Showing posts with label Copper-Cleaning. Show all posts
Showing posts with label Copper-Cleaning. Show all posts

2.27.2025

Copper Cleaning: రాగి, ఇత్తడి పాత్రలను వీటితో క్లీన్ చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్

 

HelthTips

Copper Cleaning: రాగి, ఇత్తడి వస్తువులు చాలా మంది ఇళ్లలో వాడుతుంటారు. కాలక్రమేణా వాటి వినియోగం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే రాగి, ఇత్తడి పాత్రలు తొందరగా రంగు మారుతుంటాయి.

అంతే కాకుండా వీటి మెరుపు కూడా కోల్పోతాయి.


రాగి, ఇత్తడితో తయారు చేయబడిన పాత్రలు, అలంకరణ వస్తువులు , పరికరాలకు సంరక్షణ అవసరం. రాగి , ఇత్తడి పాత్రలను మెరిపించడానికి తప్పకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ ఉపయోగించడం ద్వారా వాటి సహజ మెరుపును తిరిగి పెంచవచ్చు.


మీరు కూడా మీ రాగి , ఇత్తడి వస్తువులపై ఉన్న మెరుపును కొనసాగించాలనుకుంటే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన పద్ధతులను అనుసరించాలి. మీరు ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండానే వీటితో మీ పాత్రలను మెరిసేలా చేయవచ్చు.


నిమ్మకాయ, ఉప్పు:

నిమ్మకాయ , ఉప్పు మిశ్రమం రాగి, ఇత్తడి వస్తువులను తెల్లగా మారుస్తాయి. ఎంత నల్ల రంగులోకి మారిన వస్తువులైనా వీటిని వాడటం వల్ల మెరిసిపోతాయి. నిమ్మరసంతో ఉప్పు కలిపి, ఒక క్లాత్ తో పాత్రలపై రుద్దండి. ఈ మిశ్రమం పాత్రలపై ఉన్న తుప్పు, ధూళిని శుభ్రం చేయడానికి , వాటిని మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. దీని తరువాత పొడి క్లాత్ ఉపయోగించి పాలిష్ చేయండి.


వెనిగర్, బేకింగ్ సోడా:

ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో కాస్త వెనిగర్ , తగినంత బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని రాగి లేదా ఇత్తడి వస్తువులపై పూసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత తడిగా ఉన్న క్లాత్ తో బాగా తుడిచి ఆరబెట్టండి. ఈ పద్ధతి లోహం యొక్క మెరుపును తిరిగి తెస్తుంది.


టమాటో పేస్ట్‌ వాడండి:

టమాటో రసం రాగి , ఇత్తడి వస్తువులను మెరిపించడానికి ఒక గొప్ప సహజ నివారణ. టమోటా రసాన్ని బ్రష్ సహాయంతో తీసుకుని రాగి, ఇత్తడి పాత్రలపై రుద్దండి. టమాటో రసం లోహం నుండి తుప్పు , ధూళిని తొలగించి దానిని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా కొత్త వాటిలా కూడా మెరిసేలా చేస్తుంది.


ముల్తానీ మిట్టితో శుభ్రపరచడం:

ముల్తానీ మిట్టిని పేస్ట్ చేసి రాగి లేదా ఇత్తడి వస్తువులపై అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది కూడా ప్రభావవంతమైన పద్ధతి. ముల్తానీ మిట్టిలో కొంచెం నీరు కలిపి పేస్ట్ లా చేసి రంగు మారిన వస్తువులపై మీద అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత దానిని బ్రష్ సహాయంతో తేలికగా రుద్దడం ద్వారా శుభ్రం చేయండి. ఇది పాత్రల యొక్క మెరుపును తిరిగి తీసుకు రావడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా ఉపరితలాన్ని గీతలు పడకుండా కాపాడుతుంది.


వెనిగర్, పిండి మిశ్రమం:

వెనిగర్, ఏదైనా పిండి మిశ్రమం వాడి రాగి-ఇత్తడి వస్తువులను మెరిసేలా చేయవచ్చు. ఎదైనా పిండిని వెనిగర్ తో కలిపి పేస్ట్ లా చేసి, దానిని రాగి పాత్రలపై అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత తడి క్లాత్ తో శుభ్రం చేయండి. ఈ మిశ్రమం లోహంపై పేరుకుపోయిన మురికిని తొలగించి మెరుపును అందిస్తుంది.


Also Read: వీళ్లు ఖర్జూరం అస్సలు తినకూడదు.. తెలుసా ?


చక్కటి పాలిషింగ్ పౌడర్ వాడకం:

రాగి , ఇత్తడి వస్తువులను త్వరగ , సులభంగా మెరిసేలా చేసే పాలిషింగ్ పౌడర్లు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పొడులను లోహపు ఉపరితలంపై తేలికగా రుద్ది పాలిష్ చేయండి. ఇది వస్తువులను మెరిసే మెరుపును ఇస్తుంది . అంతే కాకుండా దానిపై ఏర్పడిన తుప్పును కూడా తొలగిస్తుంది.


The post Copper Cleaning: రాగి, ఇత్తడి పాత్రలను వీటితో క్లీన్ చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్ appeared first on .