ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు వడగాలులు..ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నమోదవుతున్నాయి. జనాలు మరి ఎండాకలం నుండి ఉపశమనం పొందాలంటే..కొన్ని చిట్కాలు..
*. ఉసిరి కాయను ఆహారంలో భాగంగా చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకపోకుండా చూస్తుంది. అంతేగాకుండా విటమిన్ సి అందుతుంది.
*. ప్రతి రోజు పుదీనా ఆకులను ఆహారంలో ఉపయోగించండి. పుదీనాను ఎలాగైనా వాడుకోవచ్చు. చట్నీ.. సలాడ్.. డికాషన్ వేసుకోవచ్చు. తలనొప్పి.. వికారాలు.. ఒత్తిడి..నీరసం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
*. గుప్పెడు తులసీ ఆకుల రసాన్ని తీసుకోండి. ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా అందుతుంది. రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుండి లభిస్తుంది. ఫలితంగా వికారం.. తలనొప్పి వంటి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
*. గులాబీ రేకులను ఎండబెట్టి.. వాటితో టీ తయారు చేసుకుని తాగాలి. వేడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి.