GB Syndrome : భయపెడుతున్న జీబీ సిండ్రోమ్.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి.. లక్షణాలు ఇవీ..
GB Syndrome : తెలంగాణలో జీబీఎస్(GBS) వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వ్యాధులు, వైరస్‌ల వ్యాప్తికి కారణమవుతున్నాయి.
మానవ తప్పిదంతోనే కోవిడ్ విజృంభించింది. తర్వాత బర్డ్ ఫ్లూ కారణంగా కోల్లు మృత్యువాతపడ్డాయి. ఆ తర్వాత కూడా వ్యాధులు, వైలరస్ తీవ్రత తగ్గడం లేదు. తాజాగా గులియన్ బ్యారీ సిండ్రోమ్(Gulian Byari Syndrome)(జీబీఎస్) వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? దీనిబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం కారణంగానే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
జీబీ సిండ్రోమ్ లక్షణాలు
ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ సోకిన తర్వాత పోస్టు వైరల్ లేదా పోస్టు బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించేది జీబీఎస్. ఇది మెదడు నుంచి దేహంలోని ప్రతీ భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. యాంటీ బాడీస్ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్ అందక అవయవాలు అచేతనంగా మారుతాయి.
- మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు క ండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టంగా ఉంటుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.
- ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రం కండరాలకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతిచెందే అవకాశం ఉంది.
- గుండె స్పందనలు వేగంగా లేదా నెమ్మదిగా మారడం, బీజీ హెచ్చతగ్గులు, ముఖం నుంచి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరుగుతాయి. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులు తీవ్రంగా జ్వరం వస్తుంది మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలు పడుతుంది.
- శరీరంలో పొటాషియం, కాల్షియం తగ్గినా జీబీఎస్ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తొలగిపోతుంది. జీబీ సిండ్రోమ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్‌కు ప్రధాన కరణం.
తక్కువ ఖర్చుతో చికిత్స
జీబీఎస్ వ్యాధికి తక్కువ ఖర్చుతోనే చికిత్స చేయవచ్చు. రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది దేహంలో మైలీన్ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దొచ్చు.