Showing posts with label Uragaya Pickles. Show all posts
Showing posts with label Uragaya Pickles. Show all posts

2.16.2025

Menthi Avakaya Pickle Recipie

మెంతి ఆవకాయ



కావలసినవి: మామిడికాయలు 25, కారం % కేజి, ఉప్పు 1 కేజీ, మెంతులు 3% కేజీ, ఆవాలు 350 గ్రా, నూనె కేజి, యింగువ అరతులం, పసుపు 4 స్పూన్సు.

తయారుచేయు విధానం:

1 మామిడికాయలు తుడిచి, ఆరిన తరువాత టెంకలతో అవకాయ ముక్కలుగా తరగాలి.

2. ముక్కలలో ఉప్పు, పసుపువేసి జాడీలో పోసి మూతపెట్టాలి.

3. మూడోరోజు ఊట వస్తుంది. ముక్కలు పిండి ఎండలో వుంచాలి.

4. మెంతులు బాండీలో వేయించి, పొడుం కొట్టాలి. ఆవాలు దంచి, జల్లించుకోవాలి.

5. కారం, మెంతిపిండి, ఆవపిండి కలిపి ఊటలోనే కలపాలి. ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.

6. బాండీలో నూనె వేసి కాగిన తరువాత, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు వేసి వేగిన తరువాత యింగువ పొడి కలపాలి.

7. చల్లారిన పోపు ముక్కలలో వేసి కలిపి, జాడీలోవేసి, వాసిని కట్టాలి. మెంతులు ఎక్కువగా వేయటంతో, వేడి చేయదు. కారం వుండదు. సంవత్సరంపాటు నిల్వ వుంటుంది.

Usiri Avakaya Pickle Recipie Articel Show

ఉసిరి ఆవకాయ


కావలసినవి:

ఉసిరి కాయలు 1 శేరు, ఆవపిండి 1 పాలడబ్బా, కారం 1 పాలడబ్బా, ఉప్పు 1 పాలడబ్బా, చింతపండు 14 కేజి, పసుపు 50 గ్రా, నూనె 1/2 కేజి

తయారుచేయు విధానం:

1. ఉసిరికాయలు డాగులు లేనివి తీసుకొని, బాండీలో 100 గ్రా. నూనె పోసి ఎర్రగా వేయించుకోవాలి.

2. ఆవాలు ఎండబెట్టి, దంచి, జల్లించుకోవాలి.

3. ఉప్పు కూడా ఎండబెట్టి, దంచి జల్లించుకోవాలి.

4. ఆవపిండి, కారం, ఉప్పు, కాయలు వేయించి మెంతులు పొడికొట్టిన పిండి, కలిపి నూనెపోసి వుంచాలి.

5. చింతపండు నానబెట్టి, పులుసుతీసి, మరిగించి, ఉడికిన తరువాత బాగా చల్లార్చి, ఉసిరికాయలలో వేసి కలపాలి.

6. జాడీలో మూతపెడితే 4, 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. కాని కొంచెం నల్లబడుతుంది.

Thonu Avakaya Pickle Recipie Articel Show

తొణు ఆవకాయ


కావలసినవి:

మామిడికాయలు చిన్నవి 6, ఆవాలు 125 గ్రా, ఉప్పు 125 గ్రా, కారం 125 గ్రా. నూనె 125 గ్రా, పసుపు 1 స్పూను.

తయారుచేయు విధానం:

1. మామిడికాయలు చెక్కు తీయకుండా సన్నగా తరిగి వుంచుకోవాలి.

2. ఆవాలు బాగుచేసి, కాసిని నీళ్ళుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు మెత్తగా దంచి జల్లించాలి.

3. ఉప్పు, కారం రుబ్బిన ఆవపిండి, మామిడిముక్కలు మూడు కలిపి జాడీలో వేసి నూనె ఆ ముక్కలుమీద పోసి, కలిపి మూత పెట్టాలి.

4. ఆవాలు రుబ్బి పెట్టడంచేత ఆవకాయ చాలా ఘాటుగా వుండి 20 రోజులు నిల్వ ఉంటుంది.

Dosa Avakaya Pickle Recipie Articel Show


దోస ఆవకాయ



కావలసినవి:

దోసకాయలు 1 కేజి, మిరపకాయలు 125 గ్రా. ఆవాలు 125 . 3 125

తయారుచేయు విధానం:

1. మిరపకాయలు, ఆవాలు రెండూ విడిగా ఎండపెట్టి, మెత్తగా పొడుం కొట్టి జల్లించుకోవాలి.

2. రెండు కలపగా వచ్చినంత ఉప్పును ఎండబెట్టి, దంచి మెత్తగా జల్లించి వుంచుకోవాలి.

3. కారం, ఆవపిండి, ఉప్పు టీ స్పూను పసుపు కలిపి వుంచుకోవాలి.

4. దోసకాయలు శుభ్రంగా నీటిలో కడిగి, తుడిచి, చేదులేకుండా చూసి సన్నగా ముక్కలు తరగాలి.

5. కారం, ఆవపిండి, ఉప్పు, పసుపు, కలిపి నూనెపోసి, అందులో దోసబద్దలు వేసి బాగా కలిపి జాడీలో పెట్టాలి.

6. దోసావకాయ ఘాటుగా వుండి, చాలా రుచిగా వుంటుంది.

Tomato Avakaya Pickle Recipie Articel Show


టొమాటో ఆవకాయ



కావలసినవి:

టొమాటోలు 1 కేజి, ఆవాలు 125 గ్రా, మిరపకాయలు 125 . 3 125

తయారుచేయు విధానం:

1. మిరపకాయలు, ఆవాలు విడిగా బాగా ఎండబెట్టి, రెండూ విడిగా పొడికొట్టి, జల్లించి వుంచుకోవాలి.

2. రెండు జల్లించి కలపగా వచ్చినంత కొలత గల ఉప్పును ఎండబెట్టి దంచుకోవాలి.

3. కారం, ఉప్పు, ఆవపిండి, టీస్పూను పసుపు నాలుగూ జాడీలో వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి.

4. టొమాటాలు బాగా కడిగి, తడిలేకుండా, తుడిచి సన్నగా తరుక్కోవాలి.

5. జాడీలో వున్న పిండిలో నూనెపోసి, నూనె, పిండి బాగా కలిపి, పైన ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి.

6. ఈ టొమాటో ఊరగాయ 2, 3 నెలలకంటే ఎక్కువ వుండదు.

Nuvvula Avakaya Pickle Recipie Articel Show


నువ్వుపిండి ఆవకాయ



కావలసినవి:

మామిడికాయలు 12, కారం 12 కేజి, మొత్తటి ఉప్పు 1/2 కేజి, నూనె 3/4 కేజీ, నువ్వుపిండి 1/2 కేజి.

తయారుచేయు విధానం:

1. నువ్వు పప్పు తడిపి, గోనెపట్టా మీద వ్రాస్తే, పొట్టు పోయి తెల్లగా వస్తాయి. మూకుడులో కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించి, మెత్తగా పొడుం కొట్టి అరకిలో తీసుకోవాలి.

2. మామిడికాయ చెక్కుతోనే సన్నగా ముక్కలు తరిగి, కారం, నువ్వుపిండి, ఉప్పు, నూనె వేసి కలిపి తడిపొడిగా చేయాలి.

3. ముక్కలు పిండి జాడీలో పెట్టి, పైనకాచి చల్లార్చిన నూనెపోసి, కలియబెట్టి మూత పెట్టాలి.

4. నువ్వుపిండి ఉపయోగించటం వలన ఆవకాయ కమ్మటి వాసనవస్తూ వుంటుంది.

Pesara Avakaya Pickle Recipie Articel Show


పెసర ఆవకాయ




కావలసినవి:

మామిడికాయలు 12, కారం 1/2 కేజి, మొత్తటి ఉప్పు ½ కేజి, పెసరపిండి 2 కేజి, నూనె 3/4 కేజి.

తయారుచేయు విధానం:

1. మామిడికాయలు చెక్కుతో పప్పులోకి మాదిరిగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి.

2. చాయ పెసరపప్పు మెత్తగా విసురుకొని, జల్లించి పిండి సిద్ధం చేసుకోవాలి.

3. ఉప్పు, కారం, పెసరపిండి మూడు గుచ్చెత్తి, కొంచెం నూనెపోసి పొడిపొడిగా కలపాలి.

4. పిండిలో మామిడికాయ ముక్కలు కలిపి, జాడీలో పెట్టి, పైన కాచి చల్లార్చిన నూనెపోసి మూతపెట్టాలి.

5. పెసరపిండి వేయటం వలన ఆవకాయ మరీ పుల్లగా కాకుండా, కమ్మగా ఉంటుంది.

Pulihora Avakaya Recipie Articel Show

Pulihora Avakaya Recipie



కావలసినవి: మామిడికాయలు 12 పెద్దవి. నూనె 3% కేజీ, కారం 12 కేజి. మెత్తని ఉప్పు 1/2 కేజి, ఆవపిండి 2 కేజి మిరపకాయలు 15, శెనగపప్పు 14 కేజి, ఆవాలు 12 కప్పు, మెంతులు 1 స్పూను, కరివేపాకు 2 రెబ్బలు.

తయారుచేయు విధానం:

1. మామిడికాయల చెక్కుతీసి, పప్పులోకి తరిగినట్లు సన్నగా తరుక్కోవాలి.

2. మధ్యాహ్నం ఆవకాయ కలుపుతామనగా, ఉదయమే అరలీటరు నీళ్లు కాగబెట్టి చల్లారిన తరువాత ఆవపిండి కలిపి వూరపెట్టాలి.

3. ఆవకాయ కలిపేటప్పుడు, ఉప్పు, కారం, వూరిన ఆవపిండి మూడూ బాగా కలిపి అందులో ముక్కలు కూడా వేసి గుచ్చెత్తి జాడీలో పోసి పెట్టాలి.

4. రెండురోజులు ఊరిన తరువాత మూడోరోజు, ముక్కలు తీసి ఎండలో ఎండబెట్టాలి.

5. నాలుగోరోజు మూకుడులో నూనెపోసి, మిరపకాయలు, శనగపప్పు, మెంతులు, ఆవాలు వేసి వేగిన తరువాత, కరివేపాకు వేసి, పోపుని జాడీలో ఆవకాయలో పెట్టి మూత పెట్టాలి.

6. కాసేపు తరువాత మూత తీసి ఒకసారి కలియబెట్టాలి.

7. పులిహోర పోపుతో సువాసన వేస్తూ, అవకాయ చాలా రుచిగా వుంటుంది.

Gutthiti Avakaya Pickle Recipie Articel Show

గుత్తి ఆవకాయ



కావలసినవి:

మామూలు ఆవకాయకు కావలసిన విధంగా అన్నీ సిద్ధంచేసుకోవాలి.

తయారుచేయు విధానం:

1. మామూలు ఆవకాయ తయారు చేసుకొన్నట్లే అన్నీ తయారు చేసి వుంచుకోవాలి.

2. మామిడికాయలు మాత్రం ముక్కలు తరగకుండా ఒకవైపు గుత్తిగా వుంచి, పొడుగ్గా 4 ముక్కలుగా తరగాలి.

3. జీడిని తీసేసి, కాయలో పిండి కూరాలి.

4. జాడీలో ఈ కాయలు వేసి, పైన నూనె పోసి మూతపెట్టాలి.

5. మామూలు ఆవకాయకి వలెనే రుచిగా వుంటుంది. కాకపోతే ముక్కలు కాకుండా కాయలుగా వుంటుంది.

6. గుత్తి ఆవకాయకి కాయలు చిన్నవిగా, గుండ్రంగా వుంటే చూడటానికి బావుంటుంది.

Bellam Avakaya Pickle Recipie Articel Show

బెల్లం ఆవకాయ



కావలసినవి:

మామిడికాయలు 25, మెత్తటి ఉప్పు 1 కేజీ, కారం1 కేజి. ఆవపిండి 3/4 కేజీ, బెల్లం 1/2 కేజి. నూనె 1 కేజీ, మెంతులు 1 కప్పు.

తయారుచేయు విధానం:

1. తెల్లబెల్లం శుభ్రం చేసి, సన్నగా తరిగి వుంచుకోవాలి.

2. ఉప్పు, కారం, మెంతులు బాగా కలపాలి.

3. ఈ ఆవకాయకి ముక్కలు కోయకుండా, మామిడి కాయలను పొడుగ్గా నాలుగు ముక్కలు చేసి, గుత్తిలో ఒక వైపు వుంచాలి.

4. మామిడికాయలో జీడి తీసేసి, ఒకవైపు నుండి కారం తీయాలి.

5. ఉప్పు, కారం, మెంతులు, బెల్లంతో నూనె కూడా వేసి బాగా కలిపి, మామిడికాయలో బోలుగా కూరుకోవాలి.

6. జాడీలో అడుగున నూనెపోసి, పైన కాయలుపెట్టి, కొంచెం నూనెపోసి మూత పెట్టాలి.

7. మూడు రోజుల తరువాత, ఊరిన మామిడికాయలు, విడిగా పళ్ళెంలో పెట్టి, ఊట చేరే జాడీలోకి ఓడాలి.

8. కాయలను మంచి ఎండలో వరుగుల్లా 7 రోజులు ఎండబెట్టాలి.

9. 8వ రోజున ఒక్కొక్క కాయ ఊటలో ముంచి అన్ని కాయలు జాడీలో పెట్టాలి.

10. ఆవపిండి కలపగా మిగిలిన నూనె కాచి, బాగా చల్లార్చి ముక్కలపై పోసి వుంచాలి.

Allam Avakaya Recipie articel show

అల్లపు ఆవకాయ




50 మామిడికాయల ఆవకాయకి -అర కిలో అల్లం

తయారుచేయు విధానం:

1. ఆవకాయలో మెంతులు, శనగలు కలిపేటప్పుడు అల్లం సన్నముక్కలుగా తరిగి కలపాలి.

2. మిగతా అంతా మామూలు అవకాయలాగానే కలిపి నివ్వ వుంచుతారు.

3. ఆవకాయ ముక్కలతోపాటు అల్లంకూడా వూరి పుల్లగా రుచిగా వుంటుంది.

Vullulli Avakaya Pickle Recipies articles show

వెల్లుల్లి ఆవకాయ




50 మామిడికాయల ఆవకాయకు-ముప్పావు కిలో వెల్లుల్లి

తయారుచేయు విధానం:

1. ఆవకాయను మామూలుగా ముందు చెప్పిన విధంగానే తయారుచేసి, మెంతులు, శనగలు, కలిపినప్పుడే వెల్లుల్లిపాయలు పొట్టు వలిచి కలపాలి.

2. మిగతా తయారీ అంతా మామూలు అవకాయలాగానే వుంటుంది.

Kabeji Avakaya pachadi Recipie articel show

కాబేజీ ఆవకాయ




కావలసినవి:

కాబేజీ 1 కేజి, ఉప్పు 1/4 కేజి, నూనె 1/4 కేజీ, మెంతులు 4 చెంచాలు, కారం 14 కేజీ, ఆవాలు 100 గ్రా, నిమ్మకాయలు 10

తయారుచేయు విధానం:

1. కాబేజిని కడిగి, బాగా ఆరిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

2. ముక్కలు జాడీలో వేసి ఉప్పు కలపాలి.

3. మూడురోజుల తరువాత జాడీలో ముక్కలు తీసి, కారం నిమ్మరసం కలపాలి, ఆవాలు, మెంతులు పొడిచేసి ఇందులో కలపాలి.

4. ఈ మిశ్రమంలో నూనె కూడా కలుపుకోవాలి.

5. కావలసినప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని, తాళింపు పెట్టితే చాలా రుచిగా ఉంటుంది.

Cauli Flower Mango: Pickle Recipie article show




కావలసినవి:

కాలీఫ్లవర్స్ 2, ఉప్పు 1 కప్పు, నూనె 1 కేజీ, మెంతులు 4 స్పూన్సు, కారం 2 కప్పులు, ఆవాలు 25 గ్రా., వెల్లుల్లి 3 పాయలు, పసుపు 1/2 స్పూను, నిమ్మకాయలు 2, కరివేపాకు 2 .

తయారుచేయు విధానం:

1. కాలీఫ్లవర్స్ చిన్న ముక్కలుగా శుభ్రంగా చేసుకోవాలి.

2. ఆవాలను పొడిగా దంచుకోవాలి.

3. మెంతులు వేయించి పొడిచేసుకోవాలి.

4. ఆవపొడి, మెంతులపొడి, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పాయలు తరిగి కాలీఫ్లవర్ ముక్కలకు పట్టించాలి.

5. నిమ్మకాయల రసాన్ని గింజలు లేకుండా గిన్నెలలోకి వడపోసి వుంచాలి.

6. పోపు వేయించి, నిమ్మకాయ రసంతోపాటు ముక్కలకు కలిపి వుంచాలి.

7. కాలీఫ్లవర్ ఆవకాయ పుల్లగా, రుచిగా ఉంటుంది.

Mango Pickle: Avakaya Pachadi Article show

ఆవకాయ


























మామిడికాయలు 50, కారం 2 కేజీలు, ఆవపిండి 214 కేజీలు, మెంతులు 1/4 కేజీ, శనగలు 1 కప్పు, పప్పునూనె 21/2 కేజీ, మెత్తని ఉప్పు 21/4 కేజి.

తయారుచేయు విధానము:

1. మిరపకాయలు ఎర్రటివి ఏరితెచ్చి, ముచ్చికలు తీసి ఎండబెట్టి, పొడికొట్టి మెత్తగా కారం జల్లించుకోవాలి.

2. సన్న ఆవాలు ఎండబెట్టి తిరగలిలో విసిరి ఆవపిండి తయారు చేసుకోవాలి.

3. ఆవపిండి విసిరేటప్పుడు, పసుపుకొమ్ము వేసి విసిరితే యింక పసుపు ఆవకాయలో వేయనవసరం లేదు.

4. బరక ఉప్పు ఎండలో పెట్టి, దంచి జల్లించుకోవాలి.

5. మామిడికాయలు 10 గంటలపాటు నీళ్లలో వుంచితే, తరిగే సమయానికి ముక్క కరుకుగా వస్తుంది.

6. ముక్కలు కొట్టి వుంచుకొన్న తరువాత, పప్పు నూనెను కొద్దిగా వేడి చేయాలి.

7. నూనె బాగా చల్లారిన తరువాతే ఉపయోగించాలి.

8. కారం, ఆవపిండి, ఉప్పు, శనగలు, మెంతులు యివి ఒక పళ్ళెంలో పోసి బాగా కలిపి వుంచుకోవాలి.

9. శుభ్రంగా, పొడిగా ఉన్న జాడీలో కొంచెం నూనె వేయాలి.

10. ఆవపిండి, కారం, ఉప్పు, మెంతులు, శనగలు కొంచెం నూనె పోసి పొడి పొడిగా వుండేటట్లు కలపాలి.

11. జాడీలో నూనె పైన ఈ పొడి ఆవపిండి కొంచెం వేయాలి.

12. పళ్ళెంలో ముక్కలుపోసి బాగా పిండితో కలిపి, జాడీలో ఒత్తుతూ సర్దాలి. పైన కొంచెం ఆవకాయ పిండి, నూనె పోసి మూతపెట్టాలి.

13. మొత్తం ఉపయోగించే రెండుకిలోల నూనెలో మొదటిరోజు కిలో నూనె వాడితే చాలు.

14. మూడోరోజుకు జాడీలోని ముక్కలు ఊరి వుంటాయి. ఆవకాయ శుభ్రంగా, పై నుంచి క్రిందకి తిరగ కలిపి, మిగతా నూనె పోసి మూతపెట్టాలి.

ఆంధ్రులకు ఎంతో ప్రీతికరమైన ఊరగాయ యిది.