Heart health : కళ్లల్లో ఈ మార్పు కనిపిస్తే బీ అలర్ట్.. ప్రాణ గండం పొంచి ఉన్నట్టే?

 Heart health : కళ్లల్లో ఈ మార్పు కనిపిస్తే బీ అలర్ట్.. ప్రాణ గండం పొంచి ఉన్నట్టే?



డాన్స్ చేస్తూ వాకింగ్ చేస్తూ కూర్చున్నాచోట్టే 

క్షణాల్లో కుప్పకూలి.. మరో క్షణంలో ప్రాణాలు కోల్పోతున్నారు..

ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయ్.


ఎందుకలా? అంటే.. ప్రధాన కారణం గుండె పోటు లేదా కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు వైద్య నిపుణులు.


అవును మనిషి బతుక్కి ఇప్పుడు గ్యారెంటీ లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ అనారోగ్యం దాడిచేస్తుందో చెప్పలేం. ఏ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అస్సలు ఊహించలేం. ఇలాంటి పరిస్థితికి అనేక కారణాలున్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి శరీరంలో ప్రతికూల మార్పులకు, గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు దారితీస్తున్నాయి. అయితే చాలా వరకు గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కొన్ని రోజుల ముందు నుంచే శరీరంలో కనిపిస్తుంటాయి. ముందుగానే గుర్తించి అలర్ట్ అయితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే గుండెపోటు రావడానికి నెలరోజుల ముందు మనిషి కళ్లల్లోనూ కొన్ని మార్పులు సంభవిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటంటే..


కలర్ మారుతుంది

మీ కళ్లు ఎప్పటి లెక్క లేకుంటే.. రంగు మారితే అనుమానించాల్సిందే. ఎందుకంటే కనుగుడ్లు నారింజ లేదా పసుపు రంగులోకి మారితే.. ఆ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే.. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పేరుకుపోయిందని అర్థం అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. అది రక్త నాళాల్లో అడ్డు పడ్డటంవల్ల బాధితులు ఎప్పుడైనా, ఎక్కడైనా కుప్పకూలి గుండెపోటుకు దారితీసే చాన్స్ ఉంటుంది. అందుకే జర జాగ్రత్త. లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని దావాఖానకు వెళ్లండని సూచిస్తున్నారు నిపుణులు.


కంటి నరాలు ఉబ్బడం

కళ్లల్లో నరాలు ఉబ్బినట్లు కనిపించినా అలర్ట్ అవ్వాలె. అట్లనే రక్త నాళాలు ఎరుపెక్కి ఉబ్బినట్లు ఎక్కువరోజులు ఉంటే కూడా మీ శరీరంలో రక్తపోటు తీవ్రస్థాయికి చేరిందనే సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. అదే టైమ్‌లో తీవ్రమైన అలసట, నీరం వంటివి కనిపిస్తుంటాయి. ఇవి గుండెపోటు వచ్చేకంటే ముందు మనిషి శరీరంలో జరిగే మార్పులే ఇవన్నీ.. కాబట్టి జర పైలం. కళ్లచుట్టూ వాపు కూడా శరీరంలో ద్రవాల సమతుల్యత దారితప్పిందనడానికి సంకేతమేనట.


కంటిలోపలి భాగంలో నొప్పి

ఏ కారణం లేకుండానే కంటి లోపలి భాగంలో మంట లేదా నొప్పి తరచుగా సంభవిస్తుంటే గుండెపోటుకు ముందు వచ్చే సంకేతాలుగా అనుమానించాలంటున్నారు వైద్య నిపుణులు. రక్త నాళాలక్ల బ్లడ్ సప్లయ్ సరిగ్గా లేకపోతే ఇట్లనే జరుగుతుందట. దీంతోపాటు అకారణంగా తలనొప్పి వస్తుండటం తరచుగా జరుగుతున్నా ఆలోచించాల్సిందే. గుండె పనితీరు నెమ్మదించడం, రక్త సరఫరాలో ఆటంకాలు ఇందుకు కారణం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు గుండెపోటుకు దారితీయవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించండి. అయితే పైన పేర్కొన్నది కేవలం కంటికి సంబంధించిన లక్షణాలే.. గుండెపోటు వచ్చే ముందు సంభవించే ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఏ లక్షణాలూ లేకుండానే సైలెంట్‌ హార్ట్ ఎటాక్ వస్తున్న సంఘటనలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు హెల్త్ విషయంలో.. ముఖ్యంగా మీ హార్ట్ విషయంలో కేర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. 'దిశ' బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

No comments:

Post a Comment