Showing posts with label liver. Show all posts
Showing posts with label liver. Show all posts

2.28.2025

Liver Health: మీ కాలేయం ఆరోగ్యంగా మారాలంటే నెల రోజుల పాటూ ఈ సూపర్ టిప్స్ పాటించండి

 Liver Health: మీ కాలేయం ఆరోగ్యంగా మారాలంటే నెల రోజుల పాటూ ఈ సూపర్ టిప్స్ పాటించండి


కాలేయం ఆరోగ్యంగా ఉంటే ఒక వ్యక్తి సంతోషంగా జీవించగలడు. గుండె, మెదడు, మూత్రపిండాల మాదిరిగానే కాలేయం కూడా శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని ఇతర అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి.

కాలేయం శరీరానికి శక్తి కేంద్రంగా చెప్పవచ్చు. కాలేయం సరిగా పనిచేయకపోతే శరీరం బలహీనపడుతుంది. 

కాలేయం శరీరాన్ని విషపదార్థాల నుండి శుభ్రపరిచే అవయవం. అయితే, తప్పుడు జీవనశైలి, అధిక జంక్ ఫుడ్, మద్యం సేవనం వల్ల కాలేయంలో విషపదార్థాలు చేరి, దాని పనితీరును క్రమంగా తగ్గిస్తాయి. కాబట్టి, సమయానికి కాలేయాన్ని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. దీన్నే డీటాక్సిఫికేషన్ అంటారు. కాలేయం డీటాక్స్ చేకోవడానికి ఉపయోగపడే టిప్స్ ఇక్కడ ఉన్నాయి.

అధికంగా నీరు త్రాగండి

కాలేయం డీటాక్స్ చేసుకోవడానికి నీరు ఉత్తమ మార్గం. ఇది కాలేయం డీటాక్స్ చేసుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. కాలేయంలోని విషపదార్థాలు బయటకు పోకపోతే అనేక సమస్యలు వస్తాయి. అధికంగా నీరు త్రాగడం వల్ల కాలేయం విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపేందుకు సహాయపడుతుంది. ఫిల్టర్ చేసిన నీటినే రోజులో ఎక్కువసార్లు తాగుతూ ఉండండి.

విషపూరిత ఆహారాలకు దూరంగా ఉండండి

ఫాస్ట్ ఫుడ్ చాలా మందికి ఇష్టం. ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మీరు తెలియకుండానే అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటారు, ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. కాలేయం శుభ్రపరచడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినడం ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలతో వండిన ఆహారాన్నే తినాలి. 

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు

మీ ఆహారంలో పొటాషియం సమృద్ధిగా ఉంటే, అది మీ కాలేయం శుభ్రపరచడంలో సహాయపడుతుంది. టమాటో సాస్, బీట్‌రూట్ ఆకులు, పాలకూర, బీన్స్, అరటిపండ్ల వంటి ఆహార పదార్థాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా అధిక పొటాషియం పొందవచ్చు. 

ప్రతిరోజూ వ్యాయామం చేయండి:

వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరం నుండి వెలువడే చెమట డీటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రారంభించండి. యోగా, పరుగు, జిమ్ వ్యాయామాలు ప్రభావవంతంగా ఉంటాయి. ప్రతిరోజూ అరగంట నుంచి గంట వరకు వ్యాయామానికి కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. 

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

2.26.2025

ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అసలు ఏ ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రెగ్నెంట్స్

pregnancy

​ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీట్‌రూట్ తినడం మంచిది. అయితే, ఎక్కువ మాత్రం తినకూడదు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహాతో ఎంత మోతాదులో తినొచ్చో తెలుసుకుని అంతే పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలొస్తాయి.

పిల్లలకి

child

మంచి కూరగాయలు అని చాలా మంది పిల్లలకి తినిపిస్తుంటారు. అయితే, నెలల వయసున్న పిల్లలకి బీట్‌రూట్ పెట్టడం అసలు మంచిది కాదు. ఇందులో హై నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రేట్ పాయిజనింగ్‌లా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 నెలల పిల్లల అంతేకంటే తక్కువ వయసు ఉన్నవారికి బీట్‌రూట్ అసలే ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

అలర్జీ

infection

ప్రతి ఒక్కరికీ అన్నీ కూరగాయలు పడవు. కొంతమందికి అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. బీట్‌రూట్‌ తింటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమంది ఈ బీట్‌రూట్ ఉడికించేటప్పుడు ఆ వాసనని పీల్చడం వల్ల ఉబ్బసం వంటి సమస్యలొచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది అందరికీ కాదు. కొంతమందికి ఈ సమస్య ఉండొచ్చు. అదే విధంగా, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, అజీర్ణ సమస్యలున్నవారు ఈ వెజిటేబుల్‌ని అసలే తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.

క్యాన్సర్ ఉన్నవారికి

cancer

బీట్‌రూట్ క్యాన్సర్స్‌కి ముఖ్యంగా, బ్రెస్ట్, లంగ్, కొలన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా నిరోధక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే, ఇది డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టంగా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు పెరగవు. అదే విధంగా, షుగర్ ఉన్నవారు కూడా బీట్‌రూట్‌ని ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

లివర్ ప్రాబ్లమ్స్

liver problem

అదే విధంగా, బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనికి కారణం, బీట్‌రూట్‌లో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. అదే విధంగా, కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. లోబీపి సమస్యతో బాధపడేవారు, ఆ సమస్యకి ట్యాబ్లెట్స్ వాడేవారు బీట్‌రూట్ తీసుకోకపోవడమే మంచిది.

కిడ్నీలో రాళ్లు

kidney stone

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర ఆక్సలేట్ విసర్జనని పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల పెరిగేలా చేస్తుంది. కాబట్టి, బీట్‌రూట్‌ని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌ని అసలు తీసుకోకపోవడమే మంచిది.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

2.20.2025

Weeak end one time:ఒకసారి మాత్రమే మద్యం తాగుతాము అని చెప్పే వారికి ఎలాంటి ప్రాణం ప్రమాదంలో ఉంటుంది.

వారానికి ఒకసారి మాత్రమే మద్యం తాగుతాము అని చెప్పే వారికి ఎలాంటి ప్రాణం ప్రమాదంలో ఉంటుంది .



వారానికి ఒకసారి మాత్రమే మద్యం తాగుతాము అని చెప్పే వారికి ఎలాంటి ప్రాణం ప్రమాదంలో ఉంటుంది .

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రతి వారికి యొక్క అర్థం తెలిసినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ 
త్రాగడం మానేయలేదు.

ఈ మద్యపానమ్  అలవాటు వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయి. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు లోనే తమ తండ్రులను కోల్పోయారు. చాలా మంది భార్యలు తమ భర్తలను కోల్పోయారు. అయితే, దేశంలో మద్యపానం పెరుగుతోంది. కానీ ఎక్కడ తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. కొంతమంది నాకు ఆ అలవాటు పెద్దగా లేదని, వారానికి ఒకసారి మాత్రమే త్రాగుతానని అంటారు. ఈ పోస్ట్ వారి కోసమే. దయచేసి ఈ పోస్ట్ చదివి తెలుసుకోండి.

మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఈ కాలేయం దెబ్బతిన్నా లేదా దాని పనితీరును కోల్పోయినా, మరణానికి ఎక్కువ ప్రమాదం ఉంది. ఎక్కువగా మద్యం సేవించే వారిలో మాత్రమే కాలేయం దెబ్బతింటుంది. నా పరిశోధనలో అది దొరికింది. ఎక్కువగా తాగడం వల్ల కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది, దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది. వారానికి ఒకసారి మద్యం తాగుతామని చెప్పే వారు కూడా కాలేయం దెబ్బతింటారని గుర్తుంచుకోండి. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన లక్షణం ఉదరం వాపు. కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నట్లయితే, అవి పొత్తి కడుపులో వాపుకు కారణమవుతాయి. మీకు కాలేయ సమస్య ఉందని మీరు అనుమానించినట్లయితే, ముందుగా తాగడం మానేయండి. వెంటనే వైద్యుడిని చూడండి.

2.17.2025

Akali leka povatam. vaanthulu vikaaram liverdamage semtems

 వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.వికారం, ఆకలి లేకపోవడం


మీకు ఏది తినాలనిపించడం లేదా.. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందా అయితే ఇవి మంచి లక్షణాలు కావు. లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే సంకేతం. లివర్ సమస్యతో బాధపడుతున్నట్టుయితే ఆకలి మందగిస్తుంది. చాలా రోజుల వరకు ఏమి తినాలనిపించదు. అంతేకాకుండా వికార సమస్యలు ఉంటాయి. తరుచుగా వాంతులు అవుతుంటాయి. భోజనం చేసిన వెంటనే వికారం, వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం బెస్ట్.

Mutram lo ee rangu kanipiste doctor ni sampradinchandi

   మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే 



మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే
 ఏ సమస్య ఉండదు. చాలా మందికి అప్పుడప్పుడు మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంటుంది. ఒంటిలో వేడి చేసినప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. అయితే, మూత్రం తరుచుగా పసుపు రంగులో కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు మూత్రం రంగు ఇలా కనిపిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరుచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.

2.16.2025

Liver Helthy Tips:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.articleshow

ఆరోగ్యకరమైన కాలేయం బాగా పనిచేస్తుంది మరియు వ్యాధి లేకుండా ఉంటుంది . మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీరు:   
బాగా తినండి : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, సంతృప్త కొవ్వు మరియు ట్రాన్స్ ఫ్యాట్ లను నివారించండి.   
విష పదార్థాలను నివారించండి : రసాయనాలు, శుభ్రపరిచే సామాగ్రి మరియు పొగాకు ఉత్పత్తులకు గురికావడాన్ని పరిమితం చేయండి.   
బాధ్యతాయుతంగా త్రాగాలి : మద్యం సేవించడం పరిమితం చేయండి.   
వ్యాయామం : క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.   
సురక్షితమైన సెక్స్ ను ఆచరించండి : హెపటైటిస్ బి మరియు సి సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించండి.   
టీకాలు వేయించుకోండి : హెపటైటిస్ ఎ మరియు బితో సహా మీ టీకాల గురించి తాజాగా ఉండండి.   
మందులతో జాగ్రత్తగా ఉండండి : మీరు తీసుకునే అన్ని మందుల గురించి, ఓవర్-ది-కౌంటర్ ఉత్పత్తులతో సహా మీ వైద్యుడితో మాట్లాడండి.   
మీ చేతులను శుభ్రం చేసుకోండి : ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత, పెంపుడు జంతువులను తాకిన తర్వాత మరియు తినడానికి ముందు మీ చేతులను తరచుగా కడుక్కోండి.   
వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోండి : సూదులు, రేజర్లు, టూత్ బ్రష్లు లేదా ఇతర వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు.   
కాలేయం శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం, ఇది ఉదరం యొక్క కుడి ఎగువ భాగంలో ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, వ్యర్థాలను తొలగించడానికి మరియు గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. 



లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే...

ప్రపంచ వ్యాప్తంగా నేడు అనేక మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. లివర్ వ్యాధులు రావడానికి ప్రధానంగా అతిగా మద్యం సేవించడం, హెపటైటిస్ ఏ, బీ, సీ, ఈ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కారణంగా వస్తున్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. లివర్ శరీరంలోని వ్యాధికారక ఇన్ఫెక్షన్లతో పోరాడటం, రక్తస్రావం కాకుండా ఆపటం, ఇంతటి కీలకమైన జీవక్రియలను నిర్వర్తించే కాలేయం కూడా కొన్ని కారణాల వల్ల వ్యాధులకు గురవుతూ ఉంటుంది. ఆ వ్యాధులు జన్యుపరంగా, వైర్సల వల్ల, క్రమం తప్పిన జీవన విధానం వల్ల సంక్రమిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా మన అలవాట్లు మంచిగా వుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అధిక కొవ్వు పదార్ధాలు తింటే అందులో ఉన్న కొవ్వు పోతుంది. మరి అటువంటి ఆహార పదార్ధాలు తీసుకుంటే లివర్ లో తొలగిపోతుందో

తెలుసుకుందాం.

పాలు : కొవ్వు తీసిన పాలలో ఉండే ప్రోటీన్లు లివర్కు మంచి చేస్తాయి. లివర్ డ్యామేజ్ కాకుండా చూసాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
ఆకు పచ్చగా వుండే కూరగాయలు : ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు, కూరగాయలను రోజూ తినాలి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు లివర్లో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తాయి. లివర్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గిస్తాయి. లివర్ బాగా పనిచేసేలా చేస్తాయి.

చేపలు : చేపల్లో పుష్కలంగా వుండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో వాపుకు గురయిన మెరుగుపడుతుంది.

ఓట్స్ : ఓట్స్లో ఉండే పీచు పదార్థం అధికంగా వుంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్ను సంరక్షిస్తుంది. హానికారక పదార్థాలను బయటకు పంపుతుంది.


కాఫీ : కాఫీలో ఉండే కెఫీన్ లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. లివర్లో తయారయ్యే హానికారక ఎంజైమ్లను తొలగించడంలో కెఫీన్ బాగా పనిచేస్తుంది. కనుక రోజూ కాఫీ తాగితే లివర్ను సంరక్షించుకోవచ్చు.
వాల్నట్స్ : వాల్నట్స్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ

యాసిడ్లు లివర్కు మేలు చేస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గిస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. ఇవి కాకుండా పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆలివ్ ఆయిల్, అవకాడోలు, వెల్లుల్లి, గ్రీన్ టీ వంటి ఆహారాలు కూడా లివర్ వ్యాధులను తగ్గిస్తాయి. లివర్లో ఉండే కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో లివర్ సంరక్షింపబడుతుంది. మరి ఈ పదార్ధాలను తీసుకుని లివర్ ను ఆరోగ్యకంగా వుంచుకుందా..

2.12.2025

శృంగార సామర్థ్యాన్ని పెంచే ఉలవలు.. ఇంకా ఎన్నో లాభాలు.ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి.

 







ప్రపంచంలో అత్యంత ప్రాచీన్య ధాన్యం జాబితాలో ఉలవలు మొదటి స్థానంలో నిలుస్తాయి. ఉలవలను ఉత్తర భారత దేశంలో అధిక శాతం మంది తింటుంటారు. ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి.

ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. హైబీపీని తగ్గించి బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఉలవలు నవ ధాన్యాల్లో ఒకటిగా ఉన్నాయి. వీటిల్లో తెలుపు, ఎరుపు, నలుపు రంగు ఉలవలు లభిస్తాయి. మనం ఎక్కువగా ఎరుపు రంగు ఉలవలను తింటుంటాం.


ఉలవలతో చారు చేసి తినవచ్చు. కషాయం చేసి తాగవచ్చు. దీంతో మూల వ్యాధి తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. శరీరంలోని కఫం తొలగిపోతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు నెలసరి సరిగ్గా వస్తుంది. ఉలవలను తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. అజీర్తి తగ్గుతుంది. ఆకలి సరిగ్గా అవుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.


ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. ఉలవలను తింటుంటే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలను తినాలి. అధికంగా బరువు ఉన్నవారు, పొట్ట ఉన్నవారు ఉలవలను తింటుంటే ఫలితం ఉంటుంది. శరీరం మంటగా ఉంటే ఉలవల పొడిని మజ్జిగలో కలిపి తాగుతుండాలి. ఉలవలను తింటే బోదకాలు నుంచి ఉపశమనం లభిస్తుంది. లైంగిక శక్తి పెరుగుతుంది. ఉలవలను వేడి చేసి కాపడంలా పెడితే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. మూత్రంలో మంట తగ్గాలంటే ఉలవల నీళ్లను కొబ్బరి నీటితో కలిపి తాగాలి. ఉలవలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినడం మరిచిపోకండి.


ఆరోగ్యం & జీవన విధానం