Showing posts with label childerns. Show all posts
Showing posts with label childerns. Show all posts

2.28.2025

Bird Flu Childerns Helth Problem Eat: పసిబిడ్డకు బర్డ్ ఫ్లూ.. జాగ్రత్త, ఎలా సోకిందంటే?

 Bird Flu: పసిబిడ్డకు బర్డ్ ఫ్లూ.. జాగ్రత్త, ఎలా సోకిందంటే?


Bird Flu: ఈ రోజుల్లో భారతదేశం, అమెరికాతో సహా అనేక దేశాలు బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాయి. బర్డ్ ఫ్లూ సాధారణంగా కోళ్లు, పక్షులలో సంక్రమణను వ్యాపింపజేస్తుందని భావిస్తారు.

ఎలుకలలో కూడా ఈ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. ఇదిలా ఉంటే బర్ట్ ఫ్లూతో కాంబోడియాలో చిన్నారి మృతి చెందిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంటు వ్యాధుల ముప్పు వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతుంది . భారతదేశంలో కూడా ఇటీవల స అనేక వ్యాధులు వేగంగా పెరిగుతున్నాయి. ఏవియన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అని కూడా పిలువబడే H5N1 వైరస్ అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూ సాధారణంగా కోళ్లు, పక్షులను ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్‌. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ఇది ఆవులకు, మనుషులకు కూడా సోకుతుంది.

అమెరికాలో కొత్త రకం బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పటి నుండి, ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి కోళ్ల ఫామ్‌లలో సుమారు 148 మిలియన్ (14.8 కోట్లకు పైగా) కోళ్లను చంపారు. ఇది గుడ్ల ధరలలో భారీ పెరుగుదలకు దారితీసింది. అటువంటి పరిస్థితిలో, సంక్రమణను నివారించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ?

H5N1 సంక్రమణను మొదట మార్చి 2024లో పాడి ఆవులలో గుర్తించారు. ఇదిలా ఉంటే మనుషులలో దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. వారిలో ఎక్కువ మంది పాడి, కోళ్లను పెంచేవారే. ఇప్పటివరకు ఒక వ్యక్తి కూడా ఈ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించగా తాజాగా కాంబోడియాలో ఓ చిన్నారి కూడా మృతి చెందింది. ఈ అంటు వ్యాధి కేసులు పెరుగుతున్న ప్రదేశాలలో, ప్రజలందరూ నివారణ చర్యలను తీవ్రంగా తీసుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2.26.2025

ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అసలు ఏ ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రెగ్నెంట్స్

pregnancy

​ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీట్‌రూట్ తినడం మంచిది. అయితే, ఎక్కువ మాత్రం తినకూడదు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహాతో ఎంత మోతాదులో తినొచ్చో తెలుసుకుని అంతే పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలొస్తాయి.

పిల్లలకి

child

మంచి కూరగాయలు అని చాలా మంది పిల్లలకి తినిపిస్తుంటారు. అయితే, నెలల వయసున్న పిల్లలకి బీట్‌రూట్ పెట్టడం అసలు మంచిది కాదు. ఇందులో హై నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రేట్ పాయిజనింగ్‌లా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 నెలల పిల్లల అంతేకంటే తక్కువ వయసు ఉన్నవారికి బీట్‌రూట్ అసలే ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

అలర్జీ

infection

ప్రతి ఒక్కరికీ అన్నీ కూరగాయలు పడవు. కొంతమందికి అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. బీట్‌రూట్‌ తింటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమంది ఈ బీట్‌రూట్ ఉడికించేటప్పుడు ఆ వాసనని పీల్చడం వల్ల ఉబ్బసం వంటి సమస్యలొచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది అందరికీ కాదు. కొంతమందికి ఈ సమస్య ఉండొచ్చు. అదే విధంగా, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, అజీర్ణ సమస్యలున్నవారు ఈ వెజిటేబుల్‌ని అసలే తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.

క్యాన్సర్ ఉన్నవారికి

cancer

బీట్‌రూట్ క్యాన్సర్స్‌కి ముఖ్యంగా, బ్రెస్ట్, లంగ్, కొలన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా నిరోధక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే, ఇది డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టంగా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు పెరగవు. అదే విధంగా, షుగర్ ఉన్నవారు కూడా బీట్‌రూట్‌ని ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

లివర్ ప్రాబ్లమ్స్

liver problem

అదే విధంగా, బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనికి కారణం, బీట్‌రూట్‌లో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. అదే విధంగా, కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. లోబీపి సమస్యతో బాధపడేవారు, ఆ సమస్యకి ట్యాబ్లెట్స్ వాడేవారు బీట్‌రూట్ తీసుకోకపోవడమే మంచిది.

కిడ్నీలో రాళ్లు

kidney stone

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర ఆక్సలేట్ విసర్జనని పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల పెరిగేలా చేస్తుంది. కాబట్టి, బీట్‌రూట్‌ని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌ని అసలు తీసుకోకపోవడమే మంచిది.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

2.13.2025

గర్భధారణ సమయంలో, మీ ఆరోగ్యం మరియు మీ బిడ్డ అభివృద్ధి కోసం మీరు వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి.

 

గర్భధారణ సమయంలో, మీ ఆరోగ్యం మరియు మీ బిడ్డ అభివృద్ధి కోసం మీరు వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి.


వీటిలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు మరియు పాల ఉత్పత్తులు ఉన్నాయి .   

పండ్లు

ఆపిల్స్, బెర్రీస్, నారింజ, మామిడి, అరటిపండ్లు, ఖర్జూరం, తేనెపట్టు, ప్రూనే, ఆప్రికాట్లు మరియు ఎరుపు లేదా గులాబీ ద్రాక్షపండు   

ఇనుము శోషణకు సహాయపడే పొటాషియం మరియు విటమిన్ సి కలిగి ఉంటుంది   

కూరగాయలు   

బ్రోకలీ, చిలగడదుంపలు, దుంపలు, ఓక్రా, పాలకూర, మిరియాలు, జికామా, క్యారెట్లు, గుమ్మడికాయ మరియు టమోటాలు

విటమిన్ ఎ, పొటాషియం మరియు విటమిన్ సి కలిగి ఉంటుంది

తృణధాన్యాలు   

బ్రౌన్ రైస్, మిల్లెట్, ఓట్ మీల్, బుల్గుర్, మరియు హోల్ వీట్ బ్రెడ్

ఇనుము మరియు ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటుంది

ప్రోటీన్లు   

లీన్ మాంసాలు మరియు చికెన్, గుడ్లు, సముద్ర ఆహారం, బీన్స్ మరియు కాయధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు మరియు టోఫు

ప్రోటీన్ మరియు ఇనుము కలిగి ఉంటుంది

పాల ఉత్పత్తులు

తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాలు, పెరుగు, జున్ను, లాక్టోస్ లేని పాల ఉత్పత్తులు, మరియు బలవర్థకమైన సోయా పానీయాలు (సోయా పాలు) లేదా సోయా పెరుగు   

కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ మరియు డి కలిగి ఉంటాయి   

ఇతర ఆహారాలు   

సార్డినెస్, సాల్మన్, ట్రౌట్ మరియు క్యాన్డ్ లైట్ ట్యూనా వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు

హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగండి