Showing posts with label weightloss. Show all posts
Showing posts with label weightloss. Show all posts

2.28.2025

each day women butter milk ginger mirchi salth loss of fat :మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?


 మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?


Butter Milk:వేసవి రాకముందే చాలా చోట్ల ఎండల ప్రభావం మొదలైంది. అందువల్ల, వేసవి కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మనం సాధారణంగా కొన్ని సహజ పానీయాలు తాగుతుంటాం.

వాటిలో ఒకటి మజ్జిగ. వేసవిలో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 

కానీ దీనికి కొద్దిగా అల్లం కలిపి తాగడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అవును అదే నిజం. ఎందుకంటే మజ్జిగ, అల్లంలోని ప్రయోజనకరమైన లక్షణాలు బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజూ అల్లంను మజ్జిగలో కలిపి తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు నడుము చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. 

వేసవిలో మజ్జిగ ఒక గొప్ప పానీయం. ఇది లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. పాలతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, ఇది ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా వుంటుంది. అంతే కాకుండా, మజ్జిగలో సోడియం, పొటాషియం, భాస్వరం, విటమిన్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. 

కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో మెరుగ్గా పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, దీనిలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే ఆమ్లం కడుపును శుభ్రపరుస్తుంది.

మిక్సర్ జార్‌లో కొద్దిగా పెరుగు వేసి, చిన్న అల్లం ముక్కను మెత్తగా కోసి, అవసరమైనంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుని తాగాలి. అవసరమైతే, జీలకర్ర పొడిని కలుపుకోవచ్చు.

2.17.2025

Fat Burning: helth tipsకొవ్వు కరిగించడానికి ఏది బెటర్? భోజనానికి ముందు నడవడమా.. భోజనం తర్వాత నడవడమా?

 Fat Burning: కొవ్వు కరిగించడానికి ఏది బెటర్? భోజనానికి ముందు నడవడమా.. భోజనం తర్వాత నడవడమా?


వ్యాయామం అనే ప్రక్రియలో వాకింగ్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఇది మీ కేలరీలను సునాయాసంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మెటబాలిజం పెంచి, కండరాలను మంచి షేప్ లోకి మారుస్తుంది.

మీ వెయిట్ లాస్ జర్నీలో వాకింగ్ అనేది మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది.


వాకింగ్ చేయడంలో భిన్న అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. కొందరు ఖాళీ కడుపుతో నడిస్తే, మరికొందరు తిన్న తర్వాత నడుస్తారు. మీరెప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి ఏ సమయంలో వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుందనేది? ఈ రెండు సందర్భాల్లో ఎప్పుడు వాకింగ్ చేసినా కూడా కేలరీలు ఖర్చవుతాయి. కానీ, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏది ఉత్తమమనేది ఓసారి చూసేద్దామా?


ఎవరైనా బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు, ఉపవాసంతో ఉండి నడవటం మంచిది. దీన్ని 'ఉపవాస కార్డియో' అని కూడా పిలుస్తారు. ఒకరు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటే, తక్కువగా తిన్న తర్వాత నడవడం వారి రోజువారీ అలవాట్లలో భాగంగా ఉండవచ్చు.


ఉపవాసంతో నడక ఎలా సహాయపడుతుంది..

నడవడం మొదలుపెడితే శరీరం నిల్వ అయిన కొవ్వును శక్తిగా ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. మామూలుగా ఆహారంలో ఉండే గ్లూకోజ్ అందుబాటులో లేకపోవడం వల్ల, కొవ్వును కరిగించుకొని గ్లూకోజ్ గా మార్చుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే, కాలేయం గ్లైకోజన్ ను గ్లూకోజ్ గా విడదీస్తుంది. ఇది మజిల్స్‌కు శక్తిని అందిస్తుంది. నిద్రలో కూడా కాలేయం గ్లూకోజ్ ను రక్తప్రసరణలో విడుదల చేస్తుంది. అందువల్ల, శరీరంలో గ్లైకోజన్ నిల్వలు ఉదయానికి తక్కువగా ఉంటాయి. అందువల్ల, ఉపవాస స్థితిలో వ్యాయామం చేసినప్పుడు శరీరం మరింత కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది. ఇలా కొవ్వు కరగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


భోజనం తరువాత నడక

భోజనం తరువాత నడక కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం తరువాత నడిస్తే, ఆహారంతో తీసుకున్న గ్లూకోజ్ ను శరీరం శక్తిగా ఉపయోగిస్తుంది. అందువల్ల, ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ లేదా ఇన్సులిన్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది.


ఎంత సేపు నడవాలి?

బరువు తగ్గడంతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు, ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాలు నడవండి. మొత్తంగా, బరువు తగ్గేందుకు కేవలం వ్యాయామం మాత్రమే కాదు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా కొనసాగించాలి. మంచి నిద్ర పొందడం, క్యాలరీలను ఖర్చు చేయడం కూడా అవసరం. ఉపవాసంతో ఉన్నప్పటి నడక కొవ్వును ఎక్కువగా కరిగించవచ్చు.


నడిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


వాకింగ్ చేయాలనుకుంటే, సరైన బూట్లు లేదా పాదరక్షలు ధరించాలి.

నడవడానికి వెళ్లే ముందు పాలు లేదా నీరు వంటి పానీయాలను తీసుకోవడం మంచిది. తద్వారా హైడ్రేట్ గా ఉండగల్గుతారు.

నడవడానికి వెళ్లే ముందు వార్మప్ చేయడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మజిల్స్ లూజ్ అవుతాయి.

నడక వేగాన్ని మితంగా ఉంచుకుని, శ్వాసను నియంత్రణలో ఉంచుకోండి. ఫలితంగా శరీరంపై ఎలాంటి ఒత్తిడి రాకుండా ఉంటుంది.

2.16.2025

Weight loss Tips Helth Tips Article show

బరువు తగ్గడానికి, మీరు తక్కువ కేలరీలు తినడం, మరింత చురుకుగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు చేసుకోవడం ప్రయత్నించవచ్చు .   
తినడం   
ఎక్కువ పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినండి.
బ్రౌన్ రైస్, బార్లీ, మరియు హోల్-వీట్ బ్రెడ్ మరియు పాస్తా వంటి తృణధాన్యాలను ఎంచుకోండి.
తెల్ల బియ్యం మరియు తెల్ల రొట్టె వంటి శుద్ధి చేసిన ధాన్యాలను తక్కువగా తినండి.
డెజర్ట్‌లు, జెల్లీలు మరియు సోడాలు వంటి చక్కెర కలిపిన ఆహారాలు మరియు పానీయాలను పరిమితం చేయండి.
ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, అవకాడోస్, నట్స్, నట్ బటర్స్, మరియు నట్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను వాడండి.
తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులను ఎంచుకోండి.
ఆహార లేబుళ్ళను చదవండి.
చురుకుగా ఉండటం   
వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ చేయండి.
మీరు ఆనందించే కార్యకలాపాలను కనుగొని వాటిని రోజంతా విస్తరించండి.
విసుగు చెందకుండా ఉండటానికి మీ కార్యాచరణను మార్చుకోండి.
నడవడానికి సౌకర్యవంతమైన బూట్లు ధరించండి.
జీవనశైలి తగినంత నిద్ర పొందండి, ఒత్తిడిని నిర్వహించండి, మీ బరువు తగ్గించే ప్రణాళికను మీరు విశ్వసించే వారితో పంచుకోండి మరియు వారానికి 1 నుండి 2 పౌండ్ల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి.   
ఇతర చిట్కాలు
మీ భోజనాన్ని అధిక ఫైబర్ స్టార్చ్ కార్బోహైడ్రేట్లపై ఆధారపడి ఉంచండి.   
రుచిని త్యాగం చేయకుండా భోజనంలోని క్యాలరీలను తగ్గించుకోవడానికి రుచికరమైన పదార్థాలను ఎంచుకోండి.   
చక్కెర శీతల పానీయాలు, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ మరియు ఫ్లేవర్డ్ మిల్క్ వంటి పానీయాల నుండి ద్రవ కేలరీలను పరిమితం చేయండి.

బరువు తగ్గటానికి సూచనలు

పక్క వీధిలోని పాలబూత్కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే... కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే... బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్... అంట్లు కడగడానికి ఓ పనిమనిషి... పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ.... ఇదీ మారిన మన లైఫ్స్టైల్. చివరకు మనకు మిగిలిందేమిటి.... వెయిట్ లాస్ ట్రీట్మెంట్లకై వెదుకులాట.

పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్పై వెళ్లడం.... చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం..... ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు... అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. 5... ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు.


వెయిట్ తగ్గించే అద్భుతాలు స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్, క్రీములు, పౌడర్లు, టీలు (డాక్టర్ టీ), డైట్ సప్లిమెంట్లు... ఇలా చెప్పుకొంటూ పోతే బరువు తగ్గించేవని చెప్పేవి మార్కెట్లో సవాలక్ష ఉన్నాయి. కొన్ని ఫిట్నెస్ సెంటర్లయితే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ల పేరుతో మనీ బ్యాక్ పాలసీ లాంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాసౌండ్ చికిత్సలు, మసాజ్లు, రేడియేషన్ల వంటి వాటితో కొవ్వు కరిగిస్తామంటున్నాయి. కొన్ని జేబుకు చిల్లు పడటమే తప్ప వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు బాధితులు.'స్లిమ్మింగ్ మెషీన్ సహాయంతో మీ శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా తగ్గించేస్తామన్న మాటలు నమ్మి లక్షన్నర రూపాయలు చెల్లించాను.

స్లిమ్మింగ్ పరికరం ఉత్పత్తి చేసే వేడి కొవ్వును కరిగిస్తుందని నమ్మబలికారు. కానీ ఒక ఇంచు కూడా బరువు తగ్గలేదని వాపోయారు హైదరాబాద్కు చెందిన ఓ యాంకర్. మొత్తం బాడీ మసాజ్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని వెళ్లిన కాల్సెంటర్ ఉద్యోగిని అయిన ప్రమీల వాళ్లు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. రోజూ అరగంట సేపు వాకింగ్, తరువాత మరో అరగంట ఎక్సర్సైజ్ చేయడం వారానికి మూడుసార్లు తమ సెంటర్లో ఓ గంటసేపు మసాజ్...
నెలరోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గుతారని చెప్పడంతో ఇక తను తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టింది ప్రమీల. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా అలా బయటకు వెళితే చాలు.. ఏ బేకరీకో, ఫాస్ట్ఫుడ్ సెంటర్క వెళ్లడం రుచిగా ఉన్నదల్లా లాగించెయ్యడం... తరువాత బరువు పెరిగిపోతున్నామని బాధపడటం... ఇటీవలి కాలంలో ఈ తరహా ధోరణి ఎక్కువయింది. ఎక్కువ కష్టపడకుండా వెంటనే బరువు తగ్గిపోవాలన్న కోరికతో స్లిమ్బల్టులు, స్లిమ్ మెషీన్లు కొని తెచ్చిపెట్టుకోవడం, స్లిమ్ క్యాప్సుల్స్, యాంటి ఒబేసిటీ మందుల్లాంటివి వాడటం వల్ల అనుకున్న ఫలితం పొందడం మాట అటుంచి ఇతరత్రా సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది.



అసలైన మంత్రం

అందుకే బరువు తగ్గడానికి రాచబాట లాంటి వ్యాయామాన్ని వదిలేసి యంత్రాలపై ఆధారపడటం సరికాదు. వ్యాయామం చేసేందుకు సమయం సరిపోవట్లేదంటారు చాలామంది. కానీ ఆరోగ్యాన్ని మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఎంత అర్జెంట్ పనులున్నా వ్యాయామం కోసం కనీసం ఓ అరగంట సమయాన్ని కేటాయించాలి. మన రోజువారీ పనుల్లో కూడా కాస్త బద్దకాన్ని వదిలితేబరువు తగ్గించుకోవడం మన చేతుల్లో పనే. ఫస్టాఫ్లోర్కి వెళ్లడానిక్కూడా లిఫ్ట్ వాడేబదులు నాలుగు అంతస్థులున్నా మెట్లు ఎక్కండి. పక్కనున్న షాప్కి నడిచే వెళ్లండి. మీ బాబును స్కూల్లో దింపడానికి బండి తీయకండి.

సాధ్యమైనంతవరకూ కాళ్లకు పనిచెప్పండి.'హాస్పిటల్లో ఏ ఫ్లోర్కి, ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినా లిఫ్ట్ అసలే వాడను. బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటంలో నా రహస్యం అదే'అంటారు హైదరాబాద్ లోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు. అండుకే మీరూ బద్దకాన్ని వదిలి కొవ్వును కరిగించే వ్యాయామంపై దృష్టిపెట్టమంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్మెంట్లు తీసుకున్నా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం లేకపోతే మాత్రం ఎక్కడి కొవ్వు అక్కడే ఉంటుంది. అందుకే ఒకరిని చూసి ఒకరు వెయిట్ లాస్ సెంటర్ల వైపు పరుగులెత్తకుండా మంచి తిండి తినండి, బాడీకి పని పెట్టండి, ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు.

2.14.2025

ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ

ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ తన డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ని యాడ్ చేయడం వల్ల 20 కిలోల బరువు తగ్గానని చెబుతోంది.
చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటారు. కానీ, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ కేవలం 30 శాతమే. కచ్చితంగా బరువు తగ్గాలంటే ఫుడ్ చేంజెస్ చేయాలి. ఈ నేపథ్యంలోనే రిది శర్మ కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని చెబుతోంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

బరువు తగ్గిన రిధి శర్మ..

బంగాళాదుంప, మజ్జిగ..

బంగాళాదుంప తింటే బరువు పెరుగతారని అనుకుంటారు చాలా మంది. కానీ, దీనిని తీసుకునే విధంగా తీసుకుంటే చాలావరకూ బరువు తగ్గుతారు. బంగాళాదుంపల్లో ఎక్కువగా పొటాషియం, ఫైబర్‌లు ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఇక మజ్జిగ.. మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, వీటిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

బీన్స్, పప్పులు, జుకిని..

బరువు తగ్గడంలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. బీన్స్, పప్పులు, జుకిన్ వెజిటేబుల్‌లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జుకిని వెజిటేబుల్ ఇది చూడ్డానికి కీర దోసకాయలా ఉంటుంది. కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చేసే బీన్స్, పప్పులు, జుకినీలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. బరువు తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తాయి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


కాలీఫ్లవర్, ఆపిల్..

కాలీఫ్లవర్‌లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అదే విధంగా, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లలో యాపిల్స్ కూడా ఉన్నాయి. ఈ పండ్లని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. బాడీకి పోషకాలు అందుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్‌ని తీసుకుని బరువు తగ్గించుకోగలిగానని రిధి శర్మ చెబుతోంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు వీటిని వీలైనంతగా వారి డైట్‌లో చేర్చుకోవాలి. అయితే, ఏ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.


డార్క్ చాక్లెట్, మష్రూమ్స్..

డార్క్ చాక్లెట్స్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిని తినడం స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. దీంతో పాటు మష్రూమ్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.

టోఫు, నట్స్..

టోఫు కూడా బరువు తగ్గడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. నట్స్‌లో పోషకాలు, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.

గుండెను పదిలంగా ఉంచే ఆహారాలు, ఎప్పుడు, ఎంత మోతాదులో తినాలో తెలుసా?

 

ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది లైఫ్ స్టైల్(Life Style) మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో గుండె పోటు, అధిక బరువు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి.

ఫైబర్ రిచ్ ఆహారాల్ని డైట్‌లో భాగం చేసుకుంటే చాలా వ్యాధుల్ని కంట్రోల్ చేయవచ్చంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి, బరువును అదుపులో ఉంచడానికి ఫైబర్ సాయపడుతుంది. రోజూవారి ఆహారంలో ఫైబర్ తీసుకోవడం వల్ల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ డైట్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంతకీ ఫైబర్ రిచ్ డైట్‌లో ఉండే ఆహారాలేంటి? వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

* బాదం, చియా, అవిసె వంటి గింజలు
* ఓట్స్, బీన్స్
* తృణధాన్యాలు (బార్లీ, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, కొర్రలు, జొన్నలు)
* అవకాడో
* బ్రకోలి, క్యారెట్, బ్రస్సెల్స్ మొలకలు వంటి కూరగాయలు
* బఠానీలు, పాలకూర, చిరుధాన్యాలు
* తాజా పండ్లు, పప్పు ధాన్యాలు

ఫైబర్ రిచ్ డైట్‌తో ప్రయోజనాలు

బరువు తగ్గుతారు

​ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఫైబర్ రిచ్ డైట్ బెస్ట్ ఆప్షన్. ఫైబర్ లేదా పీచు పదార్థం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్‌ రిచ్‌ డైట్‌ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో.. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. అతిగా తినకుండా కంట్రోల్‌లో ఉండవచ్చు. ఫైబర్‌ శరీరంలోని కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది, బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుంది. దీంతో బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు.


రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి


ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాల్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మానవ శరీరం ఫైబర్‌ను గ్రహించుకోలేదు, అలా అనీ విచ్ఛిన్నం చేయలేదు. రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తూ రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. వైద్యులు సాధారణంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 22-35 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.

గుండెకు మేలు

ఫైబర్ రిచ్ డైట్ గుండెకు మేలు చేస్తుంది. నీటిలో కరగని ఫైబర్ ఆహారాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు ముప్పు కలుగుతుంది. అదే ఫైబర్ రిచ్ డైట్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కరగని ఫైబర్ ఎక్కువగా విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాల్లో లభిస్తుంది. వీటిని డైట్‌లో భాగం చేసుకోండి. రెగ్యులర్‌గా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గుతాయి. మంట, వాపు రాకుండా చూసుకుంటుంది.

క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది

చిక్కుళ్లు, బ్రకోలి, బ్రస్సెల్స్ మొలకలు, తృణధాన్యాల్లో లభించే ఫైబర్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో లభించే ఫైబర్ నీటిలో కరుగుతుంది. నీటిలో కరిగే ఫైబర్ లేదా పీచు పదార్థం చాలా మృదువుగా ఉంటుంది. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో కొలొరెక్టర్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలి?

ఫైబర్ ఎంత తీసుకోవాలన్నది జీర్ణ వ్యవస్థ పరిమాణం బట్టి ఉంటుంది. పెద్దగా ఉంటే ఎక్కువ ఫైబర్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు 50 కిలోల బరువు ఉన్నవారికి 20 నుంచి 25 గ్రాముల ఫైబర్ అవసరం. అదే 75 కిలోల బరువుంటే సుమారు 30 నుంచి 35 గ్రాముల ఫైబర్ కావాలి. బ్రేక్ ఫాస్ట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.


గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.


బత్తాయి జ్యూస్ తాగితే బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు, అయితే ఎప్పుడు తాగాలంటే

 వింటర్ సీజన్‌లో మనకు బత్తాయి పండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మార్కెట్లలో, రోడ్లపై వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయితే, చలికాలంలో బత్తాయి, బత్తాయి జ్యూస్ తీసుకోకూడదని కొందరు చెబుతుంటారు. బత్తాయి జ్యూస్, బత్తాయి తీసుకోవడం వల్ల జలుబుతో పాటు దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతారు. అయితే, ఇది సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. సీజనల్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చలికాలంలో మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా జలుబు, దగ్గు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో బత్తాయి జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

​బత్తాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను ఇది నివారించడంలో సహాయపడుతుంది. బత్తాయిలో ఉండే పోషకాలు అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అలసటను తగ్గిస్తాయి. నీరసం లేకుండా చేస్తాయి. బత్తాయి పండు తినడం ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.. ఆస్థియో, ఆర్థరైటిస్ వంటి సమస్యలు బారినపడకుండా ఉంటారని నిపుణులు తెలిపారు. అయితే బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మరింత మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి బూస్టర్

బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ ఒక గ్లాసు బత్తాయి జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. బత్తాయి జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం

బత్తాయిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి బత్తాయి జ్యూస్ బెస్ట్ ఆప్షన్. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు బత్తాయి జ్యూస్ తాగాలంటున్నారు.

బరువు తగ్గడం

బత్తాయిలో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బత్తాయిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బత్తాయి జ్యూసుని డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్.బత్తాయిలో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బత్తాయిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బత్తాయి జ్యూసుని డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ వల్ల ఒత్తిడితో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి బత్తాయి జ్యూస్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. బత్తాయి పండులో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. మీరు ఒత్తిడితో బాధపడుతుంటే రోజూ ఒక గ్లాస్ బత్తాయి జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు.

చర్మానికి మేలు

బత్తాయిలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మోసంబి జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. మెటిమల సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

జ్యూస్ ఎప్పుడు, ఎలా తాగాలి?


బత్తాయి జ్యూసుని బయట తాగడం మానేయండి. బత్తాయి జ్యూసుని ఇంట్లోని తయారు చేసుకుని తాగండి. ఫ్రెష్‌గా చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పంచదార బదులు బత్తాయి జ్యూసులో తేనె కలిపి తాగితే మంచిది. ఇది కేవలం రుచి కోసం మాత్రమే. డైరెక్ట్‌గా తాగితే మంచిదంటున్నారు నిపుణులు. ఇక, బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట లేదా గంట తర్వాత బత్తాయి జ్యూస్ తాగితే బెస్ట్. అయితే, ఎసిడిటీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు వైద్యుణ్ని సంప్రదించి తర్వాత బత్తాయి జ్యూస్ తాగండి.

గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

బరువు తగ్గేందుకు రుచిగా తింటూ హెల్దీగా బరువు తగ్గించే ఫుడ్స్, రోజూ తింటే తేడా మీకే తెలుస్తుంది

శరీరా బరువు తగ్గడమనేది కాస్తా కష్టమైన పనే . రుచిలేని ఫుడ్స్ తీసుకుంటారు. దీంతో చాలా మంది మొదట్లో ఇష్టంగా తిన్నా.. రాను రాను  బోర్ కొడుతుంది. అందుకే, దీనిని కంటిన్యూ చేయలేరు. కొంతమంది బరువు తగ్గేందుకు ఎలా అయినా తింటుంటారు. కానీ, మరికొంతమంది తినడానికి ఇష్టపడరు. అందు కోసమే, కాస్తా రుచిగా  ఉండే ఫుడ్స్‌ని ఎంచుకుంటే ఈ వెయిట్‌ లాస్ జర్నీని మనం మనం కంటిన్యూ చేయగలం.

అలాంటి ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని మనం రెగ్యులర్‌గా తింటే బోరింగ్ ఉండదు. అయితే, తినేటప్పడు పోర్షన్ కంట్రోల్ అనేది ముఖ్యమని తెలుసుకోండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫుడ్స్‌ని ఒకేసారి మొత్తంగా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి. దీంతో ఆకలి వేయదు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. వెయిట్ లాస్ జర్నీ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

కాటేజ్ చీజ్

ఇది కూడా చాలా టేస్టీగా ఉండే ఫుడ్. దీనిని మీరు ఏ ఫుడ్స్‌తో కలిపి అయినా తీసుకోవచ్చు. దీనిని మసాలా కూరల్లో, లేదా మసాలాలు యాడ్ చేసి ఫ్రై చేసి తినొచ్చు. దీని వల్ల పోషకాలు పెరుగుతాయి. పైగా ఆహారం రుచిగా ఉంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. ఇందులో కేలరీలు కాస్తా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తక్కువ మోతాదులో తినండి.

హోల్ గ్రెయిన్ బ్రెడ్

ఈ బ్రెడ్ తింటే బరువు తగ్గుతారని చెబుతారు. కానీ, దీనిని హెల్దీ వేలో చేసుకుని తినాలి. ముఖ్యంగా, హోల్‌గ్రెయిన్స్‌తో చేసి తీసుకోండి. దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో, ఈవెనింగ్ స్నాక్‌లా తినొచ్చు. దీంతో త్వరగా కడుపు నిండుతుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది టేస్టీగా కూడా ఉంటుంది.

చీజ్

చీజ్ అది కూడా ఫుల్ ఫ్యాట్ చీజ్ తినడం అలవాటు చేసుకోండి. ఇందులో పోషకాలు ఉంటాయి. దీనికోసం మీరు తీసుకునే ఫుడ్స్‌పై చీజ్ వేయండి. దీనిని తురుములా చేసి తినొచ్చు. ఏదైనా ఫ్రై, చికెన్ వంటివి తిన్నప్పుడు దానిపై చీజ్ ముక్కల్ని వేసి తినండి. దీని వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.

పాప్‌కార్న్

చాలా మంది ఇష్టంగా తినే స్నాక్స్‌లో పాప్‌కార్న్ ఒకటి. ఈ స్నాక్ హెల్దీ. అయితే, మితంగానే తీసుకోవాలి. నేరుగా పాప్‌కార్న్ కాకుండా ప్రోటీన్స్‌తో కలిపి తినండి. దీంతో కడుపు నిండుతుంది. దీనిని ఎంజాయ్ కూడా చేస్తారు. కాబట్టి, రెగ్యులర్‌గా తినండి.


పెరుగు

పెరుగు చాలా హెల్దీ. కానీ, నేడు మార్కెట్లో దొరికే పెరుగులో ఎన్నో పదార్థాలను కలుపుతున్నారు. వీటి వల్ల బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు. కాబట్టి, ఇందులో పంచదార లేకుండా కేవలం నేచురల్ పెరుగుని తినండి. ఇందులో గ్రనోలా, నట్స్, సీడ్స్, బెర్రీస్ కలపండి. మరింత టేస్టీగా ఉంటుంది. హెల్దీగా కూడా మారుతుంది.

గమనిక :ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రోజుకి 10 నిమిషాల నుంచి అరగంటలోపు ఎంత వీలైత అంతగా వర్కౌట్స్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా జిమ్‌కి వెళ్లి ఫిట్‌గా మారిన బాడీని పొందొచ్చు. అలాంటి రిజల్ట్స్‌ని ఇచ్చే వర్కౌట్స్ గురించి తెలుసుకోండి.

 వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. దీనికోసం ఇంట్లోనే వర్కౌట్స్ చేయొచ్చు. ఇలా ఇంట్లో చేసే ఎక్సర్‌సైజెస్‌కి ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఇతర కష్టాలు అవసరం లేకుండానే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. రోజుకి 15 నిమిషాల నుంచి అరగంటలోపు ఎంత వీలైత అంతగా వర్కౌట్స్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా జిమ్‌కి వెళ్లి fitt గా మారిన body  పొందొచ్చు. అలాంటి రిజల్ట్స్‌ని ఇచ్చే వర్కౌట్స్ గురించి తెలుసుకోండి.

లంజెస్


లంజెస్ కూడా కాళ్లు, పిరుదులకి మంచి ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల స్టేబిలిటీ పెరుగుతుంది. దీనిని ఎలా చేయాలంటే ముందుగా నిల్చోవాలి. ఓ కాలిని ముందు పెట్టాలి. తర్వాత కిందకి వంగాలి. మరో కాలుతో ఇలానే రిపీట్ చేయండి. ఇలా వీలైనన్నీ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

మౌంటెయిన్ క్లైంబింగ్

మౌంటెయిన్ క్లైంబింగ్ కూడా మంచి కోర్ ఎంగేజ్ చేసే ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల కేలరీలు త్వరగా burn అవుతాయి. దీనికోసం ప్లాంక్ పొజిషన్‌లో ఉండాలి. తర్వాత ఒక్కో కాలుని ముందుకు తీసుకురావాలి. ఓ రకంగా పరుగెత్తినట్లుగా ఉండాలి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ work out చేయాలి.

బాడీవెయిట్ స్క్వాట్స్

ఈ స్క్వాట్స్ కూడా బాడీని టోన్ చేసే బెస్ట్ వర్కౌట్. దీనిని చేయడం వల్ల తొడలు, బ్యాక్ పార్ట్స్ టోన్ అవుతాయి. ఇవి మజిల్స్‌ని బలంగా చేసి కేలరీలని బర్న్ చేస్తాయి. దీనికోసం కాళ్లని దూరంగా పెట్టి నిలబడాలి. తర్వాత మోకాళ్లని వంచి లోయర్ బాడీని కిందికి వంచుతూ కూర్చున్నట్లుగా వంగి పైకి లేవాలి. ఇది 15 నుంచి 25 times చేయాలి. ఏదైనా బరువు ఉంచి చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

ప్లాంక్స్


ప్లాంక్స్ కూడా లో ఇంపాక్ట్ వర్కౌట్. ఈ ప్లాంక్స్ చేయడం వల్ల కోర్ స్ట్రెంథ్ పెరుగుతుంది. దీని వల్ల పోశ్చర్, body balancing పెరుగుతుంది. దీనికోసం మనం బోర్లా పడుకోవాలి. ఇప్పుడు పాదాలు, మోచేతుల్ని నేలపై ఉంచి వాటి బ్యాలెన్స్‌తో body ని పైకి లేపాలి. ఇదే పొజిషన్‌లో ఉండగలిగేంత సేపు ఉండాలి. మొదట్లో 20, 50 సెకన్లు సరిపోతాయి.

హై నీ మార్చెస్

ఇది కూడా పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. lower body, కోర్ బలం పెరుగుతుంది. దీనిని ఎలా చేయాలంటే ముందుగా నిల్చోవాలి. కాళ్లని దూరంగా పెట్టాలి. ఒక్కొక్కటిగా మార్చింగ్ పొజిషన్‌లో పైకి లేవాలి. ఈ work out  మీ fitness ప్రకారం speed ని పెంచుకోవాలి.

2.13.2025

ప్రేమను వ్యక్తపర్చడానికే కాదు గులాబీ పువ్వులతో బరువు కూడా తగ్గవచ్చు, అయితే తీసుకునే విధానం ఏంటో తెలుసా?

 గులాబీ పువ్వుల్లో Vitamin A, Vitamin C, Vitamin E, Iron, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. గులాబీ పువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, weight loss, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాలు, 

ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రేమను వ్యక్తపర్చడానికే కాదు గులాబీ పువ్వులతో బరువు కూడా తగ్గవచ్చు, అయితే తీసుకునే విధానం ఏంటో తెలుసా?
 గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. గులాబీ పువ్వు ప్రేమ, అందానికి మాత్రమే చిహ్నం కాదు. ఇందులో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. గులాబీ పువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

బరువు తగ్గడం

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బరువు తగ్గడంలో గులాబీ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే. బరువు తగ్గడం కోసం 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ నీటిని తాగాలి. ఇలా ఒక నెల రోజుల పాటు గులాబీ నీరు తాగడం వల్ల మీరు తేడాను గమనిస్తారు.

మొటిమలకు చెక్

​మొటిమల సమస్యను తొలగించడంలో గులాబీ పువ్వు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇందుకోసం కొన్ని మెంతుల్ని వేయించండి. ఆ తర్వాత రోజ్ వాటర్ సాయంతో పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 Mints అలాగే ఉంచండి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని వాటర్‌తో కడుక్కోండి. వారానికి కనీసం 2 Times అయినా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.


జీర్ణక్రియ మెరుగు

గులాబీ రేకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది. జీర్ణసమస్యలు ఉన్నవారి ఇది బెస్ట్ ఆప్షన్. గులాబీ రేకులు తినడం వల్ల పేగుల కదలికలు వేగవంతం అవుతాయి. పేగులు ఉత్తేజపడి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం గులాబీ రేకుల్ని శుభ్రపరిచి నేరుగా తినవచ్చు. లేదంటే 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది.

మానసిక స్థితి మెరుగవుతుంది

గులాబీ పువ్వుల్లో మానసిక స్థితిని, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ కారణంగా ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి గులాబీ పువ్వులు బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం గులాబీ రేకుల్ని ఓ 15 తీసుకోండి. ఆ తర్వాత వీటిని గులాబీ రేకుల్ని నీటిలో బాగా మరగించండి. ఆ తర్వాత గులాబీ రేకుల నీటి ఆవిరిని పీల్చడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

రోజు సొరకాయ జ్యూస్ తాగితే నెలలో 10 నుండి 20 కిలోల బరువు తగ్గుతారా? అసలు డాక్టర్ నిజం చెప్పారు.ప్రస్తుత పరిస్తుతుల్లో బరువు తగ్గడానికి చాల వరకు ప్రయత్నాలు చూస్తూనేవుంటాం

ప్రస్తుత పరిస్తుతుల్లో బరువు తగ్గడానికి చాల వరకు ప్రయత్నాలు చూస్తూనేవుంటాం. చాలా మంది ఆహారం లో మార్పులు చేసుకుంటే. కొంత మంది జీమ్ లకు వెళుతూ ఉంటారు. మరికొంతమంది సోషల్ మీడియా లో ఉండే ఉండే చిట్కాలు చూసి ఫాలో అవుతుంటారు. వీటిని ఫాలో అయితే wait తగ్గడం ప్రక్కన పెడితే helath కి డేంజర్. అయితే social media  లో సొరకాయ juice త్రాగటం వల్ల నిజంగానే fast wait తగ్గుతారా? అయితే ఇందులో నిజమెంత?


రోజు చాలా మంది బరువు,ఊబకాయం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఒక person  food habits కారణంగా heavy wait, adhika fat problems తో చాల బాధపడుతున్నారు. 

అయితే,wait  loss కి చాల మంది ఎనో ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ  కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే. మరీ కొంత మంది జిమ్మ్ చుట్టూ తిరుగుతున్నారు. చాల మంది social medial లో కొన్ని చిట్కాలు fallow అవుతున్నారు. ప్రతి వాటిని గుడ్డిగా fallow అయితే wait loss ప్రక్కనపెడితె helth కి చాల వరకు danger కలుగుతుంది. 

అలాంటి ఒక videos సొరకాయ juice త్రాగితే wait loss  అవ్వటం సులభం అని ఉంది. 

wait loss తగ్గాలి అనుకునేవారికి కచ్చితంగా ఈ video attractive. but tips follow అవుతారు. But సొరకాయ juice త్రాగటం వల్ల నిజంగానే వేగంగా wait loss? ఇందులో నిజమెంత?

అసలు doctor ఏం చెప్పారు అంటే complet details  ఇక్కడ తెలుసుకుందాం. 


  


youtube videos just సొరకాయ juice త్రాగడం ద్వారా wait loss తగ్గవచ్చని చెప్తున్నారు. ఇందులో సొరకాయ లోపల గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత కొంచెం water lo blender or mixer juice లా చేసుకోవాలి అని ఉంది. తర్వాత ఈ juice ను every day two times  or  three times తీసుకుంటే బరువు తగ్గవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా thumb nail లో జ్యూస్ త్రాగడం వల్ల నెలలో 10 to 15 Kgs  తగ్గవచ్చని ఉంది. అందుకే ఇందులో నిజానిజాలు  facts check బృందం doctors సంప్రదించారు. Doctors ఏం చెప్పారో తెలుసుకుందాం. 


డాక్టర్ ఏం చెప్పారంటే. 


ఈ వీడియోలో నిజం తెలుసుకోవడానికి మా Fact Check Team  Pujja Sha Bhave (CDE, MSc CND, BSc FSN)), కన్సల్టెంట్ డైటీషియన్, సర్టిఫైట్ Diabetes  ఎడ్యుకేటర్ అండ్ ఫ్యాకల్టీ, Life  సైన్సెస్ Institute సంప్రదించడం జరిగింది. డాక్టర్ ప్రకారం వ్యాయామం, కొన్ని Life Style Changes  పాటించకుండా కేవలం సొరకాయ జ్యూస్ త్రాగడం ద్వారా నెలలో 10 To 20 కిలోల బరువు తగ్గడం అసాధ్యం.


సొరకాయ లక్షణాలు
సొరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. సొరకాయను కూరగా చేసుకుని తినవచ్చు. లేదంటే పెరుగు, Raita తో కలిపి తినవచ్చు. Low BP ని సమతుల్యం చేయడంలో సొరకాయ ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ తెలిపారు. సొరకాయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. సొరకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. అంతేకానీ ఒక నెలలో 10 TO 20 కిలోల బరువు తగ్గడం అసాధ్యమని Doctors తెలిపారు.


తక్కువ సమయంలో ఎక్కువ బరువు డేంజర్
ఏదైనా వ్యాధి లేదా ఆకలి లేకపోవడం సమస్య వల్ల ఒక వ్యక్తి నెలలో 10 To 20 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉందని డైటీషియన్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అంత త్వరగా బరువు తగ్గడం ఆరోగ్యగానికి హానికరమని తెలిపారు. నెలకు 4 నుంచి 8 కిలలో బరువు తగ్గడం సురక్షితమని డాక్టర్ అభిప్రాయపడ్డారు. అంతేకానీ ఒకేసారి ఎక్కువ బరువు తగ్గడం వల్ల శరీరంలో అనేక పోషకాల లోపం ఏర్పడుతుంది. బరువు ఎంత వేగంగా తగ్గితే అంత వేగంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని డైటీషియన్ తెలిపారు.

చివరికి ఏం తేలిందంటే : మా సజాగ్ Fact Team దర్యాప్తులో, Youtube Videos లో ఉన్న సమాచారం అపోహ మాత్రమేనని తేలింది. సొరకాయ జ్యూస్ త్రాగడం వల్ల నెలలో 10 To 20 Kgs  Wait Loss  అసాధ్యమని Doctor తెలిపారు. ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.