*.కాళ్ల నొప్పులు..ఉరుకుల పరుగుల జీవితంలో కాళ్ల నొప్పులు కొంతమందికి అధికంగా వస్తుంటాయి. దీనితో ఈ బాధ నుండి విముక్తి పొందాలని ఏవేవో వాడుతుంటారు. మినరల్ లోపం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులను కొన్ని రకాల గృహ నివారణలు మరియు సహజ పద్దతులు త్వరగా ఉపశమనం అందిస్తాయి. *. కాళ్లలో నొప్పి.. వాపులకు తగ్గించేందుకు 'ఐస్' ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇందుకు ఐస్ ముక్కలను ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాలి. నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాగ్ తో వలయాకార రూపంలో మసాజ్ చేయాలి. ఇలా ఐస్ బ్యాగ్ తో 10 నిమిషాల పాటు చేయాలి. ఎక్కువ సేపు చేయకూడదు.
*. లవంగాల నూనె కూడా నొప్పులను నివారించడానికి సహాయ పడుతుంది. నొప్పిగా అనిపించిన వెంటనే లవంగాల నూనెను రాయాలి. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతి చెందుతాయి.
*. కొన్ని సమయాల్లో కాళ్లలో బెణుకుతుంటాయి. బెణుకులు మరియు గాయాలకు వెనిగర్ పరిష్కారం చూపుతుంది. ఒక బకెట్ వేడి నీటిని తీసుకోవాలి. అందులో రెండు చెంచాల వెనిగర్ ను వేయాలి.
అందులో రెండు చెంచాల వెనిగర్ ను వేయాలి.
దీనితో పాటు కొంత ఎప్సం సాల్ట్ ను కలుపుకోవాలి.
కలుపుకున్న అనంతరం ఈ బకెట్ లో కాళ్లు పెట్టాలి.
దాదాపు 20 నిమిషాల పాటు కాళ్లను నానబెట్టాలి.
ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి
ఉపశమనం పొందుతారు.
No comments:
Post a Comment