Showing posts with label some tips for baby. Show all posts
Showing posts with label some tips for baby. Show all posts

2.16.2025

Some tips for babies Balintatalaku: koni chitkalu: helth tips. Articleshow

బాలింతలకు కొన్ని చిట్కాలు...


బాలింతలకు ఆహారం, పాలు పడడం, నొప్పులు వంటి విషయాలపై కొన్ని చిట్కాలు ఇవి: 
పాలిచ్చే తల్లులు రోజుకు 2-3 సార్లు ప్రోటీన్ ఆహారాలు తినాలి. అవి: మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్, గింజలు, విత్తనాలు.
ముదురు ఆకుపచ్చ మరియు పసుపు కూరగాయలు తినాలి. అవి: బ్రోకలీ, క్యారెట్లు, గుమ్మడికాయ.
రోజుకు రెండు సార్లు పండ్లు తినాలి. అవి: నల్ల ద్రాక్ష, కర్బూజ పండ్లు.
పాలకూర, జీలకర్ర, బార్లీ జావ, బొబ్బర్లు, ములగాకు మొదలగునవి తినాలి.
తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం తినాలి. అవి: పాలు, నెయ్యి, బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్‌, బీట్‌రూట్‌, బెండ.
కారం, మసాలాలు తగ్గించాలి.
పాలు పడడానికి డోంపెరిడోన్ అనే ఔషధం తీసుకోవచ్చు.
ఒళ్లు నొప్పులు వేధిస్తుంటే నిర్లక్ష్యం వద్దు.



తమ పిల్లలకు పాలు సరివడం లేదని కొంతమంది బాలింతలు మథనపడుతుంటారు. దీనితో పోత పాలు అలవాటు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని, పాలు ఎంత ఎక్కువ పడితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందుకు బాలింతలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

*ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వేడిచేయాలి. వీటిని రొమ్ములకు కడితే ఫలితం కనిపిస్తుంది.

* ఆవుపాలు, కర్బుజా పండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావా, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు మంచి ఫలితాన్నిస్తాయి.

*వాము కషాయం రోజు తేనేతో తీసుకోవాలి. తద్వారా చక్కగా పాలు పడడమే కాకుండా గర్భాశయం త్వరగా కుదించుకపోతుంది. అంతేగాకుండా గర్భాశయంలో నొప్పి కూడా తగ్గుతుంది.

*దోరగా ఉన్న బొప్పాయిని తీసుకుని కూర వండుకోవాలి. ఈ కూరను తినడం వల్ల స్తన్య వృద్ధి చెందుతుంది.

*మెంతుల కషాయం, మెంతికూర పప్పు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడుతాయి.