Showing posts with label కాఫీ. Show all posts
Showing posts with label కాఫీ. Show all posts

2.13.2025

ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా, గుండెతో పాటు కిడ్నీలకు ప్రమాదమని తెలుసా?

ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. చాలా మంది ఉదయాన్నే లేవగానే టీ లేదా కాఫీ తాగుతుంటారు. బెడ్ కాఫీ లేదా బెడ్ టీ అని గొప్పగా చెప్పుకుని మరీ తాగుతుంటారు. కొంత మంది నిద్ర మత్తు వదులుతుంది, ఎనర్జీ వస్తుందని నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు

కాఫీ లేదా టీలో టానిన్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్వవస్థపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అది వ్యాధిగా మారే ముప్పు ఉంది.

మూత్రపిండాలపై ఒత్తిడి

కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల కిడ్నీకి హాని కలుగుతుంది. అందుకే ఉదయం టీ తాగినప్పుడల్లా, దానితో బిస్కెట్లు లేదా డ్రై ఫ్రూట్స్ తినండి. అయితే, ఖాళీ కడుపుతో కాఫీ, తాగడం వల్ల కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుందని గుర్తించుకోండి.

గుండె జబ్బుల ప్రమాదం

ఖాళీ కడుపుతో తాగే కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగే అలవాటు మానుకోవాలి. ఒకవేళ తాగాలనుకుంటే వైద్యుణ్ని సంప్రదించి సలహా తీసుకోండి.

కాఫీ బదులు వీటిని ట్రై చేయండి..

* కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
* మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది
* కాఫీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ లేదా అల్లం టీ వంటివి తాగడం అలవాటు చేసుకోండి. వీటిలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి.

గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

యూరిక్ యాసిడ్ పెరుగుతుంది..

ఈ రోజుల్లో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే ప్యూరిన్స్ శరీరంలో విచ్చిన్నమై.. యూరిక్ యాసిడ్ స్పటికాలు ఏర్పడతాయి. ఇవి కీళ్లలో పేరుకుపోయి నొప్పులు కలిగిస్తాయి. అందుకే ఉదయాన్నే ఈ అలవాటు ఉంటే మానుకోండి.