పెరుగు...తినడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సూచిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు నివారించవచ్చు. పెరుగులో చర్మానికి..జుట్టుకు ప్రయోజనం కలిగించే అనేక అంశాలున్నాయి. మరి అవేంటో చూద్దామా...
*. ఒక చెంచా పెరుగులో అర స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి ముఖానికి పట్టించాలి. కొద్దిసేపటి తరువాత కడుక్కొవాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య నుండి దూరం కావచ్చు.
*. నాలుగు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కొకో పౌడర్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి..మెడకు పట్టించాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
*. అరకప్పు పెరుగు..రెండు మూడు స్పూన్ల మెంతి పొడి కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తీరుతుంది.
*. రెండు నుండి నాలుగు స్పూన్ల పెరుగు లో కొద్దిగా ఓట్స్ తీసుకోవాలి. ఒక చెంచా నిమ్మరసం.. తేనే కలుపుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. అనంతరం ముఖానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలిగిపోతాయి.
*. పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ఫ్ కి పట్టించి.. శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.