సగ్గుబియ్యం తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

 సగ్గుబియ్యం తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, కండరాలను బలోపేతం చేయడం, గుండె పనితీరును మెరుగుపరచడం వంటి లాభాలు ఉన్నాయి. 

సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: 
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
  • కండరాలను బలోపేతం చేస్తుంది
  • గుండె పనితీరును మెరుగుపరుస్తుంది
  • పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది
  • జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారికి మంచిది
  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది
  • శరీరానికి కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలను అందిస్తుంది
సగ్గుబియ్యం తినే విధానం: 
  • వడియాలు పెట్టడానికి ఉపయోగిస్తారు
  • ఫలహారంగానూ, స్నాక్స్ గానూ ఉపయోగిస్తారు
  • ఉపవాసాల సమయంలోనూ తీసుకుంటూ ఉంటారు

మన వంటింట్లో దొరికే సగ్గుబియ్యం ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. చాలా రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సగ్గుబియ్యం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

వీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. ఈ సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, కాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సగ్గు బియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి తో పాటు ఐరన్ కాల్షియం, విటమిన్ కె లు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయట. సగ్గుబియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది.








రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చట. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి గర్భిణీ స్త్రీ లకు ఎంతో మేలు చేస్తాయి. పుట్టే పిల్లలకి కూడా చాలా మంచిదని చెబుతున్నారు. సగ్గుబియ్యంలో కాల్షియం, ఐరన్, విటమిన్ కె వంటివి ఉంటాయి. కాబట్టి, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయట. వీటిలోని కాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుందట. వీటిలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మజిల్స్‌ కి బలం, కండరాల సమస్యలు దూరమవుతాయట. ముఖ్యంగా, ప్రోటీన్‌ తో కలిపి తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. బరువు తక్కువ ఉన్నవారు ఈ సగ్గు బియ్యాన్ని తినడం అలవాటు చేసుకోవాలట. దీంతో మంచి వెయిట్ మెంటెయిన్ చేయవచ్చని చెబుతున్నారు.


వీటిని ఎక్కువ కేలరీల కంటెంట్ అనారోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోకుండా ఉండడం కూడా మంచిదట. వీటితో సరైన రీతిలో బరువు పెరుగుతారట. సగ్గుబియ్యం రెగ్యులర్‌ గా తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుందట. గ్లూటెన్ పడనివారు ఈ సగ్గు బియ్యాన్ని హ్యాపీగా తినవచ్చట. దీంతో జీర్ణ సమస్యలు కూడా రావని చెబుతున్నారు. వీటిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. జీర్ణ సమస్యలు, మలబద్ధకం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. సగ్గు బియ్యాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫిట్‌నెస్ మీ సొంతమవుతుందట. ఫిట్‌ గా మారతారు. వీటిని తరచుగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్‌ ని దృష్టిలో పెట్టుకోవాలి. బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే బలహీనత తగ్గి తక్షణ శక్తి పొందవచ్చట. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ బూస్టర్‌ లా పని చేస్తాయట. ఉపవాసంలో చాలా మంది వీటితో కిచిడీ, పాయసం చేసి తాగడం మంచిది. ఇలా చేస్తే ఉపవాసంతో అలసిన శరీరానికి అప్పటికప్పుడు ఎనర్జీ అందుతుందట. సగ్గుబియ్యాన్ని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మధ్యాహ్నం అన్నం తినే వరకూ ఎనర్జీగా ఉంటారట. వీటిని మధ్యాహ్నాం తీసుకుంటే ఎక్కువగా తినకుండా ఉంటారట. వీటిని వర్కౌట్‌ కి ముందు తీసుకుంటే ఎనర్జీగా ఉంటారట. ఎక్సర్‌సైజ్ పర్ఫెక్ట్‌ గా చేస్తారని చెబుతున్నారు.

No comments:

Post a Comment