Showing posts with label డయాబెటిస్. Show all posts
Showing posts with label డయాబెటిస్. Show all posts

2.13.2025

చేపలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.చేపల్లో ఉండే ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి మంచివి.


 చేపలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.                                               చేపల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్స్ , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. 

చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: 

చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

చేపల్లో ఉండే ప్రోటీన్ ఎముకలు, కణజాలం, చర్మం, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గిస్తాయి.

చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరుకు మద్దతు ఇస్తాయి.

చేపల్లో ఉండే విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్ శరీరానికి మంచివి.

చేపల్లో ఉండే ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి మంచివి.

చేపల ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి వంటివి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి చేపలు సహాయపడతాయి. కాబట్టి చేపలు తినడం వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరవు.

​Fish Health Benefits: నాన్‌వెజిటేరియన్స్‌కు చేపలంటే.. ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. చేపలను ఎలా వండుకుని తిన్నా అద్భుతంగా ఉంటాయి. చేపల కూర, పులుసు, వేపుడు, పచ్చడి.. ఇలా దేనికదే ప్రత్యేకమైన రుచిలో ఉంటాయి. చేపలు రూచిలోనే కాదు.. పోషకాలలోనూ గొప్ప అనాల్సిందే. అందుకే వారానికి రెండు సార్లు మన డైట్‌లో ఏదో ఒక రూపంలో చేపలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాల్మన్, ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలల్లో కొవ్వు పదార్ధాలను కలిగి ఉన్నందున వాటిని ఇంకా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. చేపలను తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఈ స్టోరీ చదివేయండి.

చేపలలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవసరం. మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచి.. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. దీంతో వృద్ధాప్యంలో అల్జీమర్‌ వంటి వ్యాధులు దరికి చేరవు.



చేపలు తరచుగా తీసుకుంటే గుండె కండలాలు బలపడతాయి. గుండె కండరాలు బలహీనపడితే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చేపలలో ఉండే... ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌ రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

వయస్సు పెరిగే కొద్దు.. కంటి చూపు మందగిస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు ఎక్కువగా వాడటం వల్ల.. చిన్నవయస్సులోనే కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కంటి చూపను మెరుగుపరుస్తాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

ఆహారాలలో విటమిన్ డి చాలా తక్కువగా లభిస్తుంది. చేపలు విటమిన్ డి ఉత్తమ వనరులలో ఒకటి. విటమిన్ డి లోపం కారణంగా, ఎముకలు బలహీనంగా మారతాయి. అవి విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, చేపలను తరచుగా తీసుకుంటే.. ఎముకలు దృఢంగా మారతాయి.​

చేపలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియల పనితీరుకు, కండరాలు, ఎముకల దృఢత్వానికి ప్రొటీన్లు చాలా అవసరం. రోగనిరోధక శక్తి పెరగడానికి.. ప్రోటీన్లు తోడ్పడతాయి. శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేయడంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ అందించడంలోనూ ప్రోటీన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. చేపలు తరచుగా తీసుకుంటే.. ప్రొటీన్‌ లోపం దూరం అవుతుంది.

చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.

వయస్సు మీద పడడం వల్ల చాలామందికి మతిమరుపు వస్తుంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని 2016లో పలువురు అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.

గమనిక : ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



2.12.2025

శృంగార సామర్థ్యాన్ని పెంచే ఉలవలు.. ఇంకా ఎన్నో లాభాలు.ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి.

 







ప్రపంచంలో అత్యంత ప్రాచీన్య ధాన్యం జాబితాలో ఉలవలు మొదటి స్థానంలో నిలుస్తాయి. ఉలవలను ఉత్తర భారత దేశంలో అధిక శాతం మంది తింటుంటారు. ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి.

ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. హైబీపీని తగ్గించి బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఉలవలు నవ ధాన్యాల్లో ఒకటిగా ఉన్నాయి. వీటిల్లో తెలుపు, ఎరుపు, నలుపు రంగు ఉలవలు లభిస్తాయి. మనం ఎక్కువగా ఎరుపు రంగు ఉలవలను తింటుంటాం.


ఉలవలతో చారు చేసి తినవచ్చు. కషాయం చేసి తాగవచ్చు. దీంతో మూల వ్యాధి తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. శరీరంలోని కఫం తొలగిపోతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు నెలసరి సరిగ్గా వస్తుంది. ఉలవలను తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. అజీర్తి తగ్గుతుంది. ఆకలి సరిగ్గా అవుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.


ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. ఉలవలను తింటుంటే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలను తినాలి. అధికంగా బరువు ఉన్నవారు, పొట్ట ఉన్నవారు ఉలవలను తింటుంటే ఫలితం ఉంటుంది. శరీరం మంటగా ఉంటే ఉలవల పొడిని మజ్జిగలో కలిపి తాగుతుండాలి. ఉలవలను తింటే బోదకాలు నుంచి ఉపశమనం లభిస్తుంది. లైంగిక శక్తి పెరుగుతుంది. ఉలవలను వేడి చేసి కాపడంలా పెడితే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. మూత్రంలో మంట తగ్గాలంటే ఉలవల నీళ్లను కొబ్బరి నీటితో కలిపి తాగాలి. ఉలవలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినడం మరిచిపోకండి.


ఆరోగ్యం & జీవన విధానం

Lose Belly Fat: ఎంత నడిచినా పొట్ట కరగడం లేదా.. మీరు చేస్తున్న పొరపాటు ఇదే..

 Lose Belly Fat: ఎంత నడిచినా పొట్ట కరగడం లేదా.. మీరు చేస్తున్న పొరపాటు ఇదే..







అవును, బరువు తగ్గడం తేలికే. మరి ఎంత వాకింగ్ చేసినా ఎందుకు ఫలితం ఉండట్లేదు అంటారా? మనకు తెలియకుండా చేస్తున్న పొరపాట్లేంటో తెలుసుకుందాం… ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 వేల అడుగులు నడవగలిగితే ఫిట్నెస్ అనేది మనకు కట్టుబానిసవుతుందని రుజువైంది.

పదివేల అడుగులా.. అని కంగారు పడకండి. పట్టుదల సడలకుండా, వాయిదా వేయకుండా ప్రతిరోజూ అదే ఉత్సాహంతో ప్రయత్నిస్తే ఇదేం పెద్ద విషయం కాదని మీరే అంటారు. ఈ రోజు నుంచే ఇలా ప్లాన్ చేసుకుని చూడండి..


ఒంటిగా ఒద్దు.. జంటగా ముద్దు..


ఉదయాన్నే అలారం పెట్టుకుంటారు. కానీ మళ్లీ ముసుగుతన్ని పడుకుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే మీ స్నేహితుడినో, భార్య, భర్త ఇలా ఎవరినైనా తోడు తీసుకెళ్లండి. ఒంటిగా కన్నా ఇలా జంటగా చేసే వాకింగ్ అస్సలు బోర్ కొట్టదు. మీరు బద్దకించినా అవతలివారు మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటారు.


ఆరంభ శూరత్వం పనికిరాదు..


ఓకేసారి పదివేల అడుగులకు ప్రయత్నిస్తే మరుసటిరోజు రెండు అడుగులు కూడా వేయలేరు. అందుకే ఈ దూరాన్ని చిన్న చిన్న టార్గెట్స్ ద్వారా అందుకోండి. రోజు మొత్తంలో ఉదయం వాకింగ్ మాత్రమే కాకుండా.. తిన్న తర్వాత కాసేపు, నిద్రకు ముందు ఇలా ప్రతీదీ మీ టార్గెట్ ను చేరువ చేస్తుంది.


టెక్నాలజీ వాడుకో గురూ..


వాకింగ్ చేసేందుకు పెడోమీటర్, ఫిట్ నెస్ ట్రాకర్ లేదా స్మార్ట్ ఫోన్ యాప్స్ సాయంతో రోజుకు ఎంత నడుస్తున్నారో ట్రాక్ చేసుకోండి. మీ ప్రోగ్రెస్ ను ఇలా రోజూ చూసుకోవడం వల్ల మీకే మోటివేషన్ లభిస్తుంది.


వాకింగ్.. ఇంట్రెస్టింగ్ గా..


ఊరికే అలా వాకింగ్ చేయకుండా ఏదైనా మ్యూజిక్ వినండి. లేదంటే ఆడియో బుక్స్, పోడ్ కాస్ట్ లాంటివి చెవిలో పెట్టుకుని సాగిపోండి. ఇది మీ బరువు తగ్గాలనే ఛాలెంజ్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.


నేచర్ తో కలవండి..


ఎక్కడైనా పార్కుల్లో వాకింగ్ చేస్తున్నప్పుడు షూ తీసేసి కాసేపు పచ్చిక బయళ్ల మీద నడవండి. ఇది నేచర్ తో మిమ్మల్ని కనెక్ట్ చేసే అద్భుతమైన ప్రక్రియ. ఇలా చేయడం వల్ల చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఫీలవుతారు.


ఆ అవకాశం వదలొద్దు..


ఎలివేటర్లు, లిఫ్టులకు బదులు మెట్లెక్కే అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి. ఇవి మీలోని ఎక్స్ ట్రా కేలరీలు కరిగించేందుకు మరింత సహకరిస్తాయి. అయితే, తిన్న వెంటనే, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకూడదని గుర్తుంచుకోండి.


అసలు పరీక్ష ఇదే..


ఇక అన్నింటికన్నా పెద్ద సవాలు ఒకటుంది. అదే కన్సిస్టెన్సీ. మీరు ఈ అలవాటును ఎన్ని రోజులు కొనసాగిస్తారనేదాని మీదే మీ లక్ష్యం ఆధారపడి ఉంటుంది. పట్టు సడలకుండా ప్రయత్నం ఆపకుండా 41 రోజుల పాటు ఏదైనా చేయగలిగితే తర్వాత అది అలవాటుగా మారిపోతుందని అంటారు. అందుకే ప్రయత్నం ఆపకండి.


కుక్క గారితో సరదాగా..


మీకు తోడుగా ఎవరూ లేకుంటే సరదాగా మీ పెట్స్ ని కూడా వాకింగ్ పార్ట్ నర్ గా చేర్చుకోండి. అది మీ స్ట్రెస్ ను తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగు చేస్తుంది.


(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)


సగ్గుబియ్యం తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

 సగ్గుబియ్యం తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, కండరాలను బలోపేతం చేయడం, గుండె పనితీరును మెరుగుపరచడం వంటి లాభాలు ఉన్నాయి. 

సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: 
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
  • కండరాలను బలోపేతం చేస్తుంది
  • గుండె పనితీరును మెరుగుపరుస్తుంది
  • పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది
  • జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారికి మంచిది
  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది
  • శరీరానికి కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలను అందిస్తుంది
సగ్గుబియ్యం తినే విధానం: 
  • వడియాలు పెట్టడానికి ఉపయోగిస్తారు
  • ఫలహారంగానూ, స్నాక్స్ గానూ ఉపయోగిస్తారు
  • ఉపవాసాల సమయంలోనూ తీసుకుంటూ ఉంటారు

మన వంటింట్లో దొరికే సగ్గుబియ్యం ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. చాలా రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సగ్గుబియ్యం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

వీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. ఈ సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, కాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సగ్గు బియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి తో పాటు ఐరన్ కాల్షియం, విటమిన్ కె లు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయట. సగ్గుబియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది.








రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చట. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి గర్భిణీ స్త్రీ లకు ఎంతో మేలు చేస్తాయి. పుట్టే పిల్లలకి కూడా చాలా మంచిదని చెబుతున్నారు. సగ్గుబియ్యంలో కాల్షియం, ఐరన్, విటమిన్ కె వంటివి ఉంటాయి. కాబట్టి, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయట. వీటిలోని కాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుందట. వీటిలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మజిల్స్‌ కి బలం, కండరాల సమస్యలు దూరమవుతాయట. ముఖ్యంగా, ప్రోటీన్‌ తో కలిపి తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. బరువు తక్కువ ఉన్నవారు ఈ సగ్గు బియ్యాన్ని తినడం అలవాటు చేసుకోవాలట. దీంతో మంచి వెయిట్ మెంటెయిన్ చేయవచ్చని చెబుతున్నారు.


వీటిని ఎక్కువ కేలరీల కంటెంట్ అనారోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోకుండా ఉండడం కూడా మంచిదట. వీటితో సరైన రీతిలో బరువు పెరుగుతారట. సగ్గుబియ్యం రెగ్యులర్‌ గా తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుందట. గ్లూటెన్ పడనివారు ఈ సగ్గు బియ్యాన్ని హ్యాపీగా తినవచ్చట. దీంతో జీర్ణ సమస్యలు కూడా రావని చెబుతున్నారు. వీటిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. జీర్ణ సమస్యలు, మలబద్ధకం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. సగ్గు బియ్యాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫిట్‌నెస్ మీ సొంతమవుతుందట. ఫిట్‌ గా మారతారు. వీటిని తరచుగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్‌ ని దృష్టిలో పెట్టుకోవాలి. బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే బలహీనత తగ్గి తక్షణ శక్తి పొందవచ్చట. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ బూస్టర్‌ లా పని చేస్తాయట. ఉపవాసంలో చాలా మంది వీటితో కిచిడీ, పాయసం చేసి తాగడం మంచిది. ఇలా చేస్తే ఉపవాసంతో అలసిన శరీరానికి అప్పటికప్పుడు ఎనర్జీ అందుతుందట. సగ్గుబియ్యాన్ని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మధ్యాహ్నం అన్నం తినే వరకూ ఎనర్జీగా ఉంటారట. వీటిని మధ్యాహ్నాం తీసుకుంటే ఎక్కువగా తినకుండా ఉంటారట. వీటిని వర్కౌట్‌ కి ముందు తీసుకుంటే ఎనర్జీగా ఉంటారట. ఎక్సర్‌సైజ్ పర్ఫెక్ట్‌ గా చేస్తారని చెబుతున్నారు.

2.05.2025

జెస్టేషనల్ డయాబెటిస్.వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 జెస్టేషనల్ డయాబెటిస్


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

జెస్టేషనల్ డయాబెటిస్

ప్రజెంట్ చాలా మంది ప్రెగ్నెంట్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఫేస్ చేసే    ప్రాబ్లమ్. డయాబెటీస్. దీనినే జెస్టేషనల్ డయాబెటిస్ అని కూడా అంటారు.

సాధారణంగా గర్భ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీంతో పాటు కాస్తా బరువు పెరుగుతారు. శరీరతత్వం, ఇలాంటి కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. ఈ కారణంగానే డయాబెటీస్ వస్తుంది. ఈ సమస్య 6 నెలల తర్వాతే బయటపడుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే ఉమ్మనీరు పెరగడం, బిడ్డ బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ, మరీ సమస్య పెరిగితే కడుపులోనే బిడ్డ చనిపోవడం, డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ ఉంటే

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది.
గుండె జబ్బులు
నరాల సంబంధిత సమస్యలు
అదే విధంగా పుట్టిన పిల్లలకు చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

లక్షణాలు..

సాధారణంగా ఈ సమస్యకి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా కనిపించవు. కానీ కొందరికీ..

దాహం వేయడం
ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్ళడం
ఇలాంటి లక్షణాలు ఉంటాయి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

డైట్

జెస్టేషనల్ డైట్‌తో బాధపడేవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫుడ్స్ తినాలి. హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతే కాకుండా చాలాసేపటి వరకూ మీ కడుపు నిండుగా ఉంటుంది.

దీంతో పాటు లీన్ ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. టోఫు, చికెన్ వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, నట్స్, ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. బ్రకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్స్ వంటి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

ఇవి వద్దు.

వీటితో పాటు ఉప్పుని తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. లో ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్ తగ్గించాలి. ఆయిలీ ఫుడ్స్, మీట్, ఫ్యాట్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిది కాదు.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అదే విధంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో రెగ్యులర్ చెకింగ్ అవసరం. ప్రెగ్నెన్సీ మొత్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మెంటెయిన్ చేయడానికి రెగ్యులర్‌గా చెకప్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. డాక్టర్ సలహాతో వర్కౌట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ టైమ్‌లో ఆడవారికి శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకోసం సెల్ఫ్‌కేర్ పద్ధతులు పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానం వంటివి చేయాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం, ఏదైనా ఓ వర్కౌట్ లేదా వాకింగ్ అయినా చేస్తుండాలి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు ముందే ప్రీప్రెగ్నెనీ కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీనిని బట్టి డాక్టర్స్ కుటుంబాన్ని బట్టి బీపీ, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. పీసీఓఎస్ ఉంటే తగిన జాగ్రత్తలు ఇచ్చి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ సరైన డైట్‌ గురించి చెబుతారు.

మొత్తానికీ హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఈ సమయంలో మాత్రం సమయానికి తినడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సరైన సమయానికి పడుకోవడం వంటి కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల గర్భిణీలతో పాటు వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్భ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీని వల్ల కాస్తా బరువు పెరుగుతారు. శరీరతత్వం, ఇలాంటి కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. ఈ కారణంగానే డయాబెటీస్ వస్తుంది. ఈ సమస్య 6 నెలల తర్వాతే బయటపడుతుంది. దీని వల్ల కొన్ని సార్లు మహిళలకి, వారి కడుపులోని బిడ్డకి కూడా ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే ఉమ్మనీరు పెరగడం, బిడ్డ బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ, మరీ సమస్య పెరిగితే కడుపులోనే బిడ్డ చనిపోవడం, డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ ఉంటే

పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది.
గుండె జబ్బులు
నరాల సంబంధిత సమస్యలు
అదే విధంగా పుట్టిన పిల్లలకి చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  

లక్షణాలు..

సాధారణంగా ఈ సమస్యకి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా కనిపించవు. కానీ కొందరికీ..

దాహం వేయడం
ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్ళడం
ఇలాంటి లక్షణాలు ఉంటాయి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. డైట్..

జెస్టేషనల్ డైట్‌తో బాధపడేవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫుడ్స్ తినాలి. హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతే కాకుండా చాలాసేపటి వరకూ మీ కడుపు నిండుగా ఉంటుంది.

దీంతో పాటు లీన్ ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. టోఫు, చికెన్ వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, నట్స్, ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. బ్రకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్స్ వంటి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

ఇవి వద్దు..

వీటితో పాటు ఉప్పుని తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. లో ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్ తగ్గించాలి. ఆయిలీ ఫుడ్స్, మీట్, ఫ్యాట్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిది కాదు.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అదే విధంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో రెగ్యులర్ చెకింగ్ అవసరం. ప్రెగ్నెన్సీ మొత్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మెంటెయిన్ చేయడానికి రెగ్యులర్‌గా చెకప్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. డాక్టర్ సలహాతో వర్కౌట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ టైమ్‌లో ఆడవారికి శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకోసం సెల్ఫ్‌కేర్ పద్ధతులు పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానం వంటివి చేయాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం, ఏదైనా ఓ వర్కౌట్ లేదా వాకింగ్ అయినా చేస్తుండాలి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు ముందే ప్రీప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీనిని బట్టి డాక్టర్స్ కుటుంబాన్ని బట్టి బీపీ, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. పీసీఓఎస్ ఉంటే తగిన జాగ్రత్తలు ఇచ్చి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ సరైన డైట్‌ గురించి చెబుతారు.

మొత్తానికీ హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఈ సమయంలో మాత్రం సమయానికి తినడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సరైన సమయానికి పడుకోవడం వంటి కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల గర్భిణీలతో పాటు వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెబుతున్నారు.

1.15.2025

రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి

 రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే..






















అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని.

జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. కానీ, ఇవన్నీ పొందాలంటే.. మీరు సహజంగా పండిన అరటిపండును తినాలి.

అయితే మీరు తినే అరటిపండ్లను ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..? మనం కేవలం రూ. 60కే డజన్ అరటి పండ్లు కొని.. మన ఇంటికి క్యాన్సర్ తెచ్చుకుంటున్నాం. పక్వానికి రాక ముందు అరటి పండ్లను తెంపేసి.. కార్బైడ్ రసాయనాన్ని ఉపయోగించి పండిస్తున్నారు. దీంతో.. మీ శరీరంలో విషం కలుస్తుంది. అసలు కార్బైడ్ అంటే ఏంటి..? దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్బైడ్ అంటే ఏంటి..?

అరటిపండ్లతో పాటు.. ఇతర పండ్లను పండించడానికి కార్బైడ్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పండ్లలోని తేమను ఎండబెట్టి.. వాటిలో ఇథైల్ అనే వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇథైల్ పండ్ల లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. పండ్లు పక్వానికే ముందు పండిపోతున్నాయి. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని చాలా ప్రాంతాల్లో నిషేధించారు. కానీ, ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆశతో కాల్షియం కార్బైడ్‌ని వినియోగిస్తున్నరు. ఈ రసాయనం వాడటం వల్ల పండ్లు నిర్ణీత సమయానికి ముందే పక్వానికి వచ్చి త్వరగా మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో నిషేధించబడిన రసాయనం. దీనిని ఆరోగ్యానికి ప్రమాదంగా గుర్తించారు. ఇలా పండిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

ఈ రసాయనాన్ని భారతదేశంలో నిషేధించారు..

కాల్షియం కార్బైడ్‌లో సాధారణంగా ఆర్సెనిక్, ఫాస్పరస్ ఉంటాయి. ఈ రసాయనాల వాడకం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుంది. ఈ ప్రమాదాల కారణంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించారు. పండ్లను పండించడానికి ఇథిలీన్ సురక్షితంగా పరిగణించబడుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ఇథిలీన్ హానికరం కాదు. భారతదేశంలో పండ్లను పండించడానికి ఇథిలీన్ వాయువును ఉపయోగించడంపై FSSAI ఆమోదించింది. ఇథిలీన్ సహజంగా పండ్ల పక్వానికి వచ్చే ప్రక్రియను నియంత్రిస్తుంది . ఈ వాయువును పంట, రకం, పక్వత నుంచి పండ్లలో 100పీపీఎం (100 μl/L) సాంద్రతల బట్టి ఉపయోగించవచ్చు

విష పదార్థాలు..

కాల్షియం కార్బైడ్ ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా దాహం, మైకము, బలహీనత, ఆహారాన్ని మింగడంలో వంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం కార్బైడ్ రసాయనం కాబట్టి.. ఏ రూపంలోనైనా సరే బాడీలో చేరితే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు..

కార్బైడ్ వాడకం కడుపు నొప్పి, విరేచనాలు, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, కాల్షియం కార్బైడ్‌కు నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, తలనొప్పి, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం కూడా..

NCBIలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కాల్షియం కార్బైడ్‌ వల్ల మైకము, తలనొప్పి, మానసిక స్థితి తగ్గడం, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు వంటి నరాల సంబంధిత లక్షణాలు ఏర్పడవచ్చు. ఏ రూపంలోనైనా ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


పోషకాలు పోతాయి..
కృత్రిమంగా పండిన పండ్లలో.. సహజంగా పండిన పండ్ల కంటే తక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి కావాల్సిన చక్కెరలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పూర్తిగా అందించవు. దీంతో.. వీటిని తినడం వల్ల లాభాల కంటే ముప్పే ఎక్కువగా ఉంది.

కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లను ఎలా గుర్తించాలి..

* కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు అసమానంగా పండుతాయి. అరటిపండులోని కొంత భాగం పసుపు రంగులోకి మారుతుంది. మరి కొంత భాగం పచ్చగా ఉండవచ్చు. ఈ తేడాలు గమనించి మీరు అరటి పండ్లను తీసుకోండి.

* కాల్షియం కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు సహజంగా పండిన అరటిపండ్ల కంటే వేగంగా పాడైపోతాయి.

* కార్బైడ్ వల్ల అరటిపండ్ల తొక్క పసుపు రంగులో కనిపిస్తుంది. నిగనిగలాడుతుంది. కానీ, లోపలి పండు మాత్రం గట్టిగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

* సహజంగా పండిన అరటిపండ్లు చాలా మృదువుగా ఉంటుంది. దాని ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అరటిపండు పూర్తిగా పసుపు రంగులో ఉన్నప్పటికీ ఇంకా చాలా గట్టిగా ఉంటే, అది రసాయనాలతో పండించారని అర్థం చేసుకోండి.

* సహజంగా పండిన అరటిపండ్లు ఆహ్లాదకరమైన తీపి వాసన కలిగి ఉంటాయి. రసాయనాలతో పండిన అరటిపండ్లలో ఈ సహజ సువాసన ఉండదు.


గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

1.09.2025

వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వస్తుందా? డాక్టర్ నిజం చెప్పారు

 ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెడ్ ఆమ్లెడ్, బ్రెడ్ పకోడా, బ్రెడ్ జామ్ రకరకాలు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. అయితే, ఓ యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వస్తుందని పేర్కొన్నారు. ఇందులో నిజనిజాలు తెలుకోవడానికి నిపుణుల్ని సంప్రదించడం జరిగింది. వారు ఏం చెప్పారంటే..












ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక, మనం తినే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్స్ కూడా ఉన్నాయి. అందుకే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే కచ్చితంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. ఇక, ఈ రోజుల్లో డయాబెటిస్, ఊబకాయం సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అయితే, వైడ్ బ్రెడ్‌ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది వైడ్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వైడ్ బ్రెడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వస్తాయని ఓ యూట్యూబ్ వీడియోలో ఉంది. ఇందులో నిజం తెలుసుకోవడానికి మా ఫ్యాక్ట్ చెక్ బృందం నిపుణుల్ని సంప్రదించింది. ఈ విషయంపై నిపుణులు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.


యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపారు. వైడ్ బ్రెడ్‌ని 100 శాతం మైదాతో తయారు చేస్తారని.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుతుందని తెలిపారు. వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ లేదంటే ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి ఇంటి టిఫెన్స్ చేయడం మేలని పేర్కొన్నారు. అంతేకానీ వైడ్ బ్రెడ్‌తో పకోడా, జామ్‌తో తినడం, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి తినవద్దని తెలిపారు. అయితే, ఇందులో నిజమెంత? డాక్టర్ ఏం చెప్పారు?

డాక్టర్ ఏం చెప్పారంటే..
యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం నిజమో లేదో తెలుసుకోవడానికి ది డైట్ ఎక్స్‌పర్ట్స్‌ సీఈవో, హెడ్ డైటీషియన్ అయిన సిమ్రమ్ కతురియాను సంప్రదించడం జరిగింది. వైట్ బ్రెడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో పోషకాలేమీ లేవని సిమ్రమ్ కతురియా తెలిపారు. వైట్ బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో ఆకస్మిక మార్పులకు కారణమన్నారు.

వైట్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ తగ్గుతుంది. దీంతో టైప్ -2 డయాబెటిస్ వస్తుందని తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆకలి పెరుగుతుందని.. దీంతో కొవ్వు స్థాయిలు పెరిగి ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.


చివరికి ఏం తేలిందంటే..మా ఫ్యాక్ట్ చెక్ విచారణలో యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం దాదాపు నిజమని తేలింది. వైట్ బ్రెడ్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు తెలిపారు. వైడ్ బ్రెడ్ బదులు గింజలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారంలో చేర్చుకోవాలని వారు పేర్కోన్నారు.