1000 Health Tips: Waking daily benefits helth tips articleshow

Waking daily benefits helth tips articleshow

వాకింగ్.. ఏ సమయంలో..ఎలా చేస్తే మంచిదో తెలుసా..!


మీకాళ్లకు పని చెబితే..అవి మీ హృదయ భారం తగ్గిస్తాయి. చాలా మంది వైద్యులు చెప్పే సలహా ఇది. వాకింగ్ తో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాకింగ్ శరీరానికే కాదు..
మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది. మీ గురించి మీరు సమీక్షించుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ వాకింగ్ ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. ఓసారి చూద్దాం.

వాకింగ్ అంటే చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఎప్పుడు నడవాలి.. ఎలా నడవాలి.. తిని నడవాలా.. పరగడపున నడవాలా.. ఇలాంటివి.. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిది. ఎందుకంటే.. ఉదయం కాలుష్యం తక్కువగా ఉంటుంది. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది. అలాగని పరగడుపున నడవాల్సిన అవసరం లేదు సుమా..

కాస్త లైట్ గా టిఫిన్ చేసి కూడా మార్నింగ్ వాకింగ్ చేయొచ్చు. మీకు షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు.

నడకలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. రోజుకు 10 వేల అడుగులు నడవడం. కాబట్టి.. ఇది ఎక్కడ నడిచామన్నది ప్రధానం కాదు. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. డాబాపైనో.. సెల్లార్ లోనో.. ఎక్కడైనా సరే. సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయవచ్చు. కాకపోతే ఉదయం నుంచి పనిచేసి ఉండటం వల్ల శరీరం అలసిపోయి ఉంటుంది. నడక అంత ఉత్సాహంగా అనిపించదు. ఇక రాత్రి పూట నడక వృద్ధులకు అంత మంచిది కాదు. కంటి చూపు మూలంగా ప్రమాదాలకు గురవచ్చు. ఏదైనా తగిలి కింద పడిపోవచ్చు. అసలే వృద్దాప్యం కారణంగా ఎముకల సమస్యలు కూడా ఉంటాయి.