సమస్యని పట్టించుకోకపోతే అది తీవ్రమై పైల్స్ వంటి ఇతర సమస్యలకి దారి తీస్తుంది. కాబట్టి, కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి.


డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి..

ఇవన్నీ పాటించినా సమస్య పరిష్కారమవ్వకపోతే కచ్చితంగా డాక్టర్‌ని కలవాలి. మలంలో రక్తం, జ్వరం, పొత్తికడుపు నొప్పి, వీపులో, కడుపులో నొప్పి ఉన్నా డాక్టర్‌ని కలవాలి. కొంతమందికి జ్వరం, వాంతులు ఉంటాయి.