Showing posts with label Syrup. Show all posts
Showing posts with label Syrup. Show all posts

2.15.2025

Syrup:పొడి దగ్గు. HelthTips.relief. article show

పొడి దగ్గు పోవాలంటే ఏం చేయాలి ?


శ్వాసనాళాలు లేదా గొంతులో చికాకుగా ఉంటూ, దగ్గినప్పుడు శ్లేష్మం తీసుకురాని దగ్గును పొడి దగ్గు అంటారు. దీనిని ఉత్పాదకత లేని దగ్గు అని కూడా అంటారు. 
పొడి దగ్గుకు కారణాలు: 
జలుబు, ఫ్లూ
వాయుమార్గ వాపు లేదా చికాకు
పర్యావరణ చికాకులు
అలెర్జీలు
సిగరెట్ పొగ
ఆస్తమా
ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్
పొడి దగ్గుకు ఇంటి నివారణలు: 
తేనె, పిప్పరమింట్ టీ తాగడం
ఉప్పు నీటితో పుక్కిలించడం
వెచ్చని ద్రవాలు తాగడం
ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం

పొడి దగ్గును తగ్గించడానికి సహాయపడే ఇతర చిట్కాలు: 
గొంతులో చక్కిలిగింతలు, గీతలు పడిన అనుభూతిని గమనించండి
జలుబు లేదా ఫ్లూ తర్వాత మూడు నుండి నాలుగు వారాల పాటు పొడి దగ్గు ఉంటుందని గమనించండి
ఈ దగ్గు వల్ల గణనీయమైన అసౌకర్యం ఏర్పడవచ్చు

శీతాకాలం..ఈ కాలంలో రోగాలు వ్యాపిస్తుంటాయి. చలి..జ్వరం.. పొడిదగ్గు వేధిస్తుంటాయి. రాత్రి సమయంలో పొడి దగ్గు అధికంగా వస్తుంటుంది. మరి పొడి దగ్గు పోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి ? దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

*. పొడి దగ్గు అధికంగా వస్తుంటే కొంచెం తలకు..గొంతుకు జండుబామ్ రాసుకుని కొద్ది సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి.

*. రాత్రి పడుకొనే ముందు ఒక చెంచా తేనెను తాగాలి. ఇలా తాగడం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనెను సేవించడం వల్ల గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది.

*. పొడి దగ్గు ఉపశమనానికి అల్లం నీళ్లు ఎంతగానో దోహదపడుతుంది. కొంచం అల్లం ముక్క వేసి బాగా మరించాలి. ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

*. రాత్రి పడుకొనే ముందు పొడి దగ్గు అధికంగా వేధిస్తుంటే అల్లం టీ తాగాలి. దీనివల్ల తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. దీనితో పాటు గోరువెచ్చగా గ్రీన్ టీ తాగినా ఫలితం ఉంటుంది.

*. లవంగాలను గాని తానికాయలను కాని నెయ్యిలో వేయించి నోటి పక్కన పెట్టుకుని రసం మింగుతుంటే దగ్గు తగ్గుతుంది.

*. వాసాపత్రాల రసాన్ని రెండు చెంచాల పరిమాణంలో నెయ్యి, మిశ్రీలను కలిపి తీసుకోవాలి.

*. చిటికెడు పిప్పళ్లఫల చూర్ణానికి రెండు చిటికెళ్ల సైంధవ లవణం కలిపి వేడినీళ్లతో రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.