Showing posts with label అరటి పండు. Show all posts
Showing posts with label అరటి పండు. Show all posts

1.15.2025

రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి

 రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే..






















అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని.

జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. కానీ, ఇవన్నీ పొందాలంటే.. మీరు సహజంగా పండిన అరటిపండును తినాలి.

అయితే మీరు తినే అరటిపండ్లను ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..? మనం కేవలం రూ. 60కే డజన్ అరటి పండ్లు కొని.. మన ఇంటికి క్యాన్సర్ తెచ్చుకుంటున్నాం. పక్వానికి రాక ముందు అరటి పండ్లను తెంపేసి.. కార్బైడ్ రసాయనాన్ని ఉపయోగించి పండిస్తున్నారు. దీంతో.. మీ శరీరంలో విషం కలుస్తుంది. అసలు కార్బైడ్ అంటే ఏంటి..? దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్బైడ్ అంటే ఏంటి..?

అరటిపండ్లతో పాటు.. ఇతర పండ్లను పండించడానికి కార్బైడ్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పండ్లలోని తేమను ఎండబెట్టి.. వాటిలో ఇథైల్ అనే వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇథైల్ పండ్ల లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. పండ్లు పక్వానికే ముందు పండిపోతున్నాయి. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని చాలా ప్రాంతాల్లో నిషేధించారు. కానీ, ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆశతో కాల్షియం కార్బైడ్‌ని వినియోగిస్తున్నరు. ఈ రసాయనం వాడటం వల్ల పండ్లు నిర్ణీత సమయానికి ముందే పక్వానికి వచ్చి త్వరగా మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో నిషేధించబడిన రసాయనం. దీనిని ఆరోగ్యానికి ప్రమాదంగా గుర్తించారు. ఇలా పండిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

ఈ రసాయనాన్ని భారతదేశంలో నిషేధించారు..

కాల్షియం కార్బైడ్‌లో సాధారణంగా ఆర్సెనిక్, ఫాస్పరస్ ఉంటాయి. ఈ రసాయనాల వాడకం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుంది. ఈ ప్రమాదాల కారణంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించారు. పండ్లను పండించడానికి ఇథిలీన్ సురక్షితంగా పరిగణించబడుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ఇథిలీన్ హానికరం కాదు. భారతదేశంలో పండ్లను పండించడానికి ఇథిలీన్ వాయువును ఉపయోగించడంపై FSSAI ఆమోదించింది. ఇథిలీన్ సహజంగా పండ్ల పక్వానికి వచ్చే ప్రక్రియను నియంత్రిస్తుంది . ఈ వాయువును పంట, రకం, పక్వత నుంచి పండ్లలో 100పీపీఎం (100 μl/L) సాంద్రతల బట్టి ఉపయోగించవచ్చు

విష పదార్థాలు..

కాల్షియం కార్బైడ్ ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా దాహం, మైకము, బలహీనత, ఆహారాన్ని మింగడంలో వంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం కార్బైడ్ రసాయనం కాబట్టి.. ఏ రూపంలోనైనా సరే బాడీలో చేరితే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు..

కార్బైడ్ వాడకం కడుపు నొప్పి, విరేచనాలు, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, కాల్షియం కార్బైడ్‌కు నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, తలనొప్పి, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం కూడా..

NCBIలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కాల్షియం కార్బైడ్‌ వల్ల మైకము, తలనొప్పి, మానసిక స్థితి తగ్గడం, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు వంటి నరాల సంబంధిత లక్షణాలు ఏర్పడవచ్చు. ఏ రూపంలోనైనా ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


పోషకాలు పోతాయి..
కృత్రిమంగా పండిన పండ్లలో.. సహజంగా పండిన పండ్ల కంటే తక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి కావాల్సిన చక్కెరలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పూర్తిగా అందించవు. దీంతో.. వీటిని తినడం వల్ల లాభాల కంటే ముప్పే ఎక్కువగా ఉంది.

కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లను ఎలా గుర్తించాలి..

* కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు అసమానంగా పండుతాయి. అరటిపండులోని కొంత భాగం పసుపు రంగులోకి మారుతుంది. మరి కొంత భాగం పచ్చగా ఉండవచ్చు. ఈ తేడాలు గమనించి మీరు అరటి పండ్లను తీసుకోండి.

* కాల్షియం కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు సహజంగా పండిన అరటిపండ్ల కంటే వేగంగా పాడైపోతాయి.

* కార్బైడ్ వల్ల అరటిపండ్ల తొక్క పసుపు రంగులో కనిపిస్తుంది. నిగనిగలాడుతుంది. కానీ, లోపలి పండు మాత్రం గట్టిగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

* సహజంగా పండిన అరటిపండ్లు చాలా మృదువుగా ఉంటుంది. దాని ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అరటిపండు పూర్తిగా పసుపు రంగులో ఉన్నప్పటికీ ఇంకా చాలా గట్టిగా ఉంటే, అది రసాయనాలతో పండించారని అర్థం చేసుకోండి.

* సహజంగా పండిన అరటిపండ్లు ఆహ్లాదకరమైన తీపి వాసన కలిగి ఉంటాయి. రసాయనాలతో పండిన అరటిపండ్లలో ఈ సహజ సువాసన ఉండదు.


గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

1.09.2025

రోజూ అరటి పండు తింటే చాలు.. సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది, రక్తపోటు కూడా కంట్రోల్..

 చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడం చాలా కీలకం. శరీరంల చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించేందుకు కొన్ని పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.


ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌, వాతావరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం చాలా కీలకం. ఇక, చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. అయితే.. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే శరీరానికి ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుత జీవనశైలి, పొల్యూషన్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లతో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), రెండు మంచి కొలెస్ట్రాల్ (HDL). మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువైతేనే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్‌టెన్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అందుకే చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడం చాలా కీలకం. శరీరంల చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించేందుకు కొన్ని పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటి ఫ్రూట్స్‌లో అరటి పండు ఒకటి. అరటి పండు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి అరటి పండు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.


అరటి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు..

​అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్, పొటాషియం ఉన్నాయి. పొటాషియం.. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు శరీరానికి ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అరటి పండు..

అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపడంలో సహాయపడుతుంది. అరటి పండులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అరటి పండును ఎలా తినాలి?

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, మీరు అరటిని అనేక విధాలుగా తినవచ్చు. అరటి పండును నేరుగా తిన్నా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నేరుగా తినడం ఇష్టం లేకపోతే.. అరటిపండు షేక్ లేదా స్మూతీని తయారు చేసి కూడా తినవచ్చు. ఇక, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పచ్చి అరటి కాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని కూరగా చేసుకుని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

అరటి పండు ఎప్పుడు తినాలి?

ఉదయాన్నే అల్పాహారంలో అరటి పండును భాగం చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల మీకు కడుపు నిండిన భావన వేస్తుంది. దీంతో ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. అదనంగా కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు. అయితే, అరటి పండ్లను ఎక్కువగా తినకూడదు. అరటి పండ్లను పరిమిత పరిమాణంలో తినాలని గుర్తించుకోండి. రోజుకు ఒకటి లేదా రెండు తినడం ఆరోగ్యానికి మేలు. ఒకవేళ డయాబెటిస్‌తో బాధపడుతుంటే మాత్రం వైద్యుణ్ని సంప్రదించడం మేలు.


అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఈ ఆహారాలకు నో చెప్పండి..

*నూనెలో వేయించిన ఆహారాలు
* ఐస్ క్రీమ్, డెజర్ట్, బేకరీ ఫుడ్
* గుడ్డు పచ్చసొన
* శుద్ధి చేసిన ఆహారాలు
* రెడ్ మీట్
* వీటి బదులు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోవాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, చిన్నపాటి వ్యాయామాలు కొలెస్ట్రాల్ పెరగకుండా దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక..

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.