Showing posts with label allergy. Show all posts
Showing posts with label allergy. Show all posts

2.26.2025

ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అసలు ఏ ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రెగ్నెంట్స్

pregnancy

​ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీట్‌రూట్ తినడం మంచిది. అయితే, ఎక్కువ మాత్రం తినకూడదు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహాతో ఎంత మోతాదులో తినొచ్చో తెలుసుకుని అంతే పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలొస్తాయి.

పిల్లలకి

child

మంచి కూరగాయలు అని చాలా మంది పిల్లలకి తినిపిస్తుంటారు. అయితే, నెలల వయసున్న పిల్లలకి బీట్‌రూట్ పెట్టడం అసలు మంచిది కాదు. ఇందులో హై నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రేట్ పాయిజనింగ్‌లా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 నెలల పిల్లల అంతేకంటే తక్కువ వయసు ఉన్నవారికి బీట్‌రూట్ అసలే ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

అలర్జీ

infection

ప్రతి ఒక్కరికీ అన్నీ కూరగాయలు పడవు. కొంతమందికి అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. బీట్‌రూట్‌ తింటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమంది ఈ బీట్‌రూట్ ఉడికించేటప్పుడు ఆ వాసనని పీల్చడం వల్ల ఉబ్బసం వంటి సమస్యలొచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది అందరికీ కాదు. కొంతమందికి ఈ సమస్య ఉండొచ్చు. అదే విధంగా, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, అజీర్ణ సమస్యలున్నవారు ఈ వెజిటేబుల్‌ని అసలే తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.

క్యాన్సర్ ఉన్నవారికి

cancer

బీట్‌రూట్ క్యాన్సర్స్‌కి ముఖ్యంగా, బ్రెస్ట్, లంగ్, కొలన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా నిరోధక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే, ఇది డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టంగా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు పెరగవు. అదే విధంగా, షుగర్ ఉన్నవారు కూడా బీట్‌రూట్‌ని ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

లివర్ ప్రాబ్లమ్స్

liver problem

అదే విధంగా, బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనికి కారణం, బీట్‌రూట్‌లో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. అదే విధంగా, కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. లోబీపి సమస్యతో బాధపడేవారు, ఆ సమస్యకి ట్యాబ్లెట్స్ వాడేవారు బీట్‌రూట్ తీసుకోకపోవడమే మంచిది.

కిడ్నీలో రాళ్లు

kidney stone

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర ఆక్సలేట్ విసర్జనని పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల పెరిగేలా చేస్తుంది. కాబట్టి, బీట్‌రూట్‌ని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌ని అసలు తీసుకోకపోవడమే మంచిది.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.