చేపలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చేపల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్స్ , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
చేపల్లో ఉండే ప్రోటీన్ ఎముకలు, కణజాలం, చర్మం, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గిస్తాయి.
చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరుకు మద్దతు ఇస్తాయి.
చేపల్లో ఉండే విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్ శరీరానికి మంచివి.
చేపల్లో ఉండే ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి మంచివి.
చేపల ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి వంటివి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి చేపలు సహాయపడతాయి. కాబట్టి చేపలు తినడం వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరవు.
Fish Health Benefits: నాన్‌వెజిటేరియన్స్‌కు చేపలంటే.. ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. చేపలను ఎలా వండుకుని తిన్నా అద్భుతంగా ఉంటాయి. చేపల కూర, పులుసు, వేపుడు, పచ్చడి.. ఇలా దేనికదే ప్రత్యేకమైన రుచిలో ఉంటాయి. చేపలు రూచిలోనే కాదు.. పోషకాలలోనూ గొప్ప అనాల్సిందే. అందుకే వారానికి రెండు సార్లు మన డైట్‌లో ఏదో ఒక రూపంలో చేపలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాల్మన్, ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలల్లో కొవ్వు పదార్ధాలను కలిగి ఉన్నందున వాటిని ఇంకా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. చేపలను తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఈ స్టోరీ చదివేయండి.

చేపలలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచి.. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. దీంతో వృద్ధాప్యంలో అల్జీమర్ వంటి వ్యాధులు దరికి చేరవు.
చేపలు తరచుగా తీసుకుంటే గుండె కండలాలు బలపడతాయి. గుండె కండరాలు బలహీనపడితే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చేపలలో ఉండే... ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
వయస్సు పెరిగే కొద్దు.. కంటి చూపు మందగిస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ స్క్రీన్‌లు ఎక్కువగా వాడటం వల్ల.. చిన్నవయస్సులోనే కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కంటి చూపను మెరుగుపరుస్తాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి.
ఆహారాలలో విటమిన్ డి చాలా తక్కువగా లభిస్తుంది. చేపలు విటమిన్ డి ఉత్తమ వనరులలో ఒకటి. విటమిన్ డి లోపం కారణంగా, ఎముకలు బలహీనంగా మారతాయి. అవి విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, చేపలను తరచుగా తీసుకుంటే.. ఎముకలు దృఢంగా మారతాయి.
చేపలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియల పనితీరుకు, కండరాలు, ఎముకల దృఢత్వానికి ప్రొటీన్లు చాలా అవసరం. రోగనిరోధక శక్తి పెరగడానికి.. ప్రోటీన్లు తోడ్పడతాయి. శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేయడంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ అందించడంలోనూ ప్రోటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చేపలు తరచుగా తీసుకుంటే.. ప్రొటీన్ లోపం దూరం అవుతుంది.
చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
వయస్సు మీద పడడం వల్ల చాలామందికి మతిమరుపు వస్తుంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని 2016లో పలువురు అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.
గమనిక : ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
coment please
ReplyDelete