Showing posts with label fiber. Show all posts
Showing posts with label fiber. Show all posts

2.14.2025

ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ

ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ తన డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ని యాడ్ చేయడం వల్ల 20 కిలోల బరువు తగ్గానని చెబుతోంది.
చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటారు. కానీ, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ కేవలం 30 శాతమే. కచ్చితంగా బరువు తగ్గాలంటే ఫుడ్ చేంజెస్ చేయాలి. ఈ నేపథ్యంలోనే రిది శర్మ కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని చెబుతోంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

బరువు తగ్గిన రిధి శర్మ..

బంగాళాదుంప, మజ్జిగ..

బంగాళాదుంప తింటే బరువు పెరుగతారని అనుకుంటారు చాలా మంది. కానీ, దీనిని తీసుకునే విధంగా తీసుకుంటే చాలావరకూ బరువు తగ్గుతారు. బంగాళాదుంపల్లో ఎక్కువగా పొటాషియం, ఫైబర్‌లు ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఇక మజ్జిగ.. మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, వీటిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

బీన్స్, పప్పులు, జుకిని..

బరువు తగ్గడంలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. బీన్స్, పప్పులు, జుకిన్ వెజిటేబుల్‌లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జుకిని వెజిటేబుల్ ఇది చూడ్డానికి కీర దోసకాయలా ఉంటుంది. కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చేసే బీన్స్, పప్పులు, జుకినీలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. బరువు తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తాయి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


కాలీఫ్లవర్, ఆపిల్..

కాలీఫ్లవర్‌లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అదే విధంగా, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లలో యాపిల్స్ కూడా ఉన్నాయి. ఈ పండ్లని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. బాడీకి పోషకాలు అందుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్‌ని తీసుకుని బరువు తగ్గించుకోగలిగానని రిధి శర్మ చెబుతోంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు వీటిని వీలైనంతగా వారి డైట్‌లో చేర్చుకోవాలి. అయితే, ఏ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.


డార్క్ చాక్లెట్, మష్రూమ్స్..

డార్క్ చాక్లెట్స్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిని తినడం స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. దీంతో పాటు మష్రూమ్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.

టోఫు, నట్స్..

టోఫు కూడా బరువు తగ్గడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. నట్స్‌లో పోషకాలు, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.

గుండెను పదిలంగా ఉంచే ఆహారాలు, ఎప్పుడు, ఎంత మోతాదులో తినాలో తెలుసా?

 

ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది లైఫ్ స్టైల్(Life Style) మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో గుండె పోటు, అధిక బరువు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి.

ఫైబర్ రిచ్ ఆహారాల్ని డైట్‌లో భాగం చేసుకుంటే చాలా వ్యాధుల్ని కంట్రోల్ చేయవచ్చంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి, బరువును అదుపులో ఉంచడానికి ఫైబర్ సాయపడుతుంది. రోజూవారి ఆహారంలో ఫైబర్ తీసుకోవడం వల్ల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ డైట్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంతకీ ఫైబర్ రిచ్ డైట్‌లో ఉండే ఆహారాలేంటి? వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

* బాదం, చియా, అవిసె వంటి గింజలు
* ఓట్స్, బీన్స్
* తృణధాన్యాలు (బార్లీ, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, కొర్రలు, జొన్నలు)
* అవకాడో
* బ్రకోలి, క్యారెట్, బ్రస్సెల్స్ మొలకలు వంటి కూరగాయలు
* బఠానీలు, పాలకూర, చిరుధాన్యాలు
* తాజా పండ్లు, పప్పు ధాన్యాలు

ఫైబర్ రిచ్ డైట్‌తో ప్రయోజనాలు

బరువు తగ్గుతారు

​ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఫైబర్ రిచ్ డైట్ బెస్ట్ ఆప్షన్. ఫైబర్ లేదా పీచు పదార్థం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్‌ రిచ్‌ డైట్‌ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో.. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. అతిగా తినకుండా కంట్రోల్‌లో ఉండవచ్చు. ఫైబర్‌ శరీరంలోని కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది, బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుంది. దీంతో బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు.


రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి


ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాల్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మానవ శరీరం ఫైబర్‌ను గ్రహించుకోలేదు, అలా అనీ విచ్ఛిన్నం చేయలేదు. రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తూ రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. వైద్యులు సాధారణంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 22-35 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.

గుండెకు మేలు

ఫైబర్ రిచ్ డైట్ గుండెకు మేలు చేస్తుంది. నీటిలో కరగని ఫైబర్ ఆహారాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు ముప్పు కలుగుతుంది. అదే ఫైబర్ రిచ్ డైట్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కరగని ఫైబర్ ఎక్కువగా విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాల్లో లభిస్తుంది. వీటిని డైట్‌లో భాగం చేసుకోండి. రెగ్యులర్‌గా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గుతాయి. మంట, వాపు రాకుండా చూసుకుంటుంది.

క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది

చిక్కుళ్లు, బ్రకోలి, బ్రస్సెల్స్ మొలకలు, తృణధాన్యాల్లో లభించే ఫైబర్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో లభించే ఫైబర్ నీటిలో కరుగుతుంది. నీటిలో కరిగే ఫైబర్ లేదా పీచు పదార్థం చాలా మృదువుగా ఉంటుంది. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో కొలొరెక్టర్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలి?

ఫైబర్ ఎంత తీసుకోవాలన్నది జీర్ణ వ్యవస్థ పరిమాణం బట్టి ఉంటుంది. పెద్దగా ఉంటే ఎక్కువ ఫైబర్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు 50 కిలోల బరువు ఉన్నవారికి 20 నుంచి 25 గ్రాముల ఫైబర్ అవసరం. అదే 75 కిలోల బరువుంటే సుమారు 30 నుంచి 35 గ్రాముల ఫైబర్ కావాలి. బ్రేక్ ఫాస్ట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.


గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.