ఐ బ్రోస్ థ్రెడ్డింగ్ చేయిస్తున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!
అయితే కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం అనర్ధాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం వల్ల కళ్లపై ఉన్న సున్నితమైన చర్మానికి చిరాకు కలుగుతుందని. కొంతమందిలో కనుబొమ్మల వద్ద ఎర్రగా మారుతుందని, అసౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు.
ఐ బ్రోస్ చేయించుకునే ఈ ప్రమాదం
కనుబొమ్మ ప్రాంతం చుట్టూ సున్నితమైన చర్మం ఉండడం వల్ల కనుబొమ్మలను షేప్ చేసేవారు సరిగ్గా చేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, చర్మం రంగు మారే సమస్య కూడా రావచ్చని చెబుతున్నారు. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఐబ్రోస్ చేయించుకుంటే జ్ఞాపకశక్తి బాగా తగ్గుతుందని, ఎక్కువగా దేనిని గుర్తు పెట్టుకోలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రతిరోజూ మహిళలు ఇవి తీసుకుంటే మగాళ్లు మీ వెంటపడాల్సిందే..!
కొందరిలో ఐబ్రోస్ చేయించుకున్నాక ఈ సమస్యలు వచ్చే అవకాశం
కొందరిలో ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత వాపు వచ్చే సమస్య కూడా ఉందని చెబుతున్నారు. సహజంగా ఐబ్రోస్ చేయడానికి ఉపయోగించేది దారమే కాబట్టి, ఇందులో రసాయనాలు వాడకం ఉండకపోయినప్పటికీ కొంతమందిలో ఇది అలర్జీలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఐబ్రోస్ చేస్తున్న సమయంలో సాధారణంగా నొప్పి వస్తుందని చెబుతున్నారు.
ఐ బ్రోస్ తో కొందరికి ఇన్ఫెక్షన్స్:
ఐబ్రోస్ చేయడం వల్ల కనుబొమ్మల చుట్టూ ఉండే స్కిన్ పోర్స్ తెరుచుకుంటాయి.దీనివల్లనే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ మొటిమలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక స్కిన్ పోర్స్ మూసుకోవడానికి ఏదైనా లోషన్ కానీ రోజ్ వాటర్ కానీ అప్లై చేయాలి.
ఐ బ్రోస్ చేయించుకోవటంపై భిన్నాభిప్రాయాలు
మరికొందరు మాత్రం ఐబ్రోస్ చేయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఈ ప్రక్రియ కనుబొమ్మలకు నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుందని, ముఖం యొక్క అందాన్ని మరింత పెంచుతుందని ఇది పూర్తిగా సహజమైనదని చెబుతున్నారు.ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చేసే ఈ ప్రక్రియలో ఎటువంటి ప్రమాదం ఉండదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఐ బ్రోస్ చేయించుకునే విషయంలో జాగ్రత్త
ఐబ్రోస్ చేయడానికి ఉపయోగించే దారం మురికిగా ఉన్న దారాన్ని ఉపయోగించకూడదని, చేసే వ్యక్తి శుభ్రంగా చేతులు కడుక్కొని దానిని ఉపయోగించాలని అలా చేస్తే ఎటువంటి అలర్జీలు రావని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుబొమ్మలను షేప్ చేయడం సాధారణంగా శిక్షణ పొందిన ప్రొఫెషనల్ నిర్వహిస్తే సురక్షితంగా ఉంటారని దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా చెబుతున్నారు.
గమనిక : ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.