Lose Belly Fat: ఎంత నడిచినా పొట్ట కరగడం లేదా.. మీరు చేస్తున్న పొరపాటు ఇదే..
అవును, బరువు తగ్గడం తేలికే. మరి ఎంత వాకింగ్ చేసినా ఎందుకు ఫలితం ఉండట్లేదు అంటారా? మనకు తెలియకుండా చేస్తున్న పొరపాట్లేంటో తెలుసుకుందాం… ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 వేల అడుగులు నడవగలిగితే ఫిట్నెస్ అనేది మనకు కట్టుబానిసవుతుందని రుజువైంది.
పదివేల అడుగులా.. అని కంగారు పడకండి. పట్టుదల సడలకుండా, వాయిదా వేయకుండా ప్రతిరోజూ అదే ఉత్సాహంతో ప్రయత్నిస్తే ఇదేం పెద్ద విషయం కాదని మీరే అంటారు. ఈ రోజు నుంచే ఇలా ప్లాన్ చేసుకుని చూడండి..
ఒంటిగా ఒద్దు.. జంటగా ముద్దు..
ఉదయాన్నే అలారం పెట్టుకుంటారు. కానీ మళ్లీ ముసుగుతన్ని పడుకుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే మీ స్నేహితుడినో, భార్య, భర్త ఇలా ఎవరినైనా తోడు తీసుకెళ్లండి. ఒంటిగా కన్నా ఇలా జంటగా చేసే వాకింగ్ అస్సలు బోర్ కొట్టదు. మీరు బద్దకించినా అవతలివారు మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటారు.
ఆరంభ శూరత్వం పనికిరాదు..
ఓకేసారి పదివేల అడుగులకు ప్రయత్నిస్తే మరుసటిరోజు రెండు అడుగులు కూడా వేయలేరు. అందుకే ఈ దూరాన్ని చిన్న చిన్న టార్గెట్స్ ద్వారా అందుకోండి. రోజు మొత్తంలో ఉదయం వాకింగ్ మాత్రమే కాకుండా.. తిన్న తర్వాత కాసేపు, నిద్రకు ముందు ఇలా ప్రతీదీ మీ టార్గెట్ ను చేరువ చేస్తుంది.
టెక్నాలజీ వాడుకో గురూ..
వాకింగ్ చేసేందుకు పెడోమీటర్, ఫిట్ నెస్ ట్రాకర్ లేదా స్మార్ట్ ఫోన్ యాప్స్ సాయంతో రోజుకు ఎంత నడుస్తున్నారో ట్రాక్ చేసుకోండి. మీ ప్రోగ్రెస్ ను ఇలా రోజూ చూసుకోవడం వల్ల మీకే మోటివేషన్ లభిస్తుంది.
వాకింగ్.. ఇంట్రెస్టింగ్ గా..
ఊరికే అలా వాకింగ్ చేయకుండా ఏదైనా మ్యూజిక్ వినండి. లేదంటే ఆడియో బుక్స్, పోడ్ కాస్ట్ లాంటివి చెవిలో పెట్టుకుని సాగిపోండి. ఇది మీ బరువు తగ్గాలనే ఛాలెంజ్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
నేచర్ తో కలవండి..
ఎక్కడైనా పార్కుల్లో వాకింగ్ చేస్తున్నప్పుడు షూ తీసేసి కాసేపు పచ్చిక బయళ్ల మీద నడవండి. ఇది నేచర్ తో మిమ్మల్ని కనెక్ట్ చేసే అద్భుతమైన ప్రక్రియ. ఇలా చేయడం వల్ల చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఫీలవుతారు.
ఆ అవకాశం వదలొద్దు..
ఎలివేటర్లు, లిఫ్టులకు బదులు మెట్లెక్కే అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి. ఇవి మీలోని ఎక్స్ ట్రా కేలరీలు కరిగించేందుకు మరింత సహకరిస్తాయి. అయితే, తిన్న వెంటనే, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకూడదని గుర్తుంచుకోండి.
అసలు పరీక్ష ఇదే..
ఇక అన్నింటికన్నా పెద్ద సవాలు ఒకటుంది. అదే కన్సిస్టెన్సీ. మీరు ఈ అలవాటును ఎన్ని రోజులు కొనసాగిస్తారనేదాని మీదే మీ లక్ష్యం ఆధారపడి ఉంటుంది. పట్టు సడలకుండా ప్రయత్నం ఆపకుండా 41 రోజుల పాటు ఏదైనా చేయగలిగితే తర్వాత అది అలవాటుగా మారిపోతుందని అంటారు. అందుకే ప్రయత్నం ఆపకండి.
కుక్క గారితో సరదాగా..
మీకు తోడుగా ఎవరూ లేకుంటే సరదాగా మీ పెట్స్ ని కూడా వాకింగ్ పార్ట్ నర్ గా చేర్చుకోండి. అది మీ స్ట్రెస్ ను తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
No comments:
Post a Comment