అల్జీమర్స్ వ్యాధి లేదా డిమెన్షియా ఒక మనిషి యొక్క ఆలోచనా శక్తిని హరించి, తన దైనందిన పనులు కూడా సక్రమంగా చేసుకొనివ్వకుండా చేస్తుంది. చివరికి ఈ వ్యాధిగ్రస్థులు తమను తాము కూడా మర్చిపోతారు. ఈ వ్యాసంలో అల్జీమర్స్ వ్యాధిని నయం చేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. చికాగోలో రష్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వారు నిర్వహించిన అధ్యయనంలో పరిశోధకులు "మైండ్ డైట్" పేరుతో ఒక ఆహార ప్రణాళికను తయారుచేశారు. ఈ అధ్యయనంలో మైండ్ డైట్ అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదాన్ని 53 శాతం మేరకు తగ్గిస్తుంది అని తెలుసుకున్నారు.
ఎవరైతే ఈ ఆహార ప్రణాళికకు కట్టుబడి ఉన్నారో వారిలో అల్జీమర్స్ వ్యాధి తీవ్రత మూడో వంతుకు తగ్గిపోయినట్లు గమనించారు. అల్జీమర్స్ వ్యాధి నివారణకు గల ప్రధాన కారకాలలో ఆహారం కీలకమైన పాత్ర వహిస్తుంది. "మైండ్ డైట్" అభిజ్ఞ శక్తి (విచక్షణ శక్తి) లో క్షీణత రేటును నెమ్మదింపచేసి, మిగిలిన వ్యాధి కారకాలు ఎలా ఉన్నప్పటికి అల్జీమర్స్ వ్యాధి నుండి కాపాడుతుంది. "మైండ్ డైట్" ను ఒక వ్యక్తి తీసుకోవలసిన పది ఆరోగ్యకర ఆహార విభాగాలుగా మరియు తీసుకోకూడని ఐదు అనారోగ్యకర ఆహార విభాగాలుగా విడదీశారు. ఇప్పుడు మనం అల్జీమర్స్ వ్యాధిని నయం చేసే ఆ ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం.
పచ్చని ఆకు కూరలు: పాలకూర, ఆవ మొక్క
ఆకులు, కేల్ మరియు కోలార్డ్ వంటి పచ్చని ఆకు కూరలలో ఫోలేట్ మరియు విటమిన్ B9 అధికంగా ఉంటాయి. ఇవి అభిజ్ఞ శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ ఏ మరియు సి కూడా మెండుగా ఉంటాయి. కనుక వీటిని వారానికి కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. వారానికి ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే మెదడుకు అత్యంత ప్రయోజనం చేకూరుతుంది.
పచ్చని ఆకు కూరలు: పాలకూర, ఆవ మొక్క
ఆకులు, కేల్ మరియు కోలార్డ్ వంటి పచ్చని ఆకు కూరలలో ఫోలేట్ మరియు విటమిన్ B9 అధికంగా ఉంటాయి. ఇవి అభిజ్ఞ శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ ఏ మరియు సి కూడా మెండుగా ఉంటాయి. కనుక వీటిని వారానికి కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. వారానికి ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే మెదడుకు అత్యంత ప్రయోజనం చేకూరుతుంది.
ఎండు ఫలాలు: మైండ్ డైట్ పరిశోధనల ప్రకారం
ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి
తినాలి.బాదంపప్పు,జీడిపప్పు మరియు వాల్ నట్లు బాగా తినాలి.
బెర్రీస్: బెర్రీస్ లో మెదడుకు హాని కలిగించే
ఫ్రీరాడికల్స్ నుండి బెర్రీస్ కాపాడతాయి. బెర్రీస్ లో శోథ నిరోధక లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ మరియు సి లు ఉంటాయి. మైండ్ డైట్ లో ఇవి మాత్రమే సిఫార్సు చేయబడిన పండ్లు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ మరియు చెర్రీకి మెదడును కాపాడే సామర్థ్యం ఉంది. వీటిని కనీసం వారానికి రెండుసార్లు తినాలి.
బీన్స్: అధికముగా పీచుపదార్థాలు మరియు
ప్రొటీన్లు ఉన్నందున బీన్స్ ను మీ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. బీన్స్ లో తక్కువ కెలోరీలు మరియు కొవ్వులు మీ మెదడు పదునుగా ఉండటాన్ని ప్రోత్సహిస్తాయి. అల్జీమర్స్ నివారణకు మైండ్ డైట్ లో భాగంగా వీటిని కనీసం వారానికి మూడుసార్లు తినాలి అని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.
తృణధాన్యాలు: క్వినోవా, గోధుమలు, ఓట్స్, వరి
మరియు రై వంటి తృణధాన్యాలు మైండ్ డైట్ లో ముఖ్యమైన భాగం. పరిశోధకులు వీటిని కనీసం రోజుకి మూడుసార్లు తినాలి అని సిఫార్సు చేస్తున్నారు. తృణధాన్యాలు తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కక్నుక హృద్రోగ సమస్యలు, మధుమేహ సమస్యలు తగుముఖం పడతాయి.
కాఫీ & చాక్లెట్: కాఫీ మరియు చాక్లెట్ మీ
ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అధ్యయనాలలో కాఫీ మరియు ఇటీవలి చాక్లెట్లను అల్జీమర్స్ రోగచికిత్సలో వినియోగించవచ్చని తేలింది. దాల్చినచెక్క మరియు ఆలివ్ ఆయిల్ తో కలిపి వాడితే కాఫీ మరియు చాక్లెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, వయస్సుతో ముడిపడిన జ్ఞాపకశక్తి పారద్రోలుతాయి. తరిగిపోవడమనే సమస్యను