2.27.2025

ఈ నలుపు ఎందుకు వస్తుందో చాలామందికి తెలీదు. శరీరమంతా ఒకరకంగా ఉండి మెడ మాత్రమే నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు.

ఈ నలుపు ఎందుకు వస్తుందో చాలామందికి తెలీదు. శరీరమంతా ఒకరకంగా ఉండి మెడ మాత్రమే నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు.


అయితే కొన్ని ఇంటి చిట్కాలతో మెడపై నలుపును ఈజీగా పోగొట్టవచ్చు. అవెంటో చూసేయండి.

శరీరం మొత్తం ఒకే రంగులో ఉండి మెడ మాత్రం నల్లగా ఉంటే చూడటానికి బాగోదు. ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. రోజూ స్నానం చేసినా.. రకరకాల సబ్బులు వాడినా ఫలితం ఉండదు. కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, జన్యు కారణాలు, చర్మ సమస్యలు మెడ నల్లగా మారడానికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వస్తుందట. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఇక్కడ చూద్దాం. 

కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ చుట్టూ నలుపు వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్ ఉన్నవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధులు ఉన్నవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల మెడ చర్మం లోపలి కణాల్లో వర్ణద్రవ్యం ఏర్పడుతుంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. దీనికోసం ఎన్ని క్రీములు, సబ్బులు వాడినా ఫలితం ఉండదు. అందుకే మెడ నలుపు ఉన్నవాళ్లు చర్మ వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సాధారణ కారణాల వల్ల వచ్చే నలుపును కొన్ని ఇంటి చిట్కాలతో పోగొట్టవచ్చు.

మెడపై నలుపును తొలగించడంలో పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మెడకు పట్టించి 10-15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. పెరుగు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తే మెడపై నలుపు తగ్గుతుంది. 

ఒక దూదిని ఉపయోగించి నిమ్మరసాన్ని మీ మెడకు రాయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో తుడవాలి. నిమ్మరసం చర్మంపై ఉండే మృతకణాలు, నూనె, దుమ్మును తొలగిస్తుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తే మెడపై నలుపు తగ్గుతుంది. ముఖ్యంగా నిమ్మరసం ఉపయోగించిన తర్వాత మీ చర్మానికి సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.


- రోజ్ వాటర్, నిమ్మరసం సమానంగా కలిపి రాత్రి పడుకునే ముందు మెడకు రాసి ఉదయం స్నానం చేయాలి.

- బాదం నూనెను కొద్దిగా వేడి చేసి మెడకు రాసి పది నిమిషాలు మసాజ్ చేసి తర్వాత స్నానం చేయాలి.

- కొబ్బరి నూనెను మెడకు రాసి మసాజ్ చేసి వేడి నీటితో స్నానం చేయాలి. కావాలంటే బాదం లేదా ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇలా తరచూ చేయడం ద్వారా మంచి ఫలితాలు చూడవచ్చు.