Showing posts with label Music Director: Nimshi Zacchaeus. Show all posts
Showing posts with label Music Director: Nimshi Zacchaeus. Show all posts

2.15.2025

Movie: YeMayaUndo 2024 Song: YeMayaUndo

 

  •  Movie:  Ye Maya Undo
        Song:  Ye Maya Undo


కంటి రెప్పే వెయ్యకుండా
 కొంటె చూపే గుచ్చావే
 కళ్ళనిండా రంగు రంగు
 కలలు రేపావే
  చప్పుడైనా చెయ్యకుండా
 గుండెలోకి వచ్చావే
 గుండెల్లోనా చప్పుడంతా
 నువ్వై పోయావే
  నీలో నీలో
 నేనేమా నిదురించడం
 నాలో నాలో
 నువ్వేననుకోవడం
  ఎంతలా బాగున్నదో
 మనలోనా ఈ సంబరం
 ప్రేమలో పడనోళ్ళకి తెలియదులే
  ఏ మాయ ఉందో ఏ మైకముందో
 ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
 ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  నువ్వంటే ఎంతో ఇష్టం ఇష్టం
 ఎంతంటే తెలుపుట కష్టం
 నువ్వు లేని ఒక్కో నిమిషం
 అయిపోదా ఒక్కో నరకం
  గుండెలో నీ ప్రేమని
 కళ్ళలో చూసానులే
 అందుకే నీ చేతిలో
 ఒదిగి పొయాలే
  నువ్విలా ఓ నావలా
 దారినే చూపావులే
 ఎప్పుడూ నీ నీడలో
 సాగిపోతాలే
  లోకంలో ఎవ్వరి పేరు పేరు
 గురుతైనా రానే రాదూ
 నీ పేరే నీ పేరే
 మరువాలన్నా మరువాలన్నా
 ఆ విషయం గురుతే రాదూ
  ఇంతలో ప్రేమించితే
 మనసులో చోటుంచితే
 జన్మలో నీ చేయిని విడిచిపోనంటా
  నువ్విలా ఏడడుగులే
 కలిసి వేస్తావే ఇటే
 ప్రాణమే నీ తోడుగా
 పంపుతానంటా
  ఏ మాయ ఉందో ఏ మైకముందో
 ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
 ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే