- Movie: Kaadhal Kurise
Song: Kaadhal Kurise
కాదల్ కురిసే కాదల్ కురిసే
కాదల్ కురిసే
ఏదేదో జరిగిందే మరి నాలో
మనసంతా ఎగిరిందే మేఘాల్లో
మంచేదో మురిసిందే మరి మే లో
మైమేదో దాగుందే చెలి నీలో
నువ్వు తప్ప ఇంకో లోకం లేనే లేనంతలా
నన్నిలాగ కమ్మేస్తుంటే నువ్వింతలా
ఊపిరాగి పోతున్నట్టు ఉందే ఇలా
నీ వైపే చూస్తుంటే
చూస్తూనే ఉండిపోనా
నీ వెంటే వస్తుంటే
నా దారే మరిచిపోనా
నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే కాదల్ కురిసే
ఆకాశం అంచున మీద
కూర్చుందీ మనసే
నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే కాదల్ కురిసే
నీ ఊహల నగరంలోకి
వచ్చానే వరసే
ఒక్క చిన్న మాటైనా
చెప్పలేకపోతున్న
మెహబూబా మెహబూబా
ఒక్క చిన్న మాటైనా
చెప్పలేకపోతున్న
మెహబూబా మెహబూబా
చెప్పకుండ నాలోనా
దాచలేకపోతున్నా
దిల్ రూబా దిల్ రూబా
నా చుట్టుపక్కలా
ఎన్ని వింతలు కనిపించినా
నా చూపు ఎప్పుడు
నిన్ను దాటి పోదంటూ ఉన్నా
నువ్ పడేసెళ్ళిపోతే
ప్రేమలోనా
ఎలా ఉండగలనే
నిన్ను వీడి నేనే
నీ వైపే చూస్తుంటే
చూస్తూనే ఉండిపోనా
నీ వెంటే వస్తుంటే
నా దారే మరిచిపోనా
ఏదేదో జరిగిందే నిమిషంలో
నా ప్రాణం మునిగింది తమకంలో
నీ గురించే ఆలోచిస్తూ
ఉందే నా ఊపిరి
నిన్న మొన్న లేదే ఈ వైఖరి
దీని పేరే ప్రేమంటారా ఏమో మరి
నీ వైపే చూస్తుంటే
చూస్తూనే ఉండిపోనా
నా వెంటే నువ్వుంటే
లోకాన్నే మరిచిపోనా
నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే కాదల్ కురిసే
ఆకాశం అంచున మీద
కూర్చుందీ మనసే
నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే కాదల్ కురిసే
నీ ఊహల నగరంలోకి
వచ్చానే వరసే