Liver Health: మీ కాలేయం ఆరోగ్యంగా మారాలంటే నెల రోజుల పాటూ ఈ సూపర్ టిప్స్ పాటించండి
కాలేయం శరీరానికి శక్తి కేంద్రంగా చెప్పవచ్చు. కాలేయం సరిగా పనిచేయకపోతే శరీరం బలహీనపడుతుంది.
కాలేయం శరీరాన్ని విషపదార్థాల నుండి శుభ్రపరిచే అవయవం. అయితే, తప్పుడు జీవనశైలి, అధిక జంక్ ఫుడ్, మద్యం సేవనం వల్ల కాలేయంలో విషపదార్థాలు చేరి, దాని పనితీరును క్రమంగా తగ్గిస్తాయి. కాబట్టి, సమయానికి కాలేయాన్ని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. దీన్నే డీటాక్సిఫికేషన్ అంటారు. కాలేయం డీటాక్స్ చేకోవడానికి ఉపయోగపడే టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
అధికంగా నీరు త్రాగండి
కాలేయం డీటాక్స్ చేసుకోవడానికి నీరు ఉత్తమ మార్గం. ఇది కాలేయం డీటాక్స్ చేసుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. కాలేయంలోని విషపదార్థాలు బయటకు పోకపోతే అనేక సమస్యలు వస్తాయి. అధికంగా నీరు త్రాగడం వల్ల కాలేయం విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపేందుకు సహాయపడుతుంది. ఫిల్టర్ చేసిన నీటినే రోజులో ఎక్కువసార్లు తాగుతూ ఉండండి.
విషపూరిత ఆహారాలకు దూరంగా ఉండండి
ఫాస్ట్ ఫుడ్ చాలా మందికి ఇష్టం. ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మీరు తెలియకుండానే అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటారు, ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. కాలేయం శుభ్రపరచడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినడం ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలతో వండిన ఆహారాన్నే తినాలి.
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు
మీ ఆహారంలో పొటాషియం సమృద్ధిగా ఉంటే, అది మీ కాలేయం శుభ్రపరచడంలో సహాయపడుతుంది. టమాటో సాస్, బీట్‌రూట్ ఆకులు, పాలకూర, బీన్స్, అరటిపండ్ల వంటి ఆహార పదార్థాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా అధిక పొటాషియం పొందవచ్చు.
ప్రతిరోజూ వ్యాయామం చేయండి:
వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరం నుండి వెలువడే చెమట డీటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రారంభించండి. యోగా, పరుగు, జిమ్ వ్యాయామాలు ప్రభావవంతంగా ఉంటాయి. ప్రతిరోజూ అరగంట నుంచి గంట వరకు వ్యాయామానికి కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)