ముఖానికి అందాన్ని ఇచ్చేవి ఏంటీ అంటే మొదటగా
'కళ్ళు' అనే సమాధానం వస్తుంది. ఈ కళ్లను
అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.
శరీరంలో అతి సున్నితమైన భాగాలలో ఒకటి
చర్మం.. తర్వాత కళ్ళు.. చర్మం ఆరోగ్యాన్ని ఎలా
రక్షించుకుంటామో...అదే విధంగా కళ్లు ఆరోగ్యాన్ని
కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. కళ్ళు
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ?
*. సరైన ఆహారం తీసుకోవాలి. విటమిన్.. మినరల్స్ కూడిన ఆహారం తీసుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్షణ అవసరం. *.కళ్ళు ఎక్కువగా ఎండలో స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. *. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కోకనట్ పౌడర్ ను క్యారట్ జ్యూస్లో మిక్స్ చేయాలి. అంతే మోతాదులో తేనె కూడా కలుపుకుని తాగాలి.
*. మీ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆముదం నూనె కూడా ఉపయోగపడుతుంది. రెండు మూడు చుక్కల ఆముదం నూనెను చేతిలోకి తీసుకొని కళ్ళకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
*. వాటర్ మెలోన్, టమోటో, పాలు, గ్రేప్ ఫ్రూట్ వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
*. జామ, ఆరెంజ్, పైనాపిల్, రెడ్ మరియు గ్రీన్ చిల్లీ, బెల్ పెప్పర్ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
No comments:
Post a Comment