వర్షాకాలం వచ్చేసింది. వాటితో పాటు మేము కూడా వస్తున్నాం అంటూ రోగాలు కూడా వచ్చేస్తుంటాయి. చలి..జ్వరం..జలుబు..ఇతరత్రా అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధ పడుతుంటారు. కొంతమంది వర్షంలో తడిస్తే వెంటనే ಜಲುಬು సమస్య వెంటాడుతుంటుంది. మలేరియా, టైఫాయిడ్, కలరా ఇలా మరెన్నో సీజనల్ వ్యాధులు వేధిస్తాయి.
మలేరియా : మురుగు లేదా నిల్వ ఉండే నీటిలో
ఏర్పడే ఆడ అనోఫెల్స్ దోమ ఏర్పడుతుంది. చలి..జ్వరం..కడుపులో నొప్పి..ఒళ్లు నొప్పులు..అతిగా చమట పట్టడం దీని లక్షణం.
దగ్గు : ఇది అంటు వ్యాధి అని చెప్పుకోవచ్చు. వర్షంలో ఎక్కువ సేపు తడిచినా ఏర్పడుతుంది. గొంతు దగ్గు నొప్పి..కండరాల నొప్పులు..ఆయాసం.. ముక్కు కారడం లక్షణాలు.
డయేరియా : కలుషిత ఆహారం..నీటిని
తీసుకోవడం వల్ల డయేరియా వ్యాధి వస్తుంది. ఆయాసం..తిమ్మిరులు.. వాంతులు.. నీరసం..అలసట ఉండడం దీని లక్షణం.