మానవ శరీరములో మనము ఏ పని చేసిన అది రక్తము వలనే మనము ఊపిరి పిల్చుకోవాలి అనుకున్న సరే, రక్తము అవసరమే. రక్తము లేనిదే జీవనము లేదు.
ఇటువంటి విషయాలు మీకు తెలియనివి కాదు. అయితే రక్తములో తెల్ల రక్త కణాలు ఇంకా ఎర్ర రక్త కణాలు ఇవి రెండు శరీరానికి అవసరమే. ఈ రెండిటిలో ఏది తక్కువగా ఉన్న శరీరముకు ఇబ్బందులు తప్పనిసరి. సరే ఈ రోజు మనము యెర్ర రక్త కణాలు గురుంచి వివరముగా తెలుసుకుందాము.
ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఎందుకు ఉంటాయి అంటే హిమోగ్లోబిన్ ఉండటం వలన. ఈ హిమోగ్లోబిన్ ఎందుకు అవసరము అంటే అదే మన శరీరంలోకి ప్రాణవాయువును తీసుకొనివెళేది.
కానీ మన శరీర భాగాలకు ప్రాణ వాయువుకి బాగా అందాలంటే హిమోగ్లోబిన్ శాతం సరిపడా ఉండాలి. అలాగా ఉండాలి అంటే ఇవి అలవాటు చేసుకోవాలి. అవి ఏమిటి అంటే.
- ప్రతి రోజు వాకింగ్ చేయడం తప్పనిసరి. ఏరోబిక్ వ్యాయాయములో ఓదాటి వ్యాయామము ఇదేగా. నడవటం వలన శరీరములో జరిగే మార్పులు వాటి మూమెంట్స్ తో పాటు రక్తము లోని సెల్స్ ఉత్పత్తి అవుతాయి. వీటితో పాటు హిమోగ్లోబిన్ శాతము కూడా పెరుగుతుంది. దూరాలు నడిచే అలవాటు చేసుకోవాలి. లేకపోతె ఉదయము లేవడానికి చాల బద్దకముగా అనిపిస్తే లిఫ్ట్ ను వాడటం మానివేసి మెట్టులు ఎక్కడము అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్నపాటి నడవటం కూడా శరీరానికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి.
- మరొకటి డాన్స్ చేయటము వలన హిమోగ్లోబిన్ ని పెంచవచ్చు. ఎటువంటి స్టైల్ డాన్స్ మీరు ఎంచుకున్న ఫర్వాలేదు. డాన్స్ ఏరోబిక్ ఇంకా వ్యాయామాలు తో పాటు లెక్కలోకి వస్తుంది. కానీ మొదట నుడి డాన్స్ అలవాట్లు లేనివారు ముందగా చిన్నపాటి డాన్స్ తో మొదలు పెట్టండి.
- అత్యంత ఉపయోగము. సైకిల్ తొక్కటం చాల మంచి ఏరోబిక్ వ్యాయామము చిన్న చిన్న దూరాలకు సైకిల్ వాడటం చాల ఉత్తమము. చాల దేశములో చాల వరకు సైకిల్ తొక్కటం ఎక్కువగా వాడ్తున్నారు. అని మిలో ఎంతమందికి తెలుసు. కాలుష్యం తగ్గించుకోవటానికి ఇంకా శరీర ఆరోగ్యము పెంచుకోవటం కి ఒక మంచి ఆలోచన ఇది.
- మరొక పద్ధతి ఈత కొట్టడము కూడా మంచిది. అలాగా అని మీరేమి ఎక్కువ సేపు ఈత కొట్టనవసరము లేదు మాములుగా ఈత కొట్టిన శరీరములో రక్తము సెల్స్ ఉత్పత్తి అవటానికి ఈత కొట్టడము సహాయపడుతుంది. కనీసము రోజుకి ఒక్కసారి అయినా ఈత కొట్టడము చేయండి.
- జాగింగ్ చేయటము. అలాగా అని అదేపనిగా పరుగులు తీయనవసరము లేదు. చిన్నగా జాగింగ్ చేసుకుంటే సరిపోతుంది. శరీరానికి చెమట వచ్చేలాగా చేస్తుంది. శరీరములో క్యాలరీలు తగ్గించి ఎర్ర రక్తము సెల్స్ పెంచుతుంది. కొని సందర్బములో బయట ప్రదేశములో ఎండ గా ఉంటె మాత్రమూ ఇంట్లోనే ట్రెడ్మిల్ ను వాడాలి.