పిల్లలు జుట్టు ఎలా సంరక్షించాలో తెలియక కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. పిల్లలు పెరిగే కొద్ది జుట్టు సంరక్షణ చాలా అవసరమనే సంగతి అందరికీ తెలిసిందే. చిన్న వయస్సులోనే సరిగ్గా చూడకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరి పిల్లల జుట్టును ఎలా సంరక్షించాలి ?
పిల్లలు ఎక్కువ సమయంలో బయట ఆడడం వల్ల జుట్టు దుమ్ము.. ధూళి చేరుతుంది. ఈ సమయంలో పిల్లలు ఎక్కువగా చిరాకు పడుతుంటారు. ముందుగానే తలస్నానం చేయించకుండా శుభ్రంగా దువ్వెనతో జుట్టును దువ్వాలి. దీనితో జుట్టులో ఉన్న దుమ్ము.. ధూళి పోయే అవకాశం ఉంది. అనంతరం అంతగా గాఢత లేని షాంపూతో స్నానం చేయించండి. కళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా స్నానం చేయించాలి. షాంపు, కండిషనర్ వాడిన తర్వాత హెయిర్ను బాగా ఆరనివ్వాలి. జుట్టు బాగా ఆరిందని నిర్ధారించుకున్న తరువాతే దువ్వెన వాడాలి. జుట్టు కట్టడానికి క్లిప్ కానీ, టైకానీ ఉపయోగించొచ్చు.